ఉష్ణమండలపు వ్యాధులు
సంగ్రహ ఆంధ్ర
తిరుగబెట్టుటకూడ కలదు. అసూక్ష్మక్రిములను జ్వర కాలములో రక్తమునుండి సంపాదింపవచ్చును. టిక్ పురుగువలన కలిగిన జ్వరము ఇంకను ఎక్కువమార్లు తిరుగ బెట్టును కాని ఇందు జ్వరముండు కాలము తక్కువ. ఆర్ సెనికల్ ఔషధములనుకాని పెన్సిలినును కానీ జ్వరమువచ్చిన వెంటనే సూదిమందు ద్వారా యిచ్చిన యెడల తరచు గుణము కనబడును.
4. ప్లేబాటమస్ జ్వరము : ఇది వేసవి నెలలయందు పెరిగెడు పురుగుచే వ్యాపింప చేయబడిన రసిద్వారా వచ్చును. ఈజ్వరము అంకురించు కాలము 7 దినములు. తర్వాత జ్వరమువచ్చి శరీరమం దంతటను అంతర్గతముగ నొప్పులు వచ్చును. జ్వరము డెబ్బది రెండు గంటలుండును. ఇందు మరణించుట ఎన్నటికిని జరుగదు. ఈ జ్వరము ఒకసారి వచ్చినచో తిరిగిరాదు.
5. ఎలుకకాటు జ్వరము : ఎలుక కాటువలన అందచేయబడిన స్పయిరలం మైనస్ అను క్రిమి సంబంధమైన రసివలన ఇది వచ్చును. కాటువేయబడినచోట నొప్పియుండును. మాంసగ్రంథులు వాయుటకూడ జరుగవచ్చును. జ్వరము సుమారు ఆరుదినముల కొకసారివచ్చి ఒకటి రెండు దినము లుండును. ఆర్సెనికలు ఔషధములును, పెన్సిలిన్ ఔషధమును ఈ వ్యాధిని పోగొట్టును.
6. చలిజ్వరము (మలేరియా) : ఆడ ఎనాఫిలైన్ దోమల మూలమున ఈ వ్యాధి ఒకరి నుండి మరి యొకరికి అంద జేయబడును. మలేరియా అన్యాధారజీవి (పారసైట్). కొంత కాలము మానవులందును, మరికొంత కాలము దోమ యొక్క గర్భపు గోడయంచును పెరుగును.ఈ అన్యాధార జీవులు రక్తములో ప్రవేశింపగనే శక్తిమంతములగును. అంకురించు కాలము 12 రోజులు. ఈ కాలములో అన్యాధారజీవి కాలేయములో పెరుగును.
సాధారణమలేరియా వ్యాధియందలి దశలు :
(1) ఉత్పత్తిదశ : ఇందు కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు ఉండును.
(2) వణకువచ్చు దశ : ఇందు వణకు, జ్వరము హెచ్చుట యుండును. ఇది అరగంట మొదలు రెండు గంటలవరకు ఉండును
(3) అధికజ్వరముండు దశ : ఎక్కువ ఉష్ణోగ్రత యుండును. కాని వణకుట యుండదు. ఈ పరిస్థితి 4 గంటలు మొదలు 6 గంటలవరకు ఉండును.
(4) చెమటపట్టు దశ : చెమటపట్టి శరీర ఉష్ణోగ్రత మామూలు స్థితికి వచ్చును.
మలేరియా వ్యాధియందలి వివిధ రకములు :
1. చినైన్ టర్షియన్ : ఇందు రోజువిడచి రోజు జ్వరము వచ్చును.
2. క్వార్టన్: ఒకరోజు జ్వరమువచ్చి మరల రెండు రోజులు మాని మరల మూడవనాడు వచ్చును.
పటము 6.మూడు రకముల చలిజ్వరపు పటము