Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉద్భిజ్జ పరిణామము

సంగ్రహ ఆంధ్ర


భేదములు ప్రాణులలో గలుగుటవలన పరిణామము జరుగుచున్నది కాని, సూక్ష్మములై అసంఖ్యాకములగు భేదము లవలన కాదని డీవ్రీసు ప్రతిపాదించెను. ఈ సిద్ధాంతము డార్విన్ సిద్ధాంతము కంటే ఎక్కువ సమంజసముగా అగపడి నది. పరిణామమునకు పట్టుకాలము ఈ సిద్ధాంత రీత్యాచాలవరకు తగ్గినది. ఇప్పుడు ఆనువంశికమగు భేదము పెద్దదైనను, చిన్నదైనను, ఒక్కమారుగా ఏర్పడినచో అది 'ఉత్పరివర్తనము' అనబడుచున్నది. పరిణామమునకు ముఖ్యమగు ఆనువంశిక భేదములకును, పరిసరప్రభావముచే నేర్పడి ఆనువంశికముకాని చిన్న చిన్న భేదములకును గల వ్యత్యాసము డివ్రీస్ సిద్ధాంతమువలన స్పష్టమైనది.

కాని నేడు చాలమంది జీవశాస్త్రజ్ఞులు ప్రాకృతికవరణమే తక్కిన సిద్దాంతములకంటె పరిణామవిధానమును చక్కగా స్పష్టీకరించుచున్నదని అభిప్రాయపడుచున్నారు. ఆ సిద్ధాంతమున స్వల్పములగు మార్పులు మాత్రము జరిగినవి. వివిధ పరిస్థితులకు తగియుండుట, శరీరదార్థ్యము అను విషయములపై బ్రతుకు పోరాటమున చాలవరకు ప్రాణుల విజయము ఆధారపడి యుండునుగాని ప్రత్యేకమగు నిర్మాణముపై లేక ప్రతి క్రియలపై కాదని నేటి శాస్త్రజ్ఞులు గ్రహించిరి.


ప్రకృతిలోనున్న ఉద్భిజ్జములను, జంతువులను, శిలారూపజీవములను ఆధారముగా తీసికొని పరిణామ సిద్ధాంతమును దాని విధానములను గూర్చి మొదట చాల కృషి జరిగినది. ఇటీవల పరిశోధనాలయములందును, బయటను జీవముతో నున్న ఉద్భిజ్జములతో చేసిన ప్రయోగ పరిశీలనములవలన ముఖ్యమగు నిదర్శనములు లభించినవి.ఈ ప్రయోగ పరిశీలనములలో సృజనశాస్త్రము (Genetics)నకు ముఖ్యమగు సంబంధముకలదు. మెండెల్ యొక్క ఆనువంశిక సూత్రములు వెల్లడియైనది మొదలు ఇంతవరకు 'ప్రాణులలో భేదములు ఉత్పత్తియగుట, ఆనువంశికముగ నవి సంక్రమించుచుండుట' అను విషయములను గూర్చి చేకూరిన విజ్ఞానము పరిణామ సమస్యను పరిష్కరించుటకు తగినంత ఎక్కువగా అభివృద్ధి చెందినది. పిత్య్ర సూత్రములు (క్రోమోజోమ్సు) లో నున్న సృజనులు(Genes) ఆనువంశికమునకు మూలమని తేలినది. సహజముగా వానిలో మార్పులు (ఉత్పరివర్తనములు) తరచుగా కలుగు చుండును. కృత్రిమముగ కూడ అట్టి మార్పులను ప్రేరేపించుటకు వీలగును. రెండు మొక్కలను గాని, జంతువులను గాని సంసర్గ మొనరించినపుడు ఏ మార్పులు వాని సంతానములో ఎట్లు కలుగుచుండునో కూడ స్పష్టమైనది. పరిశోధనాలయములందును, వ్యవసాయ కృషి యందును క్రొత్తరకముల మొక్కలు, జంతువులు అనేకములు ఉత్పత్తి చేయబడుచున్నవి. కాని, పరిసరములకు తగిన ప్రాణులు ఎన్నుకొనబడుచున్న విధాన విషయమున జీవశాస్త్రజ్ఞులలో భేదాభిప్రాయములు ఇంకను కలవు.

పరిణామము వివిధ కాలములలో, వివిధ సంఘములలో వివిధ వేగములతో జరిగినదని ఇప్పుడు గ్రహించిరి. పురా కల్పాంతమున కలిగినట్లు గొప్ప మార్పులు భూగర్భ సంబంధముగను, శీతోష్ణసంబంధముగను కలిగినప్పుడు పరి ణామము చాల వేగముగ జరిగియుండవచ్చును. ఉత్పరివర్తనము లేర్పడు వేగము, సంఖ్యాపరిణామము, పరిసరములోని వైవిధ్యములు కూడ పరిణాము వేగమును మార్చును.

భౌగోళికముగను, పరిస్థితులమార్పులవలనను ప్రాణులు స్వజాతినుండి వేరుపడుట వలస కూడ ఆయా జాతుల మధ్య భేదములు కనబడుచుండును. పరపరాగ సంపర్కము కలుగు ఉద్భిజ్జములు చిన్న చిన్న సంఘములుగా విడిపోయి నపుడు పిత్య్ర సూత్రములనుండి కొన్ని సృజనులు విడిపోవుట తటస్థింపవచ్చును. అట్టి ఉద్భిజ్జములు కానీ, జంతు వులు కాని బ్రతుకు పోరాటమున నిలువబడుట గ్రుడ్డివేటుగనే కాని ప్రకృతి ఎన్నుకొనుటవలన కాదు. ఇట్లు పెక్కు సృజనులు విడిపోవుట తటస్థించినచో క్రొత్త రూపములు బయలుదేరుటకు అవకాశ ముకలదు.ఈ విధముగా ప్రాణులు వేరుచేయబడుట, పరిణామములో క్రోత్తజాతులు ఉత్పత్తి యగుటకుపునాది అగుచున్నది. ఈ జాతులు ఒక దానితోనొకటి సంకరము చెందుట కష్టము. సంకరము చెందినను వాని సంతానము ఫలించుట కష్టము. సృజనులకు సంబంధించిన భేదములున్నంత మాత్రముననే ఉత్పత్తి విషయమున ఇట్టి మార్పులు కలుగుచుండును. పిత్య్రసూత్రముల సంఖ్యలో భేదమున్న చోగూడ ఇట్లగును. క్రొత్తగా ఏర్పడిన పెక్కు