ఈనాటి యుద్ధసాధనములు
సంగ్రహ ఆంధ్ర
రక్షణ సాధనములు అప్రమత్తతతో నుండవలయును. నిరంతరముగా ప్రతీ విమానము యొక్క గమనము సైనికాధికారుల అనుమతిని (charter) పొంది ఉండవలయును. మరియు రాడార్ యంత్రము ఈ విమానమును వెన్నంటి రావలసి యుండును. శత్రువులకు చెందినవనిగాని, స్వీయములనిగాని గుర్తుపట్టుటకు వీలు కాని విమానములు తమ ప్రాంతము పై ఎగురుచున్నపుడు తరుముడు విమానములు శీఘ్రముగా వలసిన సంఖ్యలో పై కెగిరి, వాటిని వెంటాడవలయును. ఒక వేళ ఇట్టి విమానములు కొలది యెత్తులో చాటు మాటుగా చొచ్చుకొని వచ్చిన యెడల ప్రమాద మేర్పడగలదు. సముద్ర
గర్భములో జరుగు జలాంతర్గాముల యుద్ధములో 30 మైళ్ళ దూరమునుండి ఒక జలాంతర్గామిచే ప్రయోగింపబడు
బాంబులవలన మిక్కిలి ప్రమాదము సంభవించును. ఇట్టి సందర్భములో బాంబులను ప్రయోగించు పక్షమునకే
విజయము చేకూరగలదని భావింపబడుచున్నది. కారణములచే భవిష్యత్తులో ఆటంబాంబుల ప్రాముఖ్యము హెచ్చుగా నుండగలదు. ఆటంబాంబులనుండి ఆత్మరక్షణము చేసికొనుట అసంభవమనిగాని, ఇవి సర్వనాశన కారులని గాని ఎంతమాత్రము భావించరాదు. గతించిన ద్వితీయ ప్రపంచ యుద్ధము త్వరితముగా ముగియుటకు ఆటంబాంబు
తోడ్పడిన దనుమాట నిజమే. భవిష్యత్తునందలి దాని ఉపయోగమును గూర్చి ముందుగా చెప్పజాలము.
విమాన యుద్ధము : బాంబర్ల యొక్క బారినుండి తప్పించుకొను సాధనములు రెండు. (1) ఫైటరు విమానము. (2) విధ్వంసక ఫిరంగి. రక్షణకై నియోగింపబడిన విమానములు బాంబర్లకన్న అధికతరమైన శక్తితో, చురుకుదనముతో ఎగిరి, వాటిని విధ్వంసము చేయవలయును. ఇవి కొలది కాలములో బాంబుల భారముచే భాధితములు కాక ఎగురగలవు. మరియు తమదేశమునందే యుండి భూమిమీదనున్న ఇతర యంత్రముల సహాయముతో పనిచేయును, "ఫైటర్ విమానములు అతి వేగముతో పై కెగిరిపోగల్గును. వాటియొక్క విన్యాస, చలనశక్తులు అధికములు, జెట్ ఫైటర్ విమానములు నేడు ప్రముఖ పాత్రను నిర్వహించుచున్నవి. వాటి వేగము, చలనశక్తి అత్యధికమగుట వలన పూర్వము ఒక విమానమును మరియొక విమానము వలయాకారములో వెంటబడి తరిమెడి (dog fighters) యుద్ధముల ఎత్తుగడలు రద్దయినవి. కాబట్టి రక్షణకై నియోగింపబడిన ఫైటరు విమానముల నుండి తప్పించుకొనుటకు చాంబరు విమానములు చాకచక్యముతో శత్రుమధ్యమునకు చాటుమాటుగా చొచ్చుకొని పోవలయును.
విమాన విధ్వంసక ఫిరంగుల దళము : మిక్కిలి నవీనమైన సూచనాయంత్రముల (computers) సహాయమునను, సమీపించినంతనే ప్రేలెడు షెల్సు (shells) తోడ్పాటుతోను, రాడారుచేత అదుపులో పెట్టబడునట్టి విమాన విధ్వంసకములయిన ఫిరంగి దళములు బాంబర్ల సమూహములను విధ్వంస మొనర్చుటలో శక్తిమంతమైన పాత్రను నిర్వహించుచున్నవి.
ఉన్నతస్థాయిలో ఎగురు చాంబరు విమానముల సమస్య: (High Altitude Bomber) ఈనాటి భూయుద్ధములో తుపాకి గుండ్లు పోగలుగుదూరము అధికమగుచున్నను, నేడు సామాన్యముగ వాడుకలోనున్న విమాన విధ్వంసకములగు ఫిరంగుల యొక్క ప్రాముఖ్యము తగ్గవచ్చును. గొప్ప ఎత్తునకు ఎగురు తరుముడు విమానములను గూడ చాకచక్యముతో తప్పించు కొనుటకు వీలగు విధమున బాంబరు విమానములను రూపొందించి అభివృద్ధి పరచవచ్చును. ఆకసమునుండి భూమిపై నున్న లక్ష్యములను గురిపెట్టి కాల్చు విషయమున కొన్ని చిక్కులున్నవి. బాంబర్లలో అమర్చబడియున్న రాడార్ల యొక్క దృష్టి సంకుచితము కావచ్చును. ఇంతవరకు ఉపయోగములో నున్న బాంబుల విలువ అంతగా నుండదు. సూటిగా గురి చూచి ప్రయోగింపబడిన బాంబులు కూడ అక్ష్యముతప్పి ఇతర విమానములపై బడవచ్చును.
ఎత్తుగా ఎగురు బాంబరు విమానములనుండి ఏమరుపాటులేని నవీనములైన రక్షణశ్రేణులపై దాడిచేయుట యుక్తమా ? యుద్ద విధానమునందలి రక్షణ సన్నాహము నానాటికి అభివృద్ధికి చేరువలో నున్నదా ? భూయుద్ధములో ప్రతిష్టంభనము ఏర్పడగలదా? గత యుద్ధములలోవలె సామూహికముగా బాంబులను ప్రయోగించుట నిరుపయోగ కరముగా పరిణమింప గలదా? ఇత్యాది సమస్యలు తలఎత్తుచున్నవి. ఎట్లయినను ఆటంబాంబు యొక్క పాటన