విజ్ఞానకోశము -౨
ఉద్భిజ్జములు - అంగభేదరహితములు
లక్షణములు గలవి, మరికొన్ని స్త్రీలక్షణములు గలవిగా నుండును. ఇవి ఒక దానినొకటి పోలియుండును, ఉచ్చశ్రేణికి చెందిన శైవలములలో పురుష జననకణములు చిన్నవిగ, మీసములు గలిగియుండును. కాని స్త్రీ జనన క్షణములు పెద్దవిగను, చలనములేకను ఉండును. వీనిని ఓవా (Ova) లని యందురు. జననకణములు శైవలము నుండి విడుదలై నీటిలో కొంతకాలమువరకు ఈదు చుండును. ఇట్లు ఈదుచున్న స్త్రీ, పురుష జననకణములు ఒక దానినొకటి కలిసికొని ఒక సంయు క్తబీజము (Zygospore) గా తయారగును. కాని కొన్నిటియందు ఉచ్చశ్రేణికి చెందిన ఉద్భిజ్జములలోవలె అండము ఏర్పడి దాని స్థానమునుండి కదలకయుండును. పురుష జననకణము దానితో కలియగనే సంయుక్తబీజ మేర్పడును. సంయుక్త బీజము తనచుట్టును దట్టమైన కవచమును తయారు చేసికొని నీటి అడుగున జేరి పరిస్థితులు అనుకూలమగు వరకు అచ్చటనే యుండును. పిమ్మట కవచము పగిలి ఒక్కటి లేక నాలుగు సిద్ధబీజములు బయటికి వచ్చును. సిద్ధబీజములు ఆయా శైవలములుగా వృద్ధిపొందును. శైవలములు రంగులనుబట్టి నాలుగు ముఖ్యతరగతులుగా
విభజింపబడినవి. (1) సయనోఫైసీ (Cyanophyceae-నీలి శైవలములు), (2) క్లోరోఫైసీ (Chlorophyceae- హరిత శైవలములు), (3) ఫియోఫైసీ (Phaeophyceae-నారింజ శైవలములు), (4) రోడోఫై సీ(Rhodophyceae- ఎఱ్ఱ శైవలములు).
(ii) శిలీంధ్రములు (Fungi): ఇవి అంగభేదరహిత ఉద్భిజ్జములు రెండవభాగమునకు చెందినవి. ఊరగాయలు, రొట్టెలు, మురుగుచున్న పండ్లు, పేడకుప్పలపై, చెట్లపై, మనుష్యుల శరీరములపై గూడ ఇవి పెరుగును. వీనిలో పత్రహరిత ముండదు. మానవులకు తామర, బట్టతల, శ్వాసకోశములకును, మూత్రపిండములకును (Blastomycoses of the lungs and Kidneys) సంబంధించిన వ్యాధులు కొన్ని శిలీంధ్రముల మూలమున కలుగును. గోధుమ, జొన్న, వరి, మొక్క జొన్న మొదలగు పైర్లపై వేయు నల్లకాటుక (Black rust) చే మొక్కలు అకస్మాత్తుగా వాడి ఎండిపోవుట మొదలగు ఎన్ని యో మరికొన్ని వ్యాధులు శిలీంధ్రములవలన కలుగుచున్నవి. సూక్ష్మజీవులు
(Bacteria) కూడ అంగ భేదరహిత ఉద్భిజ్జములకు (ధాలో ఫైటా) కు చెందినవే. వర్గీకరణమున వానికి తరచుగా శిలీంధ్రములలో ప్రత్యేకతరగతి నిచ్చుచుందురు. అవి సర్వత్ర వ్యాపించియున్నవి. సూక్ష్మజీవులు మంచుగడ్డల లోను, సుమారు 78° C ఉష్ణోగ్రతగల ప్రదేశములందును కూడ నివసించును. పొలము మట్టిలో కోట్లకొలది సూక్ష్మ జీవులు జీవించుచుండును.
ఆకారమునందు శిలీంధ్రములలో గూడ ఏకకణజీవులు దారములవలె సన్నగను పొడవుగను శాఖలుగను ఉండు బహుకణజీవులుండును. ఈ ఉద్భిజ్జముల యొక్క శాఖా
శరీరమును బూజు (Mycelium) అని అందురు. ప్రతిశాఖను హైఫా (Hypha) అందురు. చారములవలెనుండు
శాఖలలో ప్రతి కణమునందును కేంద్రకము ఒకటిగాని ఒకటికంటే ఎక్కువగాని ఉండును. ఆశాఖలుఒక దానితో నొకటి పేనుకొని భూమి పై కివచ్చును. ఉ॥ పుట్టగొడుగులు.
శిలీంధ్రములు సజీవపదార్థములపైనము, చచ్చి కుళ్లుచున్న