ఉద్దేశాత్మక మన స్తత్వవాదము
సంగ్రహ ఆంధ్ర
ఇరువదవ శతాబ్ది ఆరంభమున నిలచియున్న మనస్తత్వ శాస్త్రపు పోకడలు కొంతమందికి నచ్చలేదు. కేవలము మనస్సునకే ప్రాధాన్య మిచ్చుటకాని, కేవలము బాహ్య చర్యల పైననే ఆధారపడి వ్యక్తిలోని ఆంతర చైతన్యమును గుర్తింపకుండుటగాని, వీరికి సంతృప్తికరము కాకపోయెను. బాహ్యచర్యకును, అంతర చైతన్యమునకునుగల సంబంధమును చర్చించుట ముఖ్యమని వీరి వాదము. ఇట్టి వారిలో ప్రథముడు మాగ్డూగల్ అనునతడు. ఇతడు 1912 లో తన ఉద్దేశాత్మక మనస్తత్వ వాదమును చర్చించి, ప్రతిపాదించి యుండెను.
మన స్తత్వ శాస్త్రములో కారణములు, ప్రోద్బలములు, ఉద్దేశములు (motives, urges, purposes) ప్రధానములని మాగ్డూగల్ వర్గమువారు వాదించిరి. ప్రతి బాహ్యకార్యమునకును అంతరకారణము ముఖ్యము కాక తప్పదని వీరి వాదము. వీరి ఈ సిద్ధాంతమునకు ముఖ్య కారణము ఉద్దేశము. కనుక ఇది ఉద్దేశాత్మక మన స్తత్వ వాదము (purposive psychology) అని వ్యవహరింప బడినది. Hormic అనగా- గ్రీకుభాషలో “ప్రోద్బలము (urge)". ఈ పదమును బట్టి ఈ వాదమునకు ఆంగ్లమున Hormic Psychology అను పేరు పెట్టబడెను.
ఈ సిద్ధాంతములో ఉద్దేశము (purpose) ప్రధానాంశము. మానవ చర్యలన్నియు ఉద్దేశ పూర్వకములే. ఇంతకుముందు మానవ చర్యలలో ఇచ్ఛ (will) ఒక ముఖ్యాంశముగా గైకొనబడియుండెను. మానసిక చలనము (sensory stimulation) కండరములలో మార్పును తెచ్చి ఇచ్ఛను కలిగించును. కాని ఈ ఇచ్ఛను కార్యరూపములోనీకి మార్చుటకు మరొక శక్తి ఆవశ్యకము. అదియే ఉద్దేశము, క్రియాత్మక సిద్ధాంత (Behaviourism) వాదియగు వాట్సన్ (Watson) అంతర చైతన్యమును అంగీకరింప లేదు. అందుచే ఇతడు ఉద్దేశమును నిరాకరించెను. అతని దృష్టిలో బాహిర చైతన్యము, పరిసర ప్రభావజనితమే కాని ఆలోచనాధీనము కాదు. ఇతడు ప్రాణికోటినెల్ల, తన దృష్టిలో నుంచుకొని ఈ నిర్ణయమునకు వచ్చినట్లు కనబడును. జంతువుల చర్యలు కేవలము పరిసర ప్రభావ జనితములై నవుడు మానవులచర్యలు మాత్రము ఏల అట్టివి కారాదు?
ఈ బాహిరచై తన్యము ఒక ఉద్దేశముతోను (purpose) గమ్యాన్వేషణతోను జరుగుచున్ననని అంగీరించకతప్పదు. అయినను ఈ వాదము నంగీకరింపని క్రియాత్మక వాదము చేసిన ఈ క్రింది ప్రతివాదములు గనునింపదగినవి.
"1912 లో నే క్రియాత్మక వాదులు అంతర చైతన్యమును నిరాకరించి యుండిరి. ప్రకృతి శాస్త్రజ్ఞులు ప్రకృతి విషయములను వాటి నడవడినిబట్టి పరిశీలించినట్లే, మానవుని కూడ. అతని చర్యలను బట్టియే పరిశీలింపవలసి యున్నది." అని వాట్ల ను వ్రాసియుండెను. జణ్. వై. కుడ్ (Z. Y. kuo) లను చైనా మానసిక శాస్త్రవేత్త ఇట్లనెను—“మానవ చర్యకు ఉద్దేశముకలదు అనువాదము నిరర్థకము. శ్రద్ధగా పరిశీలన చేయకుండుటకు ఈ వాదము ఒక సాకుమాత్రమే. నూనవ చర్యలను శ్రద్ధగా పరికించు కొలది, శరీర శాస్త్రవిజ్ఞానము పెంపొంచుకొలది ఉద్దేశవాదము సమసిపోవుననుటలో సందేహములేదు." ఈ అభిప్రాయముపై వుడ్ వర్తు చేసిన విమర్శనము గమనింపదగినది. "ఈ వాక్యములు ఉద్దేశాత్మకమైన వ్యక్తివే ఈ వ్యక్తి యొక్క ఉద్దేశము క్రియాత్మక వాది పదజాలములో ఉద్దేశములేదని నిరూపింపజూచుటయే. క్రియాత్మక వాదుల సిద్ధాంతము సనుసరించి ప్రతి వ్యాపారమును దాని సూక్ష్మభాగములలోనికి విడదీయవలెను. అయినను క్రియలకు వెనుక నున్న ఉద్దేశమును త్రోసివేయజాలము. ఒక వ్యాపారమును సూక్ష్మపరిశీలన చేసినను ఆ విభాగముల యథార్థత నశించదు. రసాయన శాస్త్రజ్ఞుడు వీటిని విభజించి, ప్రాణవాయువు, ఉదజనుల సంయోగముచే కలిగినదని కనుగొనినను నీరు అబద్దమని కాని, దాని వివిధ లక్షణములు మిథ్య అని కాని నిరూపింప జాలడు. ఈ దృష్ట్యా నీరు జగత్తున కెంతముఖ్యమో, ఉద్దేశము వ్యాపారమున కంత ప్రధానమని చెప్పవచ్చును."
ఉద్దేశాత్మక వ్యాపారము, గమ్యాన్వేషణయు ఒకటియే అని స్థూలముగా చెప్పవచ్చును. ప్రతిసంపూర్ణ ఉద్దేశాత్మక వ్యాపారములోను కోరిక (desire), నిరీక్షణ(Foresight) అను రెండు అంశములు కలవు. గమ్యము (goal) ఎదుట కనబడుచునే ఉండును. ఆ గమ్యమును చేరవలెనను కోరిక జనించును. ఒక్కొకప్పుడు ఈ రెంటికిని సమన్వయము లేక పోవచ్చును. ఉద్దేశాత్మకముగా గాని గమ్యాన్వేషణలో