విజ్ఞానకోశము - ౨
ఉష్ణమండలపు వ్యాధులు
3. మాలిగ్నెంటుటర్షియం: ఈ వ్యాధి సోకినపుడు మిగుల ప్రమాదకరములగు ఈక్రింది రుగ్మతలు రావచ్చును.
(ఆ) మెదడు చలిజ్వరము (సెరిబ్రల్ మలేరియా) : ఇందుసంధించుట, మూర్ఛపోవుట, స్మృతి తప్పుట జరుగును.
(ఆ) జ్వరతీవ్రత ఎక్కువగుట: ఇందు ఉష్ణోగ్రత 107° - 111° ల వరకు ఉండును.
(ఇ) వాంతులు, నీటి విరేచనములు, కడుపునొప్పి.
(ఈ) పైత్యసంబంధమైనవి ; ఇందు స్వల్పముగా కామేరలు వచ్చును.
(ఉ) సల్లనీటి జ్వరము : రోగి హఠాత్తుగా నల్లనిరంగు గల మూత్రమును విసర్జించును.
రక్తములోని ఎఱ్ఱ కణములు నశించుటవలన మూత్రములో హెమోగ్లోబిక్ రూపాంతరము లుండును.
దీర్ఘ కాలముగ నున్నచో మలేరియా రోగిని అశక్తుని చేయును. మరియు ప్లీహ, కాలేయములు పెరుగుటకును, పాండు రోగమునకును హేతువగును. ఇందులకు తీసికొనవలసిన నివారణ చర్యలు :
(1) దోమల బాధ గల ప్రదేశములనుండి దోమలను డి. డి. టి మొదలగు సాధనములద్వారా నిర్మూలించుట.
(2) వ్యక్తిగత జాగ్రత్తలు : (i) దోమ తెర నుపయోగించుట (ii) పగలు సరియగు దుస్తులను ధరించుట. (iii) మీథైక్ థేలేడ్ వంటి మందులను ముఖము, కాళ్ళు, చేతులు మొదలగు దోమకాటుకు గురికాగల అవయవము ఉష్ణమండలపు వ్యాధులు లపై రాచుకొనుట, (iv) క్లోరోక్వింగాని, పాలొ డ్రిన్ గాని వారమునకు ఒకమారు తీసికొనుట,
జ్వరము వచ్చినపుడు ఈ క్రింది ఔషధములలో దేనినైనా సరియగు మోతాదులలో నుపయోగింపవచ్చును. (1) క్వినైన్ (2) మెపాకై (3) పాలో డ్రిస్ (4) క్లోరో క్విన్ (5) డారాప్రిం. నల్లనీటిజ్వరము వచ్చినపుడు రక్తమును ఎక్కించుటవలన ప్రాణసంరక్షణము కలుగును.
7. విషపాండు జ్వరము (కాలాజార్) : వీష్ మన్ డొనవాన్ క్రిములవలన కలుగును. ఇవి నెత్తురులోను, ఎముకల లోను, అంతర్భాగ అవయవములలోను ఉండును. ప్లబాట మస్ అను ఎగి రెడు పురుగులు దీనిని వ్యాపింపచేయును. ఇది మదరాసు, అస్సాం, బెంగాలు రాష్ట్రములలో వచ్చును. ఇది మధ్యధరా ప్రాంతములో శిశువ్యాధి రూపమున వచ్చును. అంకురించుకాలము 1-12 మాసముల తర్వాత. (1) జ్వరము రోజుకు రెండుసార్లు హెచ్చును. (2) చర్మము నల్ల బడును. (3) రక్తము తగ్గిన శరీరము పాలిపోవును. (4) బరువుతగ్గును. (5) కాలేయము, ప్లీహము పెద్దవి యగును. అంటిమనీ ఔషధములను సూదిమందుద్వారా యిచ్చినయెడల గుణము కనబడును.
ట్రైపైన సోమయాసిన్ : ఇది ట్రివను సోనూ, రొడిసియం మరియు గాంబియంసీ అను జీవాణువులచే వ్యాపిం చుమ. సిర్సి అను ఈగచే ఒకరినుండి మరొకరికి అందచేయబడును. ఇది ఆఫ్రికాఖండమందలి ఉష్ణమండల ప్రాంతములో