ఉల్కలు
సంగ్రహ ఆంధ్ర
పునాదులపైననే చెకోవ్ (chekov), ముప్పసాన్ (muppasaunt) మున్నగు పాశ్చాత్య కథాకారుల ననుసరించుచు, ఉర్దూకథానికలు వ్రాయబడుచున్నవి. మంటో, జేడీ, కృష్ణచంద్ర, ఇస్మత్, హయాతుల్లా, అహ్మదలీ, ఆహ్మద్ నదీం ఖాసిమీ, బలవంతసింగ్, గులాం అబ్బాస్, ఇబ్రాహీం జలీస్ లును హాజరామస్రూర్, స్వాలిహా ఆబిద్ హుశేన్, ఖదీజామస్రూర్, తస్నీం సలీం, అను నలుగురు యువతులును, మహేంద్రనాధ్, సుహేల్, షఫీఖుఱ్ఱహ మాన్, మున్నగువారలనేకులు కథానికలు వ్రాసి నేటి ఉర్దూ సాహిత్యమునకు వన్నె తెచ్చినారు.
వచన వాఙ్మయము యొక్క ఇతర రంగములందును విరివిగా సాహిత్యరచన జరిగినది. నాటకములందు మొట్టమొదట లక్నో వాజిద్ ఆలీషాః కాలమున 'ఇంద్రసభ' అనునది రచింపబడి ప్రదర్శింపబడినది. తరువాత పారసీ ధియేట్రికల్ కంపెనీ వారి ప్రదర్శనములు ప్రజల నాకర్షించిసవి. రౌనక్ బనారసీ, తాలిబ్, అహన్ లక్నవీ, ఆగా హైదర్, ఆకాలపు ముఖ్య నాటకకర్తలు. వీరిలో ఆగా హైదర్ సుప్రసిద్ధుడు. ఉర్దూలో సాహిత్యదృష్ట్యా పేర్చొనదగిన ఉచ్ఛశ్రేణికి చెందిన నాటకము మిగులయరుదు. ఇష్తియాక్ హుశేన్, ప్రొఫెసరు ముజీబ్, డాక్టర్ ఆబిద్ హుశేన్, మంటో, మిర్జాఅదీబ్, ఉపేంద్రనాథ్, కపూర్, హబీబ్ తస్వీర్, షౌకత్ థానవీ, మున్నగువారు నాటకములను రచించినను, ఉత్తమనాటకము లింకను రచింపబడలేదు. దేశయాత్రా చరిత్రలు, జీవితచరిత్రలు మున్నగునవి రచించినవారిలో ఫరహతుల్లా బేగ్ . రషీద్ అహమ్మద్ సిద్దికి, ఖ్వాజా అబ్దుల్ గఫ్ఫార్, మౌలానా అబ్దుల్ మజీద్, నియాజుఫతే హాపూరి, ఖ్వాజా హసన్ నిజామీ, మున్నగువారిని పేర్కొనవలయును. సాహిత్య విమర్శకులలో డాక్టర్ అబ్దుల్ హక్, ప్రొఫెసర్ హమీద్ హుస్సేన్, నియాజ్ ఫ తేహపూరీ, సజ్జాద్ జహీర్, ప్రొఫెసర్ ఆలీ అహ్మద్, ఎహైషాంహుశేన్, డాక్టర్ అబ్దుల్లా మున్నగువారు గణనీయులు. సాహిత్యచరిత్రకారులలో మహమ్మద్ షేరానీ, హామిద్ హుశేన్, నసీరుద్దీన్ హాపిమీ, అబ్దుస్సలాంనద్వీ, డాక్టర్ రాంబాబు సక్సేనా, మలిక్ రాం, వికార్ అజీం, ప్రొఫెసర్ సర్వరీ, డాక్టర్ జోర్ మున్నగువారలు ముఖ్యులు. వైజ్ఞానిక, ధార్మిక, చారిత్రక, విద్యావిషయకములగు శాస్త్రీయ వాఙ్మయమ్మను సుసంపన్న మొనర్చిన వారలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ అబిద్ హుశేన్, గులాము స్సయ్యదైన్, డాక్టర్ జాకిర్ హుశేన్లే, మౌలానా సులేమాన్ నద్వీ, మౌలానా అబ్దుర్ మజీద్, జఫర్ హుశేన్, సయీద్ అహ్మద్, హిఫ్టుఱ్ఱహమాన్, హుశేన్ అహ్మద్ మదనీ, మనాజరుల్ హసన్ గిలానీ, ఖలీక్ అహ్మద్ నిజామీ, అబ్దుల్లా మౌదూదీ మున్నగు పండితులు కలరు. పత్రికారచన మున్నగు ఇతర గద్య సాహిత్యరంగాలలోను సుప్రసిద్ధ పాత్రికేయులు మొదలగువారు కలరు. అంజుమనే తరక్కీ ఉర్దూ, దాయరతుల్ ము ఆరిఫ్, 'దాయరతుల్ ముసన్నీ ఫన్ మున్నగు సాహిత్యసంస్థలు నిరంతర కృషి సల్పుచున్నవి. అభ్యుదయ సాహిత్య సంస్థలును బహుముఖ ప్రయత్నము లొనర్చుచున్నవి.
ఈ విధముగా ఉర్దూ సాహిత్యము ఇతరదేశ భాషా సారస్వతములవలె సర్వతోముఖమగు అభివృద్ధిని గాంచుచున్నది. నేటి మారిన పరిస్థితులందు రాజభాషయగు హిందీ యొక్క సార్వజనీనతవలన, ఉర్దూభాషాసాహిత్యములకు కొంత ప్రోత్సాహము తగ్గినను, దాదాపు ఏడు శతాబ్దముల క్రింద హిందూ ముస్లిం సాంస్కృతిక సమన్వయ చిహ్నముగా నుత్పత్తినొంది, దినదినాభి వృద్ధిగాంచి, సర్వాంగ సుందరమగు సాహిత్యసంపదను గలిగి, పటిష్ఠములును, ప్రభావయుతములునగు, ఉర్దూ భాషాసారస్వతములకుఎట్టి ముప్పువాటిల్లదని నిస్సందేహముగా చెప్పవచ్చును. భాషావారీగా ఏ ప్రత్యేక ప్రాంతము నసు, ఉర్దూ మాతృభాషగా గలవారికి సంఖ్యాధిక్యత లేకపోయినను, అఖిల భారత సమాఖ్యలో దాదాపు ఐదు కోట్ల ప్రజల కభిమాన భాషయై, దాదాపు మూడున్నర కోట్ల ప్రజలకు మాతృభాషయైన ఉర్దూభాషా సారస్వతముల యొక్క భవిష్యత్తు సురక్షితమైయున్నదని నిశ్శంకగా విశ్వసింపవచ్చును.
బూ. రా
ఉల్కలు (Meteors) :
మేఘరహితమైన ఆకాశమును రాత్రివేళ జాగ్రత్తగా పరిశీలించినచో, ఆకస్మికముగ అగుపడి, ఆకాశమునుండి కొంత దూరము శరవేగముతోదిగి అదృశ్యమగు నక్షత్రములవంటి అంతరిక్ష వస్తువులు (celestial objects