ఉద్భిజ్జములు - అంగభేదరహితములు
సంగ్రహ ఆంధ్ర
పదార్థములపైనను జీవించుచుండును. జీవించుచుండు పదార్థములపై పెరుగునవి 'పరాన్నభుక్కు' లనియు,
చచ్చిపడియున్న 'వానిపై జీవించునవి పూతిభుక్కు 'లనియు అనబడును. శిలీంధ్రములలో పత్రహరితము లేనందున
తమ యాహారమును తాము తయారు చేసికొనలేవు. కనుక ఇవి ఇతర సజీవపదార్థములపై లేక తడిగానున్న సేంద్రియ పదార్థములపై మొలచి, తమ సూక్ష్మ శాఖలను పదార్ధములోనికి పంపి, దానిని కరిగించి పారమును పీల్చుకొనును, పరాన్న భుక్కులుగా జీవించునవి నూలుపోగులవంటి తమ శాఖలను పోషకజీవి (host) యొక్క కణములలోనికి జొనిపి యాహారమును పీల్చుకొనుచుండును. ఇట్లు ఆహారమును పీల్చుకొనుట కుపయోగపడు శాఖలను 'పరాశ్రయి శొషక మూలములు'(Hanstona) అని అందురు. ఇట్లు పరాన్నభుక్కులగు శిలీంధ్రములు ఆహారమును పోషక జీవులనుండి పీల్చుకొనుటచే, పోషకజీవులు బలహీనత జెంది అనేక వ్యాధులకు గురియగుచుండును.
సాధారణముగా శిలీంధ్రములు ఏకకణముగల సిద్ద బీజములను ఉత్పత్తిచేయును. ఈ సిద్ధబీజములు కొన్నిటిలో చిన్నచిన్న సంచులలోను, మరి కొన్నింటిలో ప్రత్యేక మైన శాఖలపైనను పుట్టును లింగసంబంధమగు పునరుత్పత్తి శిలీంధ్రములలో ఒక్క తరగతిలో మాత్రమే స్పష్టముగా కనుపించును. లింగ సంబంధ పునరుత్పత్తిలో సమరూప జననకణములు (Isogametes) లేక భిన్నరూపజననకణములు (Heterogametes) పుట్టి వాని కలయికచే సంయుక్త బీజము పుట్టును. ఉదా॥ పిథియం (Pythium).ఈ సంయుక్త బీజమునుండి పుట్టు సిద్ధబీజములు ఒక్కొక్కటి శిలీంధ్రముగా పెరుగును. శిలీంధ్రముల యొక్క పునరుత్పత్తి విధానములను బట్టి వానిని సర్వసాధారణముగా నాలుగు తరగతులలో విభజింతురు.
- 1. ఆర్కీ మైసిటిస్ (Archimycetes)
- 2. ఫైకోమైసిటిస్ (Phycomycetes).
- 3. ఆస్కో మైసిటిస్ (Ascomycetes)
- 4. బెసిడియోమైసిటిస్ (Basidiomycetes)
సూక్ష్మజీవులు. (Bacteria): సూక్ష్మజీవులను శిలీంధ్రములలో నొక ప్రత్యేక తరగతిలో వర్గీకరణమున సాధా రణముగా చేర్చెదరు. ఇవి మిక్కిలి అల్పజాతికి చెందినవి. ఇవి ఏకకణపు జీవులు. వీనిలో కేంద్రకముండదు. కాని కేంద్రకమువలెనుండు పదార్థముండును. ఇవి కామా (,)
వలెను, కడ్డీలవంటి చిన్న ముక్కలవలెను (Bacilli), గుండ్రముగను (colli), మెలికలుగను (Spirillum) ఆకారము కలిగియుండును, ఇవి 1/1000 మిల్లీమీటరు మొదలు 1/500 మిల్లీమీటరు వరకు పొడవు కలిగియుండును.
సూక్ష్మజీవుల వలన జంతువులకే గాక వృక్షములకు కూడ ఎన్నియో వ్యాధులు కలుగుచున్నవి. టైఫాయిడ్, టిటానస్ (Titanus), కలరా (Cholera), క్షయ (T.B.), న్యుమోనియా (Pneumonia), గొంతులోని గవదలు (Tonsils) మొదలగు వ్యాధులు సూక్ష్మజీవుల వలననే మనుష్యులకు కలుగుచున్నవి. ఆపిల్, పియర్స్ మొదలగు పండ్లకు, వృక్షములకు ఒక విధమైన తెగుళ్ళు సూక్ష్మజీవుల వలన కలుగును.
సూక్ష్మజీవులు, మూడువిధములుగా తమ యాహారమును తయారుచేసికొనును. కొన్ని రకములగు సూక్ష్మజీవులు చచ్చిపడియున్న పదార్థములపై జీవించును. ఇవి కోన్ని Exothermic reactions గావించి దీనిలో వెడలు శక్తిని ఉపయోగించుకొని తమ యాహారమును తయారుచేసికొనును. అవి ఆహారమును శర్కరగా మార్చుకొని విపాకము (Fermentation) గావించి మద్యసారములను (Alcohols), ఆమ్లములను తయారుచేయును. ఇంతేగాక ఈ క్రియలో ఉత్పత్తియగు