Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఉష్ణమండలపు వ్యాధులు

పటము 3. చలిజ్వరము (మలేరియా) అన్యాధారజీవి యొక్క జీవిత చరిత్ర

1. దోమదశ: నెత్తురులోని మలేరియా క్రిములను దోమ త్రాగును. మగ ఆడ భేదముగల లింగరూపములు ఏకమై కడుపుగోడయందు గ్రుడ్డుగా మారును. ఆవి పగిలి స్పరోజాయిట్సు అను పురుగులు మరల దోమ కరచిన యెడల నెత్తురులోనికి పోవును.

2. లింగభేదము గల రూపములు రక్తకణములలో నున్నవి. కొన్ని మగ ఆడు రూపములు ధరించును. ఇవి దోమ కడుపులోనికి పోయిన పిదప మరల పెరుగును.

3. మలేరియా పురుగు కాలేయకణములలో వృద్ధిపొందును. ఈ దశలో జ్వరముండదు.

4. రక్తములోని దశ : కాలేయమునుండి బయటికివచ్చిన పురుగులు కణములలో తిరిగి పెరిగి, కణములు పగిలి బయటికి వచ్చును, మరల రక్తములోనికి పోవును. ఇట్లు బయటికి వచ్చినపుడు జ్వరమువచ్చును.