Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఈజిప్టు (చరిత్ర)


వేయబడెను. మహమ్మదీయుల ప్రాబల్యము స్థిరపడెను. ఈజిప్టు 'దేశమును అరబ్బులు జయించిరి. కాని వారి ఆధిక్యము అచట నెలకొనలేదు. ఈ రాజ్య పాలకులు తమకు అంగరక్షకులుగ, తురుష్కులు మున్నగు విదేశీయులు నెల్లప్పుడును, తమవద్ద నుంచుకొని వారి సహాయముతో తమ యాధిక్యమును నిలువబెట్టుకోనెడివారు. తులునిద్ వంశములోని అహమ్మద్ అను నాతడు ఈనాటి కైరోనగరమును క్రీ.శ. 873 సం॥ న స్థాపించెను. ఈ రాజు క్రమక్రమముగ బలపడి ఆ నూతన నగరము నందు అనేక దివ్యభవనములు నిర్మించి దానిని వృద్ధి పరచెను. క్రీ. శ 980 ప్రాంతమున అజీజ్ అను ఈజిప్టు రాజు తనమంత్రి ప్రోత్సాహమున "ఎల్ అఝర్" అను మశీదునకు అనుబంధముగ ఒక విద్యాసంస్థను నెలకొల్పేను. అజీజ్ కుమారుడు మన్సూరు మిక్కిలి క్రూరుడు. కాని ఈతడు కై రోనగరమున ఒక ప్రఖ్యాత గ్రంథాలయ మును నెలకొల్పి ప్రతిష్ఠ కాంచెను. ఈ యుగమున ప్రత్యేకముగ ప్రశంసాపాత్రులగు పాలకులెవ్వరును లేరు.ఈ విధమున శతాబ్దులు గడచిపోయిన వెనుక అట్టోమాను సుల్తాను రెండవ మహమ్మదుకాలమున తురుష్కులు ఈజిప్టుదేశమును పాలించుచున్న మమ్లూకు సుల్తాను నోడించి, ఆ రాజ్యమును తమ సామ్రాజ్యములో (క్రీ. శ. 1517) చేర్చుకొనిరి.

'ఆధునికయుగమూ : అది మొదలు ఇరువదవ శతాబ్ది వరకును ఈదేశము అట్టోమాను చక్రవర్తుల అధీనములోనే యుండెను. ఈజిప్టుపై వీరి అధికారము మొదటినుండియు నామమాత్రముగనే ఉండెను. క్రీ.శ. 16, 17 శతాబ్దులలో ఈజిప్టుదేశమును అట్టోమాను సుల్తానుల ప్రతినిధులగు గవర్నర్లు పాలించిరి. కాని స్థానికులగు అధికారులు తరచు వారి అధికారమును ధిక్కరించి ప్రవర్తించెడివారు. ఈజిప్టు రాజ్యమును జయించిన పిదప అట్టోమాను చక్రవర్తులు అచ్చటి మామ్లూకులను తొల్లింటివలెనే గొప్పపదవులలో నియమించిరి. వీరు రాజ ప్రతినిధులనుకూడ లక్ష్యము చేయక విచ్చలవిడిగా వర్తించెడివారు. ఇందులకుతోడు సైన్యాధికారులుకూడ తరచు ప్రభుత్వమును సరకు చేయక తిరుగుబాటు చేయుచుండెడివారు. దూరముననున్న అట్టోమాను చక్రవర్తి ఈ ఆగడములు నరికట్టజాలక నామమాత్రము నకు తన అధికారము అంగీకరింపబడిన చాలునని సంతసించెడివాడు. క్రీ.శ. 16, 17 శతాబ్దులలో ఈజిప్టు దేశమున సర్వాధికారులుగ వర్తించిన ఉద్యోగులు పాషా అను బిరుద నామముతో వ్యవహరింపబడిరి. పదునెనిమిదవ శతాబ్ది యందు "బే" అను బిరుదముగల ఇతర అధికారులు ప్రాముఖ్యము వహించిరి. వీరు కాక ఈకాలమున షేఖ్, అల్ బలద్, అమీర్, అల్ హజ్ అను ఉన్నతోద్యోగులు కూడ ప్రబలులైరి. క్రీ. శ. 1750 వ సంవత్సరమున అలీబే అనువాడు ప్రాబల్యము వహించి, అట్టోమాను చక్రవర్తి అధికారమునుకూడ అంగీకరింపక స్వతంత్రుడై రాజ్యపాలనము కావించెను. కాని క్రీ.శ.1773వ సంవత్సరమున అలిబే తన ప్రతిపక్షులచే ఓడింపబడి ప్రాణములను కోల్పోయెను. ఈజిప్టునందు అట్టోమాను చక్రవర్తి పరిపాలసము మరియొకమారు స్థిరపడెను. ఇది ఇట్లుండగా క్రీ.శ.1795 వ సంవత్సరమున ప్రసిద్ధ ఫ్రెంచి వీరుడగు నెపోలియను ఈజిప్టుపై దండయాత్ర కావించెను.

ప్రాద్దేశములపై దండయాత్రకావించి వాటిని జయింపవలెనని నెపోలియను వీరుని యుద్దేశము. దాని ననుసరించి అతడు ఈజిప్టు దేశమును వశము చేసికొనెను. కాని ఆంగ్లేయులకు ఈప్రయత్న మెంతమాత్రమును రుచింపలేదు. వారి కడ బలవత్తరమగు నౌకాదళముండెను. దీని సహాయము వలన వారు ఫ్రెంచివారి నౌకాసైన్యమును సంపూర్ణముగ నోడించిరి. మార్గాంతరము లేక క్రీ. శ. 1801 వ సంవత్సరమున ఫ్రెంచివారు ఈజిప్టునుండి తమ సేనలను తరలించుకొని వెడలిపోయిరి. ఈవిధమున ఈజిప్టు దేశమునకు ఫ్రెంచి వారి ఆక్రమణము తప్పెను. కాని ఆదేశమునందు అంతః కలహములు మాత్రము నశించలేదు.

ఫ్రెంచివారు వెడలిపోయిన తరువాత ఈజిప్టు దేశమునందు బలవంతులుగ నున్న తురుష్క పక్షము వారికిని ఆల్బేనియా పక్షమువారికిని తీవ్రమగు పోటీ ఏర్పడెను. ఇరుపక్షముల వారునుకూడ మహమ్మదీయులే. పై ప్రతిస్పర్థులకు నడుమ కొంతకాలము పోరాటము సాగిన తరువాత ఆల్బేనియా పక్షమునకు చెందిన మెహ్మత్ అలీ( మొహమ్మద్ అలీ) అను నాతడు తన శత్రువులనెల్ల మట్టు వెట్టి ఈజిప్టు రాజ్యమునకు (క్రీ.శ.1805) పాషా అయ్యెను. ఈ మెహ్మతలీ మిక్కిలి సమర్థుడు. ఈతడు మాయోపాయ