విజ్ఞానకోశము -౨
ఈజిప్టు (భూగోళము)
గుర్తించి వారు ఈజిప్టుదేశమునకు స్వపరిపాలనాధికారము నిచ్చుటకై పథకములను సిద్ధముచేసిరి. ఈజిప్టుదేశపు జాతీయవాదులకు మొదట జగ్గుల్ పాషాయును, అతని అనంతరమునాహస్ పాషాయును నాయకత్వమువహించిరి. ఈజిప్టు దేశమునకు రాజకీయముగ సంపూర్ణ స్వాతంత్య్రము లభింపవలెననియు, ఈజిప్టు దేశమునందు విదేశీయులకు గల ప్రత్యేకాధికారములు రద్దు కావలెననియు, సూయజు కాలువ ప్రాంతమునందు నెలకొల్పబడియున్న బ్రిటిషు సేనలు సంపూర్ణముగ ఉపసంహరింపబడవలయుననియు, సూడాన్ ప్రాంతము కూడ ఈజిప్టుతో సంపూర్ణ స్వపరి పాలనాధికారమును పొందవలయుననియు, జాతీయవాదుల ఆశయము. ఈ లక్ష్యములన్నియు ఈజిప్టు జాతీయవాదులు సాధింపగల్గిరి. క్రీ. శ. 1936 వ సంవత్సరమున ఆంగ్లేయులకును ఈజిప్టు ప్రభుత్వమునకును జరిగిన సంధి వలన ఈ అంశములన్నియు ఈజిప్టు ప్రజలకు సంతృప్తికరమగువిధముగ పరిష్కరింపబడెను. సూడాన్ ప్రాంతముపై ఈజిప్టు ప్రభుత్వమువారికి కూడ అధికారముకలదను అంశము అంగీకరింపబడినది. క్రీ. శ. 1937 వ సంవత్సరమున ఈజిప్టు నానా రాజ్యసమితిలో స్వతంత్ర సభ్యత్వమును పొందినది.
-ఖం. బా. శే.
ఈజిప్టు (భూగోళము) : ఈజిప్టు మధ్యధరాసముద్ర ప్రాంతమున ఈశాన్య ఆఫ్రికాయందు 22° నుండి, 31° - 35', ఉత్తర అక్షాంశముల వరకు వ్యాపించియున్న రాజ్యము. ఈ రాజ్యమునకు ఉత్తరమున మధ్యధరాసముద్రము, దక్షిణమున సుడాను, ఈశాన్యమున పాలస్తీనా, తూర్పున ఎఱ్ఱ సముద్రము, పడమట ట్రిపోలి, మరియు సహారా ఎడారియును గలవు.
ఈజిప్టు వైశాల్యము 3,86,000 చ. మైళ్ళు. ఇది పరిమాణమున బ్రిటిషు దీవులకు మూడు రెట్లుండును. ఈ వైశాల్యములో 14/15 వంతు ఎడారియై యున్నది. కాలువలు, రస్తాలు, ఖర్జూరపు తోపులు ఉండు ప్రదేశము 1900 చ. మైళ్ళవరకు విస్తరించియున్నది. నైలునది ప్రవహించు ప్రదేశమును, చిత్తడినేల (బురద నేల) యును, సరస్సులును గల ప్రదేశపు వైశాల్యము 2,850 చ.మైళ్లు. 12,000 చ. మైళ్ళ ప్రదేశము మాత్రము వ్యవసాయ యోగ్యమైనది. కెయిరో పట్టణమునకు దక్షిణ దిశగా గీయబడిన రేఖ ఈ దేశమును దిగువ ఈజిప్టుగా, ఎగువ ఈజిప్టుగా విభజించును. ఎగువ భాగమును డెల్లా భాగముగను లేక నైల్ నదీ లోయ భాగముగను పేర్కొనవచ్చును.
నైలునదియును, ఎడారుల ఉనికియును ఈజిప్టుకు ఒక ప్రత్యేకతను సంపాదించుచున్నవి. నైలునదియే లేకపోయినచో ఈజిప్టు దేశమంతయు సహారా ఎడారి యొక్క ఇతర భాగములతో కలిసిపోయి ఏర్పరుపరాక ఉండెడిది. నైలునది, ఎడారిలోనికి చొచ్చుకొనిపోవుచు, అబిసీనియా గుట్టలనుండి సారవంతమైన వండ మట్టిని తీసికొనివచ్చుచు, డెల్టా ప్రదేశమును, ఎగువ ఈజిప్టునందు సారవంతమైన భూభాగమును తయారుచేయుచున్నది. నైలునది లోయకావల తూర్పు పడమరలుగా వ్యాపించియుండు పెద్ద ఎడారులు గలవు. వానిలో అచ్చటచ్చట “ఒయాసిస్సు” లని పిలువబడు సారవంతమైన ప్రదేశములున్నవి. పురాతన పట్టణ శిథిలములకు చెంది, ముదురు గోధుమ వర్ణముకలిగిన, ఎత్తైన మట్టి దిబ్బలు అక్కడక్కడ కనబడుచుండును. ఇవి తక్క తక్కిన డెల్టా అంతయు చదునైన మైదానముగా నున్నది. ఇందు వ్యవసాయము ముమ్మరముగా నున్నది. ఎగువ ఈజిప్టునందలి నైలు లోయ ఎక్కువ విశాలమైనదిగారు. లోయ కిరు ప్రక్కలను ఎక్కువ ఎత్తులేని పర్వతములు గలవు. ఈ కొండలు లోయ కిరు ప్రక్కలనుండుటచే, ఎడారి ప్రదేశమునకు ఇవి హద్దుగా నేర్పడి యున్నవి.
దాదాపు వంద మైళ్ళ పొడవుగల ఒక గొప్ప కాలువతో, సూయజు భూసంధిచే ఈజిప్టుదేశము ఆసియా ఖండముతో కలుపబడి యున్నది. నైలునదీ లోయ, డెల్టా - ఈ రెండును కలిసి ఈజిప్టు దేశములో ముఖ్యమైన భాగముగానున్నది. ఈ భాగమున మిక్కిలి ఎక్కువ వెడల్పుగా నున్న భాగముకూడ 120 మైళ్ళకు మించి యుండదు. పెక్కుచోట్ల ఈ లోయ 3 మైళ్ళ నుండి 15 మైళ్ళ వెడల్పు మాత్రమే కలిగినదై యున్నది. ఈజిప్టు యొక్క దక్షిణపు హద్దునందలి లోయ వెడల్పు రెండు మైళ్ళు మాత్రమే ఉన్నది. నైలునదికి పడమరగా అనేక “ఒయాసిస్సు" లు కలవు. డెల్టా ప్రదేశమందు