ఉపనిషత్తులు
సంగ్రహ ఆంధ్ర
నీచ వంశమందుబుట్టి ఎవ్విధముగను రాజ్య ప్రాప్తికి అర్హత లేని మానవునకు జనించిన రాజ్యేచ్ఛ ఎట్లు విఫలేచ్ఛ
అగుచున్నదో, అటులనే మోక్షేచ్ఛ సర్వజన సాధారణమైనను, నిత్యాఽ నిత్యవస్తువివేకాది సాధన సంపత్తిలేక యే
మోక్షమును గోరువానిఇచ్ఛ విఫలేచ్ఛయగును. కావున సఫలేచ్ఛయే (సాధన సంపత్తితోగూడినవారి మోక్షేచ్ఛయే) ఇచ్చట ముముక్షుత్వము అనబడును. కాన విరోధములేదు.
ఇట్టి సఫలేచ్ఛకలవానికే బ్రహ్మవిద్యయందు అధికారముకలదని శ్రీ వ్యాసమహర్షి ఉత్తరమీమాంసా శాస్త్రములో "అథాఽతో బ్రహ్మజిజ్ఞాసా" అను సూత్రముచే (జిజ్ఞాసాధిక రణములో) సాధన చతుష్టయ సంపత్త్య నంతరమున బ్రహ్మజ్ఞానముకొరకు విచారణచే యవలెను అని చెప్పియుండిరి.
బ్రహ్మలక్షణము : "లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధిః” అను తార్కిక సమయానుసారము ఏవస్తువునైన తెలిసి కొన దలచినవాడు అవస్తువునకు అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవము అను మూడు దోషములచే దూషితము కాని అనగా నిర్దుష్టమగు లక్షణమును, ప్రమాణమును చెప్పినచో, ఆవస్తువును తెలిసికొనుట శక్యమగును. ఎట్లన: గొః కిం లక్షణం ? సాస్నాదిమ త్త్వం లక్షణం. అనగా గోవును ఎరుగనివానికి దానిని తెలియజెప్పవలెనన్న- గంగడోలు వగై రాలు కలది గోవు. అది చక్షురింద్రియ ప్రమాణముచే తెలిసికొనదగినది, అను రీతిగా గోవును గూర్చి లక్షణప్రమాణములను చెప్పినచో గోరూపవస్తుజ్ఞాన మెట్లుగల్గునో, అటులనే ప్రకృతములో బ్రహ్మజ్ఞానము కావలెనన్నచో బ్రహ్మమునకు లక్షణ ప్రమాణములను చెప్పుట అవసరము.
బ్రహ్మమునకు లక్షణములు రెండు. 1. తటస్థ లక్షణము. 2. స్వరూపలక్షణము (ఉపనిషత్తులలో),
1. తటస్థలక్షణము : ఇట శ్రుతి - యతోవా ఇమాని భూతాని జాయంతే! యేన, జాతానిజీవంతి | యత్ప్రయం త్యభిసంవిశంతి | తద్విజిజ్ఞాసస్వ, తద్భహ్మేతి | (తై.ఉ.4.) అనగా మనచే చూడబడుచున్న సమస్త భూతములును ఎవనివలన పుట్టుచున్నవో, ఉత్పన్నములైన సర్వభూతముల్లును ఎవనిమూలమున జీవించుచున్నవో, వినాశనమును పొందుచున్న సర్వభూతములును ఎవనియందు లీనమగుచున్నవో అదియే బ్రహ్మము. అనగా జగత్తుయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు కారణమైనదియే బ్రహ్మము. ఈవిధముగా వరుణుడు తనపుత్రుడగు భృగువునకు బ్రహ్మ లక్షణమును చెప్పెను. 'తథాచ - సృష్టి, స్థితి, లయ కారణత్వం, బ్రహ్మత్వం ఇతి ఫలితం' దీనినే ఉత్తర మీమాంసా శాస్త్రములో “జన్మాద్యస్య యఈ" (ఉ. మీ. 1. 1. 2.) అనిచెప్పి ఈ సూత్రమునకు విషయ వాక్యముగా ప్రకృతమగు (యతోవా ఇవనీత్యాది) ప్రతివాక్యము నుల్లేఖించిరి.
దృష్టాంతత్రయము :-ఇట్లే బ్రహ్మమునకు భూత కారణత్వమును, ప్రసిద్ధ దృష్టాంత త్రయముచే ముండకోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది.
"యథోర్ణనాభి స్పృజతే గృష్ణా తేచ, యథాపృథివ్యా మోషధయ స్సంభవంతి, యథా సత పురుషాత్కేశ లోమాని, తథాఽక్షరా త్సంభవ తీహ విశ్వం" (1 ముం. 1-7)
లోకములో కారణమాత్రము, సహాయము లేనిదే, కార్యమును సృజింపజాలదు. నీళ్ళు, చక్రము మున్నగువాటి సహాయములు లేనిదే, కుమ్మరివాడు ఒక్కడును కుండలను నిర్మింపజాలడు. అట్లే సహాయశూన్యుడగు పరమాత్ముడు (బ్రహ్మము) ఒక్కడు జగత్తును ఎట్లు సృజింపగలడు అనినచో సమాధానము కారణమాత్రము సహాయము లేనిదే కార్యము సృజింపబడదు అను వ్యాప్తి, దోషగ్రస్త మగుటచే, ఊర్ణనాభి దృష్టాంతముచే, బ్రహ్మమునకు జగత్కారణత్వమును శ్రుతి చెప్పుచున్నది (యథోర్ణ...తేచ. దీని యర్థమిది. లోకములో (ఊర్ణనాభి) సాలె పురుగు ఇతర సహాయము నపేక్షింపకయే స్వయముగా దారము నెట్లు సృజించునో అటులనే పరమేశ్వరుడుకూడ ఇతరసహాయము నపేక్షింపకయే జగత్తును సృజించును.
లోకములో కార్యోత్పత్తి స్థలములో కార్యము పుట్టిన పిదప కారణమునకు (పూర్వావస్థాపమర్దము) పూర్వావస్థ యొక్క మార్పుగాని, పూర్వాకారము యొక్క తీరోధానముగాని చూడబడుచున్నది. ఎట్లన: మట్టి ముద్దచే కుండను నిర్మించినపిదప కారణమగు మట్టిముద్ద యొక్క పూర్వావస్థ ఎట్లు మారునో, మరియు