ఈజిప్టు (చరిత్ర)
సంగ్రహ ఆంధ్ర
పదునెనిమిదేండ్ల వయసురాగానే ప్రతియువకుడు సైనికశాఖలో తప్పక చేరవలసియుండును. 1949-1950లో 3291 ప్రైమరీ పాఠశాలలలో 3,20,931 మంది విద్యార్థులును, 156 సెకండరీ పాఠశాలలలో 27,396 మంది విద్యార్థులుసు విద్య గరచుచుండిరి. గేక్విల్ లో విమానయాన పాఠశాల, సాలిసస్ లో నౌకాయాన పాఠశాల కలవు. లోజాలో న్యాయశాస్త్ర కళాశాల కలదు. క్విటో, గేక్విల్ క్వెంకా పట్టణములలో విశ్వవిద్యాలయములు కలవు. ఇచటవిద్య ఉచితము, నిర్బంధ పఠనీయము అయినను నిరక్షరాస్యత అధికముగనే యున్నది.
ఈక్వెడారు వార్షిక ఆదాయము 46,50,00,000. సూక్రేలు ఆదేశ నాణెము పేరు. ఈ దేశము బంగారు, వెండి, రాగి, సీసపుగనులు గలిగి ప్రసిద్ది చెందియున్నది. పెట్రోలియం ఉత్పత్తిచేయుచు ప్రపంచపు వెలుతురున కాధారభూతముగా నున్నది. ఇచ్చట 'బల్సా' అను కలపగలదు. ఇది చాలగట్టిది. ఇది విదేశములకు ఎగుమతి యగు చుండును.
స్పేనిషు వీరుడైన ఫ్రాంసిస్కొపిజారో అను వాడు ఈక్వెడారును 1532లో జయించెను. 1809లో దేశీయులు స్పెయినుపై తిరుగుబాటు చేసిరి. కాని 1822 మే 24న వారికి సంపూర్ణ విజయము లభించెను. తరువాత ఈ రాష్ట్రము వినిజులా, కొలంబియా అను రాష్ట్రములతో కూటమిగా జేరి సంయుక్త ప్రభుత్వబద్ధ మయ్యెను. 1830 లో ఈక్వెడార్ ఆ కూటమి నుండి ఉపాయముగా తప్పుకొని స్వతంత్రరాజ్యమయ్యెను. 1830 తరువాత ఈ దేశములో ఇంచుమించుగా నియంతృత్వ పరిపాలనము జరుగుచుండెను. 1900 నుండి 1944 వరకు అనేక ప్రభుత్వములు అధికారములోనికి వచ్చుచు తొలగింప బడుచు వచ్చెను. 1944 లో ఎన్నికలుజరిపిరి, 'జోనె వెలాస్కో ఇబర్రా" అనువాడు రాజ్యాధ్యక్షుడుగా నియమితు డయ్యెను. కాని ఇతడు నిరంకుశుడై ప్రత్యర్థుల పీచమడంచుచు ప్రవర్తించుటచే 1947 లో పదవీభ్రష్టతను పొందిన వాడాయెను. నాలుగేండ్ల కొకసారి యెన్నికలు జరుగును. ద్వివిధశాసన సభలు కలవు. 1944 నుండి క్రమపద్ధతిలో ఎన్నికలు జరుగుచు అధ్యక్షులు ఎన్నుకొనబడుచున్నారు. ఈక్వెడారు గణతంత్ర రాజ్యముగా వర్ధిల్లుచున్నది.
ఎం. వి. ఆర్.
ఈజిప్టు (చరిత్ర) : ప్రాచీనయుగము : ప్రపంచమంచలి అతిప్రాచీన నాగరిక దేశములలో ఈజిప్టుదేశ మొకటి. సుమారు పండ్రెండు వేల సంవత్సరములకు పూర్వమే ఈ దేశము నాగరక దశయందుండెను. ఈ దేశమును ముప్పదియొక్క రాజవంశములు పాలించెనట. ఆ పైన క్రీ. పూ. 332 వ సంవత్సరమున యవనవీరుడగు అలెగ్జాండరు ఈజిప్టుదేశమును జయించి తన సామ్రాజ్యములో చేర్చుకొనెను. వీరుడగు అలెగ్జాండరు కాలమువరకును గడచిన దీర్ఘకాలమును మనము సౌలభ్యముకొరకై ప్రాచీనయుగముని వర్ణింతము. ప్రాచీన యుగమున ఈజిప్టు దేశమందు రాజ్యపరిపాలనము కావించిన ప్రభువులకు ఫొరోలు అని పేరు. రాజు భగవదంశ సంభూతుడని విశ్వసించి ఈజిప్టు ప్రజలు తమ ఏలికలను గౌరవించుచుండెడివారు. నేటికి సుమారుఏబది యైదు శతాబ్దులకు పూర్వము ఈజిప్టు దేశమును మీనెస్ (Menes) అను రాజు పాలించెను. ఈ దేశమును మొట్టమొదట పాలించిన రాజవంశములో మొట్టమొదటి రాజు ఇతడే, ఈ ప్రభువు ఈజిప్టు రాజ్యమును ఏకచ్ఛత్రాధిపతిగ పాలించెను. ఈ మీనెస్ రాజు గొప్పవీరుడు. ఈజిప్టుదేశపు చరిత్రయందు చాలకాలము వరకును ప్రత్యేకముగ వర్ణింప దగిన యంశములు లేవు. ఈ దేశ చరిత్రలోని పదునొకండవ రాజవంశమును, పదునెనిమిదవ రాజవంశమును, ప్రత్యేకముగ స్మరింపదగినవి. పదునొకండవ రాజ కుటుంబమువారు మిక్కిలి శూరులై, దేశ మందలి అల్లకల్లోలముల నణచివైచి శాంతిని నెలకొల్పిరి. వీరికడ బలమైన నౌకా సైన్యముండెడిది. పదునొకండవ రాజవంశమువారును, వారి తరువాతి రాజులును నై లునదిని, ఎఱ్ఱసముద్రమును కలుపు నొక కాలువను నిర్మించిరి. దీనిని నేటి సూయజు కాలువతో పోల్చవచ్చును. పదునెనిమిదవ రాజవంశములోని నాల్గవ అమెన్ హోటప్ అనునాతడు ప్రత్యేకముగ ప్రశంసింపదగినవాడు. ఈ వంశమువారికడ బలవత్తరములగు సేనలుండెను. కాని పై అమెన్ హోటప్ రాజు (క్రీ. పూ. 1375-1358) శాంతిప్రియుడు. ఈ రాజునకు పూర్వము ఈజిప్టు ప్రజలు బహుదేవతారాధకులుగ నుండిరి. అమెన్ హోటవ్ రాజు ఈ భావములను తొలగించి, భగవంతు డొక్కడే యనియు, ఆతడు దయామయు