Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఉద్భిజ్జములు (ఆహారపరికల్పన)


ఉద్భిజ్జములలో బీజమువలననేగాక, మొక్క యొక్క ఒక భాగమును విడదీసినచో దానివలన కూడ ప్రవర్ధనము జరుగును. ఇచట తలిదండ్రుల జనన కణములు కలియు తతంగము లేకయే, తల్లి ధాతువులతోనే జీవితము ప్రారంభమగుటచే, ఇట్టి శాఖా సంతానము పూర్తిగా తల్లినే పోలియుండును. అయినను, పరిమాణ గుణముల విషయమున. తల్లి పిల్లల నడుమను, పిల్లల నడుమను, విభేదములుండుటయు, తరతరమున ఎక్కువ గుణవ్యక్తత గలవాటినిఎంచి ప్రవర్ధనము చేయుటచే క్రమముగ గుణ సాంద్రత పెరుగుటయు క్రియాశీలురగు తోటలను పెంచు వారి అనుభవములు. శాఖా ప్రవర్ధనమున అంటు గట్టుట యొక విశేషపద్ధతి. కొమ్మ నొక దానిని మరియొక మొలకపై అంటించినచో అవి రెండును హత్తుకొని ఒక మొక్కగా జీవింపగలవు, కొమ్మ తల్లి యొక్క శాఖాసంతతి యగుటచే పూర్తిగ తల్లిని పోలి యుండవలెను. కాని అది మొలక నుండి ఆహారమును పొందుటచే, దాని ప్రభావము వలన కొన్ని లక్షణములను సంపాదించుకొనును. కాని అవి ఈ తరమునకే పరిమితము. దాని బీజసంతతిలో ఈ లక్షణములు కానరావు.

కాని రష్యను వైజ్ఞానికులు చేసిన కొన్ని ప్రయోగములలో మొలక ద్వారమున కొమ్మకు సంక్రమించిన కొన్ని లక్షణములు దానిలో స్థిరపడి దాని బీజసంతానమునకు గూడ అను లభించుటను చూపిరి. ఇట్టి వాటికి వారు శాఖాసంకరములు (vegetative hybrids) అని పేరిడిరి. ఇంతేగాక, ముందుముందు 'మొక్కకు కావలసిన కాంతి తాపములను, కొన్ని అనుకూల పరిస్థితులను గింజలు మొలకెత్తునపుడే సమకూర్చుటచే అనులబ్ధివలె కానవచ్చు కొన్ని లక్షణములను శాశ్వతముగ మార్చి వాటి సంతానమునకు అనులభింప జేయవచ్చునని గూడ వారు కనుగొనిరి. ఈ ప్రయోగములనుబట్టి ఆనువంశీకము తిరుగులేని ప్రారబ్ధము కాదనియు, పరిసరములను మార్చి దానిని కొంతవరకు మార్చవచ్చుననియు సిద్దాంతముచేసిరి. ఇది సంప్రదాయవాదుల సిద్ధాంతములకు విరుద్ధము. ఇరుపక్షములవారును తమతమ సిద్ధాంతము లను గట్టిగ నమ్మి యున్నారు. ఈ లోపుగా జనీలు పనిచేయు విధానమును, లక్షణములువ్యక్త మగు క్రమమును, తెలియు పరిశోధనల ఫలితములు వీరి నడుమగల అంతరమును రానురాను సన్నగిలచేయుచున్నవి.

ఇట్లు, తలిదండ్రులనుండి లభించిన జనీల ద్వారమున సంక్రమించిన పోలికలను ప్రాతిపదికముగా గైకొని జీవి తన జీవితమును ఆరంభించి పరిసరముల సంఘర్షణము వలన లక్షణముల వ్యక్తతను సవరించుకొనును. జనన కణముల యందలి జనీలు స్త్వ్వరముగగాని, ప్రేరితముగ గాని మార్పునొందిన యెడల అట్టి మార్పులు ఆ కణముల నుండి జనించిన సంతానమున వ్యక్తమగును. అట్టి క్రొత్త లక్షణము బ్రతుకు పోరాటములో మొక్కకనుకూలించునదైనచో, అట్టి మొక్కలు నెగ్గి వాటిసంతతిలో ఈ క్రొత్త లక్షణములు చిరకాలము నిలుచును. క్రొత్త లక్షణము ప్రతికూలించునదైనచో ఆ మొక్క తత్ఫలితముగ పోరాటమున నెగ్గజాలకపోవుటచే ఆ లక్షణము కూడ అంతటితో అంతరించును. ఇట్టి పరిస్థితిలో ఒక్కొక్కప్పుడు మానవుడు చొరబడి వాటికి రక్షణనిచ్చి, వాటిని పోటీనుండి తప్పించి పెంచుచున్నాడు. ప్రకృతిలో నెగ్గుటలో గాని, మానవుని హస్తక్షేపమున ప్రగతినొందుటలో గాని ఆను వంశికమునకు గల పాత్ర అద్వితీయమైనది.

బ్ర. స,


ఉద్భిజ్జములు (ఆహారపరికల్పన) :

ఉద్భిజ్జములు ప్రాణులే యని చెప్పుటకు వాని పెరుగుదల అన్నిటికంటే ముఖ్యమగు లక్షణము. తక్కువశ్రేణికి చెంది, ఏకకణ శరీరముగల ఉద్భిజ్జములలో చాల భాగము, పురుష జనన కణములు మాత్రమే రకరకములగు చలనములను కనబరచునుకాని, మన చుట్టును అగపడు ఉచ్చ శ్రేణి ఉద్భిజ్జములన్నియు భూమిలో వానివాని స్థలములయందు స్థిరముగా నుండును. ప్రాణికి అవసరమైన ఆహారగ్రహణము, దానిని జీర్ణము చేసికొనుట, శరీరపదార్థమును వృద్ధి చేసికొనుట, విశ్లేషణ క్రియలో లభించు శక్తిని 'జీవన వ్యాపారములు నడపుకోనుటకు వినియోగించుకొనుట ఉద్భిజ్జములకు అవసరమైన పనులు, ఆహారకల్పనా విధానములనుబట్టి ఉద్భిజ్జములు రెండు తరగతులుగానుండును. సామాన్యముగా ఉద్భిజ్జములు తమ ఆహారమునకు కావలసిన ముడిపదార్థములను భూమినుండియు, గాలినుండియు గ్రహించును. చక్కెరను, పిండిపదార్థములను తయారు