Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్భిజ్జములు - పరిసరములు

సంగ్రహ ఆంధ్ర

రూపాంతరమునొందిన వ్రేళ్ళు, టర్నిస్, గాజరగడ్డ, చిరుగడదుంప, ఆలుగడ్డ, అల్లము, ఉల్లివంటి రూపాంతరము నొందిన కాండములు మొ.

జీర్ణక్రియ; ఆహారసారగ్రహణము (Digestion and Assimilation of food): క్లిష్టమై, అద్రావణీయము లుగా నున్న ఆహారపదార్థములను, ద్రావణీయ, వ్యాపనీయ రూపములోనికి మార్చు క్రియ జీర్ణక్రియ. ఈ విధముగా పిండిపదార్థము చక్కెరగా మార్చబడును. మాంసకృత్తులు ఏమిదామ్లములు (amino-acids) గను, క్రొవ్వులు, క్రొవ్వు సంబంధమగు ఆమ్లములు (fatty-acids). గ్లిసరీన్ లేక మధురిక (glycerine) నను మార్చబడును. జీర్ణక్రియ అనగా 'ఉడజవిశ్లేషణము'. (hydrolysis) అనబడు రాసాయనిక క్రియ. ఆ క్రియలో ఉదకసంకలనము వలస క్లిష్టమగు పదార్థము సామాన్యమైనదిగా చేయబడును. ఇది ము ఖ్య ముగా "ఫేనక ద్రవ్యములు' (enzymes) అనబడు జీర్ణరసములతో జరుగును. ఆ ఫేనక ద్రవ్యములు జీవరసమునుండి స్రవించు క్లిష్టమైన సేంద్రియ ప్రతి స్ఫటికా పదార్థములు (organic colloidal substances). అవి ఆ క్రియలో ఉపయోగపడకుండనే, క్లిష్టపదార్థములు సామాన్యరూపములలోనికి చాలత్వరగా విశ్లేషణము నొందజేయు సేంద్రియయోగ దోహదములు (organic catalytic agents). ఫేనక ద్రవ్యము చేయుసని నిర్ణీతమైనదిగానుండును. అనగా, ప్రతి ఫేనకద్రవ్యము ఒక నిర్ణీతపదార్థముపైననే పనిచేయును. పిండిపదార్థమును చక్కెరగా మార్చు బీజశర్కరికము (diastase), మాంసకృత్తులను ఏమి దాన్లుములుగా మార్చు ప్రోటియేస్ (Protease), క్రొవ్వులను క్రొవ్వు సంబంధమగు ఆమ్లములుగను, మధురిక గను మార్చు లైఫేస్ (lipase) అనునవి కొన్ని సామాన్య ఫేసకద్రవ్యములు, తుదకు ఆహారసారము ఉద్భిజ్జ శరీరములోనికి గ్రహింపబడును. అనగా శరీర పదార్థమగు జీవరసముగా మార్పుచెందును. ఎమ్.స

ఉద్భిజ్జములు - పరిసరములు :

ఉద్భిజ్జమైనను, జంతువైనను, ప్రతి జీవిచుట్టును కొన్ని అంశములతో నేర్పడిన పరిసరములు (environments) కలవు. పరిసరములకు ప్రాణి జీవితవ్యాపారములపైనను, నిర్మాణాభివృద్ధులపైనను గట్టి ప్రభావము కలదు. కాని పరిసరములు తరుచు మారుచుండును. స్థలాంతరములకు బోవుటకు జంతువులకు చలనశక్తి కలదు. అందుచే, వాని కనుకూలమగు పరిసరముల నవి యెన్నుకొని, జీవించగలవు. పరిసరములలో కలుగు మార్పులు వాని నెక్కువగ బాధించవు. మొక్కలు స్థిరముగా భూమిలో పాతుకొని యుండును. పరిసరస్థితులతో వానికిచాల సన్నిహిత సంబంధ ముండును. అందుచే పరిసరములలో నెట్టి మార్పులు కలిగినను ఉద్భిజ్జములు భరించియుండవలసివచ్చును. వివిధ బాహ్యపరిస్థితులకు మొక్క యొక్క వ్యాపార విధానములపై ప్రభావముండును. సరిసరములకు అనుకూలముగ మొక్క తన ఆకార వ్యాపారములలో మార్పు కలిగించుకొనుట ఆవశ్యకము. లేనిచో అది జీవించుటయే దుర్లభమగును.

మొక్క చుట్టును కల పరిసరములు రెండు రకములుగా నుండును. మొదటిది నేల. అది వ్రేళ్ళకు దృఢమగు పట్టు నిచ్చును. నీటిని, ఖనిజ లవణములను మొక్కకు లభింపజేయును. రెండవది గాలి. కాండము, ఆకులు భూమిపై గాలిలో మండుటవలన కిరణజన్య సంయోగక్రియకు -కావలసిన శక్తి, వెలుతురు రూపమున మొక్కకు లభించును. దానితో బాటు వాయువు, వర్షము, అధికనుగు ఉష్ణోగ్రత కూడ దానికి తగులుచుండును.

ఉద్భిజ్జములు, నేల : నేల ప్రతిచోటను ఒకేతీరున నుండదు. నేలల తత్త్వము, రసాయన సంఘటనము, లోతు, సారము, పుట్టుపూర్వోత్తరములు మొదలగు విషయములలో చాల వైవిధ్యమున్నను, మట్టి రేణువులు, నీరు, గాలి, సేంద్రియ పదార్థము, కరగియున్న పదార్థములు, జీవజాలములు అన్ని రకముల నేలలయందు నుండును. నేల లోపలి భాగమంతయు నొకేతీరున నుండక వివిధ రకముల పొరలతో నేర్పడియుండును. మొక్కల జీవితముపై ఇవన్నియు ప్రభావమును కలిగియుండును.

భూమిలోనున్న మట్టి రేణుపుల యాకార పరిమాణ రసాయన సంఘటనములలో చాల భేదముండును. ఆ భేదములను బట్టి నేలలు వివిధ తరగతులుగా విభజింప బడినవి. మట్టికణములకు ఒకే యాకారము లేనందున