Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్భిజ్జములు - అంగభేదరహితములు

సంగ్రహ ఆంధ్ర


గలిగి యుండుము. ఉదా, మాక్రోసిస్టిస్. నారింజరంగు కలిగినటువంటి పెద్ద సముద్రపు పాచి (kelps) గూడ శైవలములకు చెందినదే.

శైవలములు తమకు వలసిన పదార్థములను మరియు బొగ్గువులుసుగాలిని నీటిలో కరిగియున్న వాటినుండి ద్రవ రూపముగ గ్రహించి తమలోనున్న పత్రహరిత సహాయముతో సూర్యరశ్మిలో తమ యాహారమును తయారు చేసికొనును. శుక్ల పక్షమున చంద్రరశ్మివలస కూడ శైవలములు తమ యాహారమును తయారుచేసికొనును.వీనిలో సర్వసాధారణముగా ఆహారము పిండిగా తయారగును. కానీ కొన్ని శైవలములు నూనె (కొవ్వురూపముగ కూడ) ఆహారమును తయారు చేసికొనగలవు. ఉదా. వాచీరియా (Vaucheria).

శైవలముల శరీరమున ప్రతికణకవచము (కఱ్ఱనార Cellulose), పెక్లోస్ (Peclose) అను పదార్థములను కలిగి యుండును. ప్రతికణములో జీవరసము కవచమున కంటుకోని యుండును. మధ్య అవకాశము (Vacuole) ఉండును. ఆ జీవరసములో కేంద్రక ముండును. ప్రతికణములో కూడ పత్రహరితకము ఒకటి యుండును. కాని దారములవంటి వానిలో అడుగుననున్న కణము వర్ణరహితముగను, వేర్లవలెను ఉండును. దాని సహాయముననే వలములు రాళ్ళకును, ఇతర చెట్లకును అంటుకొనియుండును.

పెద్ద పెద్ద కేల్పులు (Kelps) పొడవుగా ఆకులవలె నుండును. ఇవి బహు కణములతో చేయబడియుండును. దీని కణములలో పత్రహరితముతోపాటు వివిధ రంగులు. (నీలి, నారింజ, ఎరుపు రంగులు) ఉండుటచే శైవలములు ఆయా చాయలతో కనబడును.

శైవలములలో పునరుత్పత్తి విధానము పెక్కు విధములుగా నుండును. దారములవలె నుండు శైవలములలో కొన్ని ఆకస్మికముగ విరిగి ముక్కలు ముక్కలుగా నగును. ప్రతిముక్కలో కనీసము ఒక కణము ఉన్నను అది విభజన జెంది ఒక శైవలముగా తయారగును. శైవలములు సర్వసాధారణముగా రెండు విధములుగా పునరుత్పత్తి చేసికొనును.

(1) లింగరహిత పునరుత్పత్తి.
(2) లింగసంబంధమగు పునరుత్పత్తి.

లింగరహిత పునరుత్పత్తి : ఏకకణపు ఉద్భిజ్జములు విభజన చెంది, ప్రతిభాగము ఒకజీవిగా పెరుగును. ఆహారము ఎక్కువగా దొరుకునపుడు పరిసరములు అనుకూలముగా నుండినచో ప్రతికణములో నున్న జీవరసము, కేంద్రకముతొ సహితముగా విభజన చెంది 4, 8, 16, 32 లేక 64 ఏకకణములగు సిద్ధబీజము (Spores) లను ఉత్పత్తిచేయును. నీటిలో నివసించు శైవలములో ఈ సిద్ధబీజములు సాధారణముగా చలనము కలిగియుండును. వీనికి కణకవచ ముండదు. ఒక్కొక్కదానికి రెండు మీసము లుండును. దీనిని జూస్పోర్సు (Zoospores) యని అందురు. కాని కొన్ని భూమి పై నుండు శైవలములలో సిద్ధబీజములు ఎన్నియో రకములుగా నుండి గాలిచే వ్యాప్తిచెందును. జూస్పోర్సు (Zoospores) అనుకూల పరిస్థితులలో పెరిగి అ సంబంధమగు ఉద్భిజ్జమును ఉత్పత్తి చేయును.

లింగసంబంధమగు పునరుత్పత్తి : వ్యతిరేక పరిస్థితులలో ఈ ఉద్భిజ్జములు లింగసంబంధమగు పునరుత్పత్తి జరుపును, లింగసంబంధమగు పునరుత్పత్తి సాధారణముగా సాయంకాలములందును రాత్రులందును లేక వేకువ ఝామున జరుగును. ప్రతిజీవి కొన్ని జననకణములను ఉత్పత్తిచేయును. జననకణములు, జూస్పోర్ట్సు (Zoospores) అను బోలియుండును. కాని అవి కొంచెము చిన్నవిగా నుండును, ఈ జననకణములలో కొన్ని పురుష