ఉత్కళదేశ చరిత్ర
సంగ్రహ ఆంధ్ర
| నెదర్లాండ్సు | 333 | 417 | 398 | 447 |
| ఇటలీ | 123 | 165 | 186 | 191 |
ఎం. ఏ. కే.
ఉత్కళదేశ చరిత్ర :
ఋగ్వేదకాలమున నుత్కలనామ ముండినట్లు తెలియదు. కాని రఘువంశ కావ్యకాలమునకు (క్రీస్తు తర్వాత 4 వ శతాబ్దాంతమని కొందరి వాదము) ఉత్కలదేశ మేర్పడి యుండెను. మహానది, గోదావరి నదుల మధ్య దేశము కళింగమనియు, గంగా, మహానదుల మధ్యదేశ ముత్కలమనియు పిలువబడెను. ఉత్కలములోని పశ్చిమభాగమున ఓడ్రజాతి ప్రథమమున నివసించెను. వారు పతిత క్షత్రియులుగను, అనార్యులుగను, ప్రాచీన వాఙ్మయమున వర్ణింపబడిరి. వారి భాషయు సవరభాషవలె అనాదిగాను, కేవల వాగ్రూపముగను ఉండెను. ఉత్కళులు, ఓడ్రులు, కళింగులు, వేరువేరుజాతులు. కపిశానది కుత్తరభాగమున ఉత్కళదేశమును, దక్షిణభాగమున కళింగదేశమును ఉండెనని రఘువంశమునుబట్టి తెలియును. యూవన్ చంగ్ వ్రాతలనుబట్టి, దాని (ఉత్కళ లేక ఓడ్ర) రాజధాని జాజిపుర సమీపమందుండెననియు, అందు నూరు బౌద్ధమఠములును, 50 దేవాలయములును ఉండెననియు, అందలి ప్రజ లనాగరకులై, మధ్యదేశపువారి భాష, లిపి, ఆచారములకు భిన్నమగునట్టివాని నవలంబించు చుండిరనియు, దానికి నైరృతిమూలగ చిలుకసముద్ర ప్రాంతమువరకు కన్యోధదేశ ముండెననియు, అందలి ప్రజలు ఓడ్రజాతివారనియు, వారిలో చాలమంది హిందూ మతస్థులనియు, ఆదేశమునకు నైరృతిభాగమున కళింగదేశ ముండెననియు తెలియుచున్నది, కన్యోధ, ఉత్కళ, ఓడ్రదేశములు కలసి ఒరిస్సాదేశమైనది. ప్రజలు ఉత్కళులనియు, ఓడ్రులనియు పిలువబడుచుండిరి. దానికి ఆగ్నేయభాగమున అనగా గంజాంజిల్లా మొదలు, గోదావరినదివరకు గల ప్రదేశమున కాళింగులు, ఆంధ్రులు నివసించిరి. ఉత్కళ లేక ఓడ్రదేశము పదివేల చదరపుమైళ్ళ విస్తీర్ణము కల్గి ఎక్కువ పర్వతారణ్యమయమై, బ్రాహ్మణి, వైతరణి మహానదులను గల్గి, జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, తాంత్రిక మతముల కాటపట్టయి ఖోండులు, గోండులు, సవరలు మొదలగు అడవిజాతులకు నివాసస్థానమై యుండెను.
మహాభారత యుద్ధకాలమున, ఉత్కళులు పాండవులకు సహాయ మొనర్చిరి. కళింగులు కౌరవులకు సహాయ మొనర్చిరి. వీరిదేశములు ఆ తరువాత మగధరాజ్యము నేలిన శైశునాగ, నంద, మౌర్య, ఆంధ్ర, గుప్తరాజుల స్వాధీనమున నుండెను. సముద్రగుప్తుని అలహాబాదు శాసనమునుబట్టి అతడు ఉత్కళ, కళింగ, ఆంధ్ర, పల్లవరాజుల నోడించెనని తెలియును. గుప్తరాజ్యానంతరము ఉత్తరకళింగము లేక ఉత్కళము కర లేక కేసరి వంశీయుల పాలయ్యెను. ఆ కాలమున కళింగదేశము ఆంధ్ర భృత్యవంశపు రాజులచేతను, వారి తరువాత తూర్పు గాంగవంశీయుల చేతను పాలింపబడెను.
ఉత్కళదేశ చరిత్ర జగన్నాథాలయమందలి మాదలాపంజి వ్రాతప్రతుల వలనను, చీనా యాత్రికుల వ్రాతలవలనను, బౌద్ధ, జైన, హిందూ దేవాలయములు, అందు దొరకిన శిలాశాసనములను బట్టియు, ఆ రాజ్యమేలిన అనేక వంశీయుల తామ్ర శిలాశాసనములను బట్టియు, పురుషోత్తమచంద్రిక, స్టర్లింగ్ పరిశోధన ప్రతులు, హంటర్ ఒరిస్సా చరిత్ర, రాజేంద్రలాల్, గంగూలీ, ముజుందార్ల ఒరిస్సాదేశపు చరిత్ర - వీటివలన, తెలియుచున్నది. సి. వి. వైద్య తన మధ్యయుగమునాటి హిందూదేశచరిత్ర, మొదటి సంపుటము 318 326 పుటలలో, యవనులు (గ్రీకురాజులు) ఉత్కళ లేక ఒరిస్సాలో క్రీ. శ. 320 మొదలు 474 వరకు రాజ్యముచేసిన తరువాత, కేసరిరాజులు 1132 వరకును, ఆ తరువాత గాంగవంశపు రాజులు 1132 నుండి 1434 వరకును రాజ్యమునకువచ్చి దేశము నేలిరని వ్రాసెను.
కాని, శాసనములను బట్టి, ఈ క్రింది సోమవంశపు రాజులు ఉత్తర ఉత్కళదేశ మేలిరని తెలియుచున్నది. వీరు త్రికళింగాధిపతులనియు, కోసలేంద్రులనియు, చంద్రవంశీయులనియు, పరమమాహేశ్వరులనియు, అనేక బ్రాహ్మణాగ్రహార దాతలనియు, తామ్రశాసనములలో పేర్కొనబడినది. వారి రాజధాని కటకమునుండియే చాల దానశాసనము లీయబడెను. మహానదీతీరమందున్న వినీతిపురము, యయాతి నగరములనుండి కూడ కొన్ని దానములీయబడెను. వీరు పరమభట్టారక, మహారాజాధిరాజ పరమేశ్వర యను ఉన్నతబిరుదములను వహించిరి.
150