ఈనాటి యుద్ధసాధనములు
సంగ్రహ ఆంధ్ర
ఈతలో సామాన్యపు పోటీలు —
- 1. 100 గజములు - స్వేచ్ఛావిధము.
- 2. రొమ్ము విక్షేపము---
- 3. వీపు విక్షేపము,
- 4. మునిగి ఈదుట.
- 5. దూరపుటీత.
- 6. అంచెలు.
- 7. నీటిలో బంతియాట.
-బి. ఎ. ఆర్.
ఈనాటి యుద్ధసాధనములు :
సాధ్యమైనంత తక్కువ యత్నముతో ఆయుధములను, వాటిని ఉపయోగించువారిని తయారుచేసి సాధ్యమైనంత అధిక నష్టమును శత్రువులకు కలిగించుటయే ఆయుధముల ప్రయోగము యొక్క ఉద్దేశము. సాధారణముగా యుద్ధ పరిస్థితులలో ఆయుధ ప్రయోగమువలన సిద్దించు లక్ష్యశుద్ధి శాంతికాలమునందలి లక్ష్యశుద్ధి ప్రయత్నములలో అయిదింట రెండువంతులుగా నుండును. కొన్ని ఆయుధములను గూర్చి యిచట చెప్పబడును.
రాడార్ ' : శాంతికాలములో అభివృద్ధిచెందిన ముఖ్యములైన యుద్దోపకరణములు రెండు. వాటిలో రాడార్ అనునది యొకటి. రాడార్ లొ అమర్చబడిన రేడియో యంత్రసహాయమున- దూరముననున్న లక్ష్యములను కను గొనుటకు వీలగును. సోనార్ అనునది రెండవది. సోనార్ లోతునీటిలోనున్న కంపనధ్వనిని (pulse sound) ఉపయో గించుకొనును. ఒకానొక స్థావరముయొక్క దూరమును కనుగొనుటకు రెండు పద్ధతులు ప్రయోగములో నున్నవి.
(1) నిర్విరామముగా వచ్చు రేడియో తరంగముల ఆటంకములను పరిశీలించుట. (కొద్దిదూరములు - Short distances).
(2) ధ్వని ప్రసారము యొక్క హ్రస్వకంపనమును పంపి ప్రతిధ్వనులను పరీక్షించుట. (నావికోపయోగము Naval Use).
రాడార్ యొక్క సూక్ష్మగ్రాహిత్వము. (Sensitivity) నియతత్వము (Precision), అసాధారణములై నవి. రెండు వందల మైళ్ళ దూరములోనున్న విమానమునుండి ధ్వని ప్రసార పరావర్తమునుగూడ రాడారు సులభముగా కనిపెట్టగలదు. దీని వ్యాప్తికి దిఙ్మండలము (horizon) మితియైయుండును. పొగమంచు వ్యాపించియున్నప్పుడు గాని, రాత్రులందుగాని మేఘమండలముపై ప్రయాణించుచున్న విమానమునుండి రాడార్ సహాయమున భూమిని చూడగలుగుదుము. రాడారుచేత నిర్మితమయిన తెరమీది చుక్క యొక్క సహాయముతో మిక్కిలి దూరమునగల లక్ష్యమునుగూడ గురి పెట్టి కాల్చుటకు సాధ్యమగును. ఇట్టి సాధనమువలన యుద్ధతంత్రమునకు సంబంధించిన అనేక శాఖలలో తప్పక గొప్ప మార్పులు కలుగ గలవు. ఈ ఈ రాడారువలన ముఖ్యముగా సముద్రయుద్ధమందు ప్రధానమైన పరిణామములు కలిగినవి.
రక్షణయందు రాడార్ నిర్వహింపగల పాత్ర అమోఘమైనది. రక్షణ విషయమున రాడార్ ఈక్రింది నాలుగు ప్రయోజనము లను సాధింపకలుగుచున్నది. (1) రెండు వందల మైళ్ళ దూరమునగల శత్రు విమానములనుగూర్చి ముందుగా హెచ్చరించును. (2) ప్రతిరోధక రాడారు ప్రతిరోధక విమానముల చలనములను హద్దులలో నుంచుటయే గాక శత్రు విమానములు ఎంతదూరమున, ఎంత ఎత్తున ఎగురు చున్నవో, శత్రు విమానము లేవో, మిత్రవిమానములేవో గుర్తు పట్టును. (3) విమానములలో రాడారును నెలకొల్పినచో ఎంతో పయోజనకరము. అది అంత్య యుద్ధమునందును, శతఘ్నులను పేల్చుటయందును సమర్థవంతముగా పనిచేయును. (4) సేనలను భూమిమీది యుద్ధరంగములలో దింపుటకును రాడారు ఉపయోగించును. రక్షణార్థమై ఉపయోగింపబడు రాడారు బారి నుండి తప్పించుకొనుట భయంకరమైన కార్యము, శత్రు మధ్యమున ప్రవేశించుటకు మూడు పద్ధతులు గలవు. (1) సైనికులను తగ్గించుట (2) శత్రువుల పై ఒత్తిడిచేయుట (3) చాటుమాటుగా శత్రువులపై దాడులు సలుపుట.
గైడెడ్ మిస్సిల్స్ (Guided Missiles) అను ఆయుధ మొక్కటే బాంబరును పడగొట్టుటకు మిక్కిలి శక్తివంతమైనట్టిది. ఇది స్వల్పదూరమువరకు మాత్రమే ప్రయాణము చేయునట్లుగా నిర్మింపబడి యున్నది. 500 మైళ్ళ దూరమువరకు ప్రయాణించునట్టి గైడెడ్ మిస్సిల్ ను నిర్మించుట సమీప భవిష్యత్తులో సాధ్యపడునట్లు తోచదు. ఇట్టి ఆయుధములను రూపొందించుట సాంకేతికముగా.