విజ్ఞానకోశము - ౨
ఉద్దేశాత్మక మనస్తత్వ వాదము
ద్విదళ బీజకములను రెండు తరగతులుగా విభజించిరి. (1) 'Archichlamy deae' (ఆద్యపరిపుష్పితములు) (2) 'Sympetalae' (సంయుక్త దళబీజములు).
ప్రతి తరగతిలో కొన్ని ప్రసమూహములు గలవు. ప్రతి దానినికుటుంబములుగను, ప్రతీకుటుంబమును గణములుగను విభజించిరి. ప్రతి గణములో ఎన్ని యోజాతులు గలవు. ఉ॥ 'Sympetalae' అను తరగతిలో 'Malvales' అనునది ఒక ప్రసమూహము ‘Cohost'. ఈ 'Malvales' లో 'ఎనిమిది కుటుంబములు కలవు. ఆందులో Malvalae అను ప్రత్తి కుటుంబము ఒకటి. Maivalae లో Gossypium (గాసిపియం) అనునది ఒక గణము. ఈ గణములో ‘herbaceum' అనునది మనము సాధారణముగా చూచు ప్రత్తి మొక్క పేరు. ప్రత్తిలో కూడ ఎన్నియో రకములు గలవు. Gossypium herbaceum B.D. వీనిలో నొకటి. ప్రకృతిలో సహజముగా జరుగు సాంకర్యమువలనను, ఉపయోగకరములగు మొక్కలలో మానవుడు కృత్రిమముగా కలిగించు సాంకర్యమువలనను ఏర్పడిన మొక్కలలో గణములు, జాతులవరకు మాత్రమే ఉద్భిజ్జవర్గీకరణము నిలచిపోకరకములు లేక వంగడములవరకుకూడ సాగినది.
ఉ. స.
ఉద్దేశాత్మక మనస్తత్వ వాదము -(Hormic Psychology):
మన స్తత్వ శాస్త్రము (Psychology) బహు విధములైన పరిణామములను పొందినది. ఇందులకు ప్రధాన హేతువు, అదియొక నిర్దిష్ట శాస్త్రము (Exact Science) కాకపోవుటయే. ప్లేటో కాలమునుండియు యూరపులో మన స్తత్వశాస్త్రము వేదాంతశాస్త్రములో ఒక భాగముగా నుండెను. కాని 19 వ శతాబ్దములో అది వేదాంత శాస్త్రమునుండి చీలిపోయెను. పిదప ప్రకృతిశాస్త్రముగా అది పరిణమించి గొప్ప అభివృద్ధిని పొందినది. ప్రయోగాత్మక మన స్తత్వ శాస్త్రము (Experimental -Psychology), విద్యావిషయక మన స్తత్వ శాస్త్రము (Educational Psychology), సాంఘిక మనస్తత్వ శాస్త్రము
(Social Psychology), క్రియాత్మక మనస్తత్వశాస్త్రము (Behaviourism) మొదలయినవి మనస్తత్వ శాస్త్రము పొందిన బహువిధములైన పరిణామములకు ఉదాహరణములు. అందు ఉద్దేశాత్మక మన స్తత్వ వాదము (Hormic Psychology) కూడ ఒక ప్రత్యేకతను సంపాదించు కొన్నది.