Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఉద్భిజ్జములు - పరిసరములు


కాబట్టి ఆయాయుద్భిజ్జముల సహజ నిర్మాణ వ్యాపారములకును, నీరు కావలసినంత సంపాదించుకొని నిలువచేసి కొనుటకును చాల సంబంధము కలదు. వేరు యొక్క కొన భూమిలో నున్న నీటి హెచ్చుతగ్గులను గుర్తించగలదు. అది నీరు ఎక్కువగా నుండు దిక్కునకే పెరుగుచుండును. నీటి ప్రేరణచే గలుగు ఈ చలనమునకు 'జలా వర్తనము' (hydrotropism) అని పేరు. భూమి పై భాగమున నున్న పొరలు ఆరిపోవుచు భూమ్యంతరస్థమైన జలముయొక్క మట్టము క్రిందికిపోవుచున్నపుడు వ్రేళ్ళు చాలదూరము నీటిని వెంబడించుచు పెరుగుచుండును.

గాలియందున్న అర్ద్రతను బట్టి మొక్కలలో బాష్పోత్యేకముండును. గాలియొక్క తారతమ్యార్ధ (relative humidity of the atmosphere), గాలి యొక్క వేగము, ఉష్ణోగ్రత, 'వెలుతురు యొక్క తీక్షత' అను అంశముల హెచ్చుతగ్గులతో ఉద్భిజ్జములనుండి ఆవిరిగా ఇగిరిపోవు నీటి ప్రమాణము సంబంధించియుండును.

పరిణామక్రమమున పెక్కు రకముల మొక్కలు మార్పుచెంది నేలలో నీరు చాల తక్కువగా నున్న ప్రదేశములలో గూడ జీవింపగలుగుచున్నవి. వానికి ప్రత్యేకమైన ఉపయోజనము లుండును. అవి లేనిచో అవి త్వరలో చనిపోవును. నిర్మాణ, వ్యాపార సంబంధములగు పెక్కు మార్పులతో అవి భూమినుండి వీలైనంత నీటిని పీల్చుకొనుచుండుటయే గాక, దానిని స్వీయకణ సంహతులలో నిలువ చేసికోనుచుండును, అట్టి వానిని 'నిర్జల. త్రోద్భిజ్జములు' (Xerophytes) అందురు. ఆ మొక్కలలో కాండ భాగముకంటె వ్రేళ్ళు బాగుగా అభివృద్ధిచెందియుండును. వాటి పత్రముల రేకు భాగము చాల స్వల్పముగ నుండును. కొన్నిటి పత్రములు సూదులవలె, పొలసుల లెనుండును. జెముడు మొదలగు మరికొన్నిటికి పత్రములే యుండవు. కాండము, పత్రముల యొక్క పై పొర (cuticle) దళసరిగా నుండును. పత్రరంధ్రములు చాల తక్కువగ నుండుట యేగాక, అవి గుంటలలో లోతుగ నుండును.

ఆ గుంటలలో రోమము లుండుటవలనగాని, మరియొక విధముగా గాని నీరు ఇగిరిపోకుండ రక్షణము జరుగును. ఎత్తైన పర్వతములపైనను, ఆర్కిటిక్ ప్రాంతములందును ఉండు కొన్ని మొక్కల పత్రములు, కాండములు దట్టమైన రోమములతో కప్పబడియుండును. ఇసుక ప్రదేశములందును, రాతిప్రదేశములందును పెరుగు

పటము 2. శుష్కోద్భిజ్జముల తరగతికి చెందిన తృణపత్రము యొక్క అంతర్నిర్మాణము.. ముడుతలు పడిన క్రిందిచర్మము, చాల లోతున రక్షింపబడి యున్న పత్ర రంధ్రములు కాననగును.

కొన్ని మొక్కల క్షత్రములు, కాండములు, కండలు, రసముతో నిండియుండును. అంతర్నిర్మాణమును పరిశీలించినచో నిర్జలక్షేత్రోద్భిజ్జములలో చాలవరకు దారువాహికాపుంజములు దృఢముగా ఏర్పడియుండును.

సముద్ర ప్రాంతమునను, మరికొన్ని ప్రదేశములందును నేలలో నీరు సమృద్ధిగానుండును. కాని, ఆ నీటియందు కరిగిన లవణములు విస్తారముగనుండుటచే అచట పెరుగు మొక్కలకు పనికివచ్చు నీరు చాల తక్కువగానుండును. అందుచే అవికూడ నిర్జల క్షేత్రోద్భిజ్జములకు గల ఉపయోజనములను కలిగియుండును. అట్టి మొక్కలను లవణొ ద్భిజ్జములు (halophytes) అందురు.

జలోద్భిజ్జములు (hydrophytes) నీటిలో కొలదిగనో పూర్తిగనో మునిగియుండి, జీవించుటకు తగిన ఉపయోజనములను గలిగియుండును. ఈ మొక్కలకు వ్రేళ్ళు చాల తక్కువగనుండును. కొన్నిటికి అవి ఉండ నేయుండవు.నీటిలో మునిగియున్న పత్రములు చాల సన్నముగాను, పలుచగాను ఉండును. కాండము మృదువుగా, బలహీనముగానుండి, దారువాహికా కణసంహతులు స్వల్పముగ