Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఉద్యానకృషి


తోటయందు ప్రతివిభాగమునందును చెట్లునాటు స్థలము లను గుర్తించిన పదవ గోతులను త్రవ్వవలెను. మెత్తని భూములలో గోతులు త్రవ్వనవసరముండదు. విస్తరించి ఎదుగు మామిడి, జామ, నిమ్మజాతులు, సపోటా మొదలగు వానికి 3X3X3 అడుగులు లోతుకలిగిన గోతులుండ వలెను. అరటి, బొప్పాయి, ఫాల్సా మొదలగు జాతులకు 1½x1½x1½ అడుగుల గోతులు చాలును, గోతులలోని మీది సగముభాగమును మట్టితో బాగుగా చీకిన పశువులు యెరువు, వండలిమట్టి 10 గంపలు కలిపి నింపవలెను. వీనితో పాటు ఒకటి లేక రెండు శేర్ల ఆముదపుపిండిని కూడ కలిపినచో, చెదల బాధ తగ్గును. గోతులను భూమిపైకి 6 అంగుళముల ఎత్తువరకు నింపి మట్టి బాగుగా క్రుంగిన తరువాత మొక్కలను నాటి, వాటిని ప్రక్కలయందు పాతిన కఱ్ఱలకు త్రాళ్లతో కట్టవలెను.

ప్రవర్ధనము : విత్తనములను చల్లియు, కొమ్మల యొక్క ఖండములను నాటియు మొక్కలను ప్రవర్ధనము చేయవచ్చును. పనస, కొబ్బరి, జీడిమామిడి, నేరేడు, ఫాల్సా మొదలగు జాతులు విత్తనములవలన అభివృద్ధి చేయబడును. చెట్ల యొక్క కొమ్మలతో ప్రవర్ధనము వేర్వేరు పద్ధతులలో చేయబడును. అంజూర, ద్రాక్ష జాతులు కొమ్మల యొక్క ఖండముల వలనను, జామ నేలంట్లు వలనను, నిమ్మజాతులు మొగ్గంట్లు వలనను, మామిడి, సపోటా చేర్పు అంట్లు వలనను ప్రవర్ధనము చేయుట ఆచారము.

మేలైన జాతుల విత్తనములయొక్క. లేక, పండ్ల మొక్కల యొక్క సేకరణము : ఈ విషయమున ప్రత్యేక శ్రద్ధ వహించుట ఎంతేని అవసరము. తక్కువ రకపు మొక్కలను, దొరికినవాని నెల్ల నాటిన యెడల వానినుండి తగు ఫలసాయము లభింపక, చేసిన ప్రయత్నములన్నియు వృథయగును. పండ్ల చెట్లు ఎక్కువ కాలముండి, ఫలితము నిచ్చెడివగుటచే మేలైన జాతుల మొక్కలను నాటుటయే శ్రేష్ఠము.

సేకరించదగిన కొన్ని పండ్లజాతుల రకములు :

మామిడి : (1) అల్ఫాన్సొ, బెనిషన్, మల్హోబా, దసేరి (కోతరకములు); (2) పెద్దరసము, చిన్న రసము, నాగుల పల్లి యిర్సాలు, పంచదార కలసి, (రసపురకములు) ; (3) ఆధుని, అచార్, పసంద్ (ఆవకాయ రకములు).

జామి : అలహాబాద్ సుపేద. ద్రాక్ష: అనబేషాహి, పచ్చద్రాక్ష, కిస్మిస్. సీతాఫల జాతులలో : లక్ష్మణాఫలము. అంజూర : మైస్రమురకము. అరటి : బస్రాయ్, చక్కెరకేళి, అమృతపాణి. నిమ్మ: పుల్ల నిమ్మ, కాగజినిమ్మ. తియ్యనారింజ : సాత్కుడి, బత్తాయి, మొసాంబి. బొప్పాయి : హనీడ్యూ, వాషింగ్ టన్. సపోటా : పాలసపోటా, గుండ్రని రకము.

మొక్కలను నాటుట, భూమిపేద్యము, నీటి పారుదల: పండ్ల మొక్కలను వర్షాకాలము లోపలనే నాటుట మంచిది. ఎండగానుండు పగటి సమయములందు, వేసవి నెలలయందు చెట్లను నాటరాదు. మొక్కలను నాటుటకు ముందు క్రిందనుండు కొన్ని యాకులను త్రుంచివేసి, నాటిన తరువాత చుట్టునున్న మట్టిని గట్టిగా నొక్క వలయును. వెంటనే నీరుపోయుట అత్యవసరము. నాటిన తరువాత కొంతకాలము వరకును సూర్యరశ్మి తిన్నగా తగులకుండు నట్లును, పశువులనుండి, మేకలనుండి రక్షణము కొరకును మొక్కల చుట్టును కంపను నాటవలెను.

భూమియందు పదును ఆరకుండుటకు తోటలోని విభాగముల చుట్టును గట్ల నేర్పరచవలెను. వర్షాకాలా రంభమునను, శీతాకాలారంభము నను తోటభూమినిదున్నుట అవసరము. అవనరమునుబట్టి అప్పుడప్పుడు కలుపుగడ్డి లేకుండ అంతరకృషి చేయుటకూడ ముఖ్యము. ప్రతి సంవత్సరమును తొట

3 వ పటము

గృహూప వనమునందలి పూలమడి నమూనా