విజ్ఞానకోశము - ౨
ఈరాను (భూ)
తరువాతి చరిత్రకారులు, పర్షియన్లు, మీడులు, బాక్టీయన్లు, సోయీదియన్లు మున్నగు ఒకేభాషను మాట్లాడు జనులు నివసించు ప్రాంతములను కలిపి ఆదేశమునకు "ఈరాను" అని వాడిరి.
ఈ దేశమునందు, పెక్కు ప్రాంతములలో వర్షపాతము మిక్కిలి తక్కువగుటచేత ఎక్కువభాగము నీటివసతులు లేక ఎడారిగానున్నది. ఈరాను ఎడారి, వాయవ్యమునుండి ఆగ్నేయముగా ఎత్తైనపీఠభూమి భాగమునకు అడ్డముగా వ్యాపించియున్నది. ఉత్తరపు సరిహద్దున నున్న ఎల్ బుర్జ్ పర్వతపంక్తుల నుండి దక్షిణతీరమునగల మక్రాను పర్వత పంక్తులవరకును ఈ ఎడారి అవిచ్ఛిన్నముగా వ్యాపించియున్నది. దీని పొడవు 800 మైళ్ళు. కాని వెడల్పునందు మాత్రము ఎక్కువ తక్కువలు కనిపించును. ఎడారిలో చాల భాగము నిర్జనముగా నుండును. పర్వత ప్రాంతములందు మాత్రము గొజ్జెలను, మేకలను కాచు కొను ప్రజలు నివసింతురు. ఈ ప్రాంతమున నిదియే ముఖ్యవృత్తి.
ఈ దేశము 2 కోట్ల ప్రజలను, 6 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యమును కలిగియున్నది. పర్షియా సింధుశాఖా ప్రాంతమున మిక్కిలి ఉష్ణమును, ఎల్ బుర్జ్ పర్వత ప్రాంతమున మిక్కిలి శీతలమును అయి ఈ దేశము అనేక శీతోష్ణస్థితులను కలిగియున్నది. శీతోష్ణ స్థితులనుబట్టి ఈ దేశమును మూడు ప్రాంతములనుగా విభజించవచ్చును.(1) కాస్పియను సముద్రతీరము, (2) మధ్య వ్యాపించిన పీఠభూమి ప్రాంతము, (3) పర్షియా సింధు శాఖాతీరము, శీతకాలమున పీఠ భూమి ప్రాంతము చాలచలికలిగి యుండును. ఈ దేశము నందలి జనసంఖ్య యొక్క వ్యాప్తి నీటి సౌకర్యముపైన, నైసర్గిక పరిస్థితుల పైన ఆధారపడియున్నది. 20 లక్షలమంది పెద్దపట్టణములలో నివసింతురు; మరియొక 20 లక్షలకు కొంచె మెక్కువగా దేశద్రిమ్మరులు. తక్కిన జనులు కొండవాలు లందును, లోయలందును చిన్న చిన్న గ్రామములలోను నివసింతురు. దేశమంతకు మిక్కిలి జన సమ్మర్దము గల జిలాను, మజాన్ డీను రాష్ట్రములందు చతురపు మైలుకు 100 మంది ప్రజలు కలరు. ఈరాను తూర్పుభాగము నిర్జనమైన ఎడారిగా నున్నది. ఇందు ఉత్తరమున దా స్తికారీర్, దక్షిణమున దాస్త్రిలుట్ అను ఎడారులు వ్యాపించియున్నవి. వాయవ్య ప్రాంతములు ఎత్తు కలిగి చల్లగాను, వాస యోగ్యములు గాను ఉండును. ఈ ప్రాంతమున పెద్దపట్టణములు కలవు. ఇందు సెలయేరులు సహాయమున పెద్దతొట లను పెంచుదురు. కొండలపై చాల ఎత్తువరకును గోధుమలను ద్రాక్షా-ఖర్జూరములను పండించెదరు, కాస్పియన్ సముద్రతీరమునకు దక్షిణమందున్న పల్లపు ప్రాంతములలో వరి పండును. పట్టు ఉత్పత్తి కూడ ఇచ్చట జరుగును. పర్వతములలో పశువులను, గొజ్జెలను పెంచేదరు.
పెట్రోలియం, బొగ్గు, ఇనుము ఈ దేశము నందలి ముఖ్య ఖనిజ సంపద. బొగ్గు యొక్క, ఇనుము యొక్క ఉత్పత్తి చాల తక్కువ. పెట్రోలుగనులు పర్షియా సింధు శాఖాతీరమున నున్నవి. ఇవి ప్రథమమున బ్రిటిష్ వారి అధీనములో నుండి ఈ మధ్యకాలములోనే జాతీయము చేయబడినవి. వీటిని జాతీయము చేసిన వెంటనే ఉత్పత్తి