విజ్ఞానకోశము -౨
ఉద్భిజ్జములు (ఆహారపరికల్పన)
నత్రజని ముఖ్యమైన మూలద్రవ్యము. భూమినుండి గంధకము గంధకితముల (Sulphates) రూపమున గ్రహించ
బడును. అదికూడ మాంసకృత్తుల యొక్కయు, జీవరసము యొక్కయు సంఘటనములో నొకఘటకము. స్ఫురితముల (Phosphates) రూపమున భాస్వరము తీసికొనబడును. అది కేంద్రక మాంసకృత్తుల (nucleoproteins) నుండును. మొక్క పెరుగుదల పైనను,మొక్కలో జరుగు కణవిభజన పైనను దాని ప్రభావము కలదు. మొక్క యొక్క ఆరోగ్యస్థితికిని, పండ్లు, గింజలు తయారగుటకును పొటాసియం ముఖ్యమైనది, 'పత్రహరితము' అనబడు ఆకుపచ్చని పదార్థములో మగ్నము ఉండును. మొక్కలు ఆరోగ్యముగా పెరుగుటకు ఖటికము గూడ అవసరము. ఖటికము లోటుగా నున్నచో, తెగుళ్ళు కలుగును. పత్రహరిత మేర్పడుటకు ఇనుము అవసరము. అది లేనిచో మొక్కలు పసుపుపచ్చగా తయారగును.
ఇవి యన్నియుగూడ భూమినుండి లవణముల రూపమున మొక్కలచే గ్రహించబడును.
చుట్టును పొరచే ఆవరింపబడియున్న రేత జీవకణమునకు నీటిని లోనికి గ్రహించు స్వభావముండును. క్రమముగా నీటిబిందువులు చేరి, చివరకు నీటితో నింపబడిన అవకాశము (vacuole) కణములో నేర్పడును. ఆరోగ్యముగా సజీవముగానున్న జీవరసము ఎల్లప్పుడును ఈ విధముగా నీటితో సంబంధమును కలిగియుండును. అట్టి స్థితియందే ఆకణము జీవముతో నుండును. కణము చేతన స్థితియం దుండుటకు నీరు అవసరమగుటచేతను, అది ఎల్లప్పుడును నీటిని దానిలోపల నిలువయుంచుకొనుటచేతను, నీటిని బయటినుండియే గ్రహించవలెను. కాని మొక్క యొక్క శరీరములోనికి నీరు ఎట్లు ప్రవేశించునో తెలిసికొనుట అవసరము. ఇది 'అస్మోసిస్' 'Osmosis' అనబడు నొక భౌతిక క్రియారూపమున జరుగును. స్వల్పమగు పరికరములతో, నీరు, శర్కరాద్రావణములవంటి రెండు భిన్న సాంద్రతలుగల ద్రవములను ఒక అర్థాతి వేద్యమగు (Semipermeable) పొరమధ్యగానుండి వేరుచేయు చున్నచో రెండువైపులను సమానసాంద్రతగల ద్రావణ మేర్పడువరకు దానిగుండ అవి ప్రసరించునని మనము చూపగలము. నీరు, శర్కరా ద్రావణము లోనికి, శర్కరా ద్రావణము నీటిలోనికి ఆ పొరగుండా ప్రసరించును. కాని అవి రెండును ఒకే వేగముతో మాత్రము ప్రసరించవు. ఎక్కువగా నీరు శర్కరాద్రావణములోనికి వచ్చి యుండుట కనబడును. ప్రయోగపరికరములను ఈ విధముగా కూర్పవచ్చును.
ఒక గాజు తొట్టెను నీటి తొనింపుము. మేక యొక్క మూత్రపు సంచివంటి తిత్తిని ఒక గాజు గొట్టమునకు చివర గట్టిగా బిగించును. రెండింటిలో శర్కరాద్రావణమును నింపుము. తిత్తిని నీటితొట్టెలో ముంచుము. గొట్టములో నున్న శర్కరాద్రావణపు మట్టమును గుర్తించుము. కొంత సేపటికి గొట్టములోని ద్రవమట్టము పైకిలేచును. ఆ అర్ధాతి వేద్యమగు పొర గుండా నీరు కర్క రాద్రావణములోనికి చేరుటయే దానికి కారణము. ఇదియే ఆసృతీయ (Osmotic) క్రియ యనబడును. నీరు, శర్కరాద్రావణము ఉన్న స్థానములు తారుమారైనచో గాజు గొట్టములోని ద్రవమట్టము క్రిందికి జారును. దీనివలన తక్కువ సాంద్రతగల ద్రావణము ఎక్కువ సాంద్రతగల ద్రావణములోనికి ప్రసరించునని తెలియును. దీనిని అంత రాసృతి' (Endosmosis) అందురు. అది 'బహిరాసృతి' (Exosmosis) కన్న ఎప్పుడును వేగముగా జరుగును. ఎక్కువ సాంద్రతగల ద్రవము తక్కువ సాంద్రతగల ద్రవములోనికి ప్రసరించుట 'బహిరాసృతి' (Excosmosis) అనబడును. అంతరాసృతి ఫలికముగా 'ఆసృతీయపీడనము' అను ఒత్తిడి ఏర్పడును. ప్రకృతిలో జలశోషణము (absorption of water) మొక్క యొక్క మూలరోమముల గుండా జరుగును. మూలరోమముల చుట్టును మంటి రేణువు లుండును. ఇవి వర్షపునీటిని వానిపై పొరలరూపమున ఆపియుంచును. వివిధ రేణువుల మధ్యనున్న స్థలములందు కూడ నీరు నిండియుండును. దీనిని 'కేశతుల్యజలము' (Capillary water) అందురు. ఇది మొక్కలకు ముఖ్యమైన నీటియాధారము. దీనితోబాటు ప్రతికణ రేణువు కూడ ఒక పలుచని నీటిపొరను గట్టిగా పట్టియుంచును. దానిని ‘అర్ద్రతా సూచక ' జలమందురు (Hygroscopic water). అధిరోష్ణముచేతనే అది ఇగిరిపోవును,
మూలపీడసము : పైన వ్రాసినట్లు, భూమి నుండి నీరు మూలరోమములలో ప్రవేశించుట అంతరాసృతి యొక్క