విజ్ఞానకోశము -౨
ఉక్కు పరిశ్రమ
దురు. ఆ తెడ్లనుండి ఉక్కు మూసలలోపడి కడ్డీలుగా తయారగును.
ఇనుప ఖనిజము నుండి ఉక్కుతయారు
పటము 5
Flow sheet of Iron to Steel
ఉపసంహారము : ఇంతవరకు ముడిఖనిజమునుండి ఇనుమును పొందు విధము, మరల ఆ ఇనుమును భిన్నభిన్నమయిన నిర్మాణ విధానములచే ఉక్కుగా తయారుచేయు విధము విశదీకరింపబడినవి. ప్రతిపద్ధతిలోను లాభనష్టములు కలవు. ఉక్కులో విశేషభాగము 2 నుండి 10 టన్నుల బరువుగల పుంజములుగా పోతపోయబడును. వాటికి పిండకములు అని పేరు (Ingots). ఈ పుంజములను ఎట్టి ప్రయోజనము కొరకైనను ఉపయోగించుటకు ముందు వీటికి ఆకృతులు ఒసగబడును. ఉక్కునకు తుది ఆకారము ఒసగుటకు మూడురీతులు గలవు. ఉక్కును చుట్టుట, ముద్గరముల (hammers) తో కొట్టుట, పీడనమొనర్చుట (pressing). ఉక్కుపుంజములకు తుది ఆకృతి యొసగుట అనగా మోటరు, రైల్వేవంతెన, వేపుడుపాత్ర మున్నగు వాటివలె తయారైన వస్తువుకాదు. ఉక్కు పరిశ్రమ ఎచ్చట అంతమొందునో అచ్చట వాస్తువిద్యా పరిశ్రమలు ఆరంభమగును. కోణములు (Angles), కుల్యలు (channels), పట్టాలు, కడ్డీలు, శలాకలు (rods), తీగలు, పళ్ళెములు, రేకులు, గొట్టములు మున్నగునవి వాస్తువిద్యాపరిశ్రమలకు ఉదాహరణములు. ఒక దేశములో ఒక్కొక వ్యక్తి ఉపయోగించు ఉక్కుయొక్క దామాషానుబట్టి, ఆ దేశముయొక్క అభివృద్ధిని పారిశ్రామిక వికాసమును జనుల జీవికాప్రమాణములను తెలిసికొనవచ్చును. బ్రిటనులోని ఈ ప్రమాణము అమెరికా సంయుక్తరాష్ట్రములందలి జీవికా ప్రమాణమునకు తరువాతిదిగా క్రీ.శ. 1953 లో ప్రప్రథమమున గణింపబడెను. వివిధదేశములలో ఒక్కొక్క వ్యక్తి ఉపయోగించు ఉక్కు యొక్క దామాషాను ఈ దిగువ పట్టిక సూచించుచున్నది.
ఒక్కొక్కవ్యక్తి ఉపయోగించు ఉక్కుపరిమాణము (పౌనులలో)
దేశము - దామాషా
| 1837 - 1938 | 1951 | 1952 | 1953 | |
| అమె. సం. రా. | 640 | 1342 | 1134 | 1373 |
| బ్రిటన్ | 493 | 655 | 701 | 704 |
| స్వీడన్ | 532 | 709 | 777 | 704 |
| కెనడా | 336 | 793 | 732 | 698 |
| ఆస్ట్రేలియా | 428 | 677 | 688 | 547 |
| జర్మనీ | 600 | 498 | 661 | 652 |
| ఫ్రాన్సు | 289 | 397 | 524 | 414 |
| బెల్జియం లగ్జెంబర్గ్ | 352 | 516 | 518 | 465 |
149