Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇస్రాయిల్

సంగ్రహ ఆంధ్ర

గలదు. అయినను, ఉర్దూభాషాభ్యుదయమునకు ఇబ్రహీం కుతుబుషాహ కాలములో పునాదివేయబడినదేమో అని అనుకొనుటకు ఈ కవిద్వయము యొక్క తేజోవంతమగు అస్తిత్వము దోహద మిచ్చుచున్నది. తత్ఫలితముగా అతని తరువాతి పాదుషాలు గద్దెనెక్కినప్పుడు ఈ అభ్యుదయ కృషి. అతివేగము చెందెను. మహమ్మదుకులీ, సుల్తాన్ మహమ్మదు రాజన్యుల కాలములో ఇది తారాపథము నంటెనుకూడ

కుతుబుషాహీలు ఆంధ్రభాషా, వాఙ్మయాలంకరణకు సమధిక ఉత్సాహాభిమానములు కలిగియుండిరి. ఈ విషయ మున సమృద్ధమైన, అచంచలమైన ప్రయత్నములు జరిగేను. ఈ ప్రయత్నములు ఉర్దు, పారసీ భాషల విషయమున తీసికొన్న చర్యలతో సరిసమానముగనున్నవి. తెలంగాణము తమ మాతృభూమిగను, తెలుగు భాష తమ మాతృభాష తరువాతి భాషగను కుతుబుషాహీ రాజన్యులు తలంచి నారనుట నిరాక్షేపణీయమైన యంశము. అందుచే, ఈ భాషాభివృద్ధికి శక్త్యుత్సాహములతో పనిచేయక డంగిరి, ఆంధ్రవిద్యార్థులకు, ఆంధ్రకవులకు, తమకు సాధ్యమైనంత వరకు తగు ప్రోత్సాహము నిచ్చిరి. తత్ఫలితముగా చివరకు ఈ భాషా భాండారము యొక్క భాగ్యము పండెను. వారందరు విద్యావ్యాసంగమునం దారి తేరిన వారు. స్వయం ప్రేరితులయి కవిత నల్లియున్నారు. కుతుబుషాహీ యుగము ఆంధ్రదేశమునకును, తెలుగు వాఙ్మయమునకును సువర్ణయుగ మని చెప్పుట సత్య విరుద్ధముకాదు. ఏలయన, కుతుబుషాహి రాజవంశొదయమునుండిగాని, తరువాతి రాజుల కాలములోగాని అట్టి రాజాభిమానముతో, వదాన్యతతో ఈ భాష, సమ్మానింపబడ లేదు. 'రాజసభలోనే ప్రతిభాషయు పరిపుష్టి ప్రాభవములు పొందుచుండుట సర్వజనవిదితమే. తెలుగు భాషా ప్రాగల్భ్యమును ప్రకటించిన మొదటి రాజవైతాశికుడు ఇబ్రహీం కుతుబుషా.

ఆతని జీవితములో ప్రారంభదశ దేవరకొండలో గడచేను. తరువాతి కాలములో ఏడు సంవత్సరములు దేశ భ్రష్టుడయి విజయనగరమున గడపెను. ఇట్టి పరిసరముల మధ్య కాలములోనే స్థానిక సంపర్కములచే, ప్రభావితుడయి తెలుగుభాష నేడ విశుద్ధప్రీతి గలవాడయ్యెను. ఇతడు ఆంధ్ర భాష యందు మంచి పండితుడు. ఆంధ్రకవి పండితుల కావ్యాలలోని ప్రౌఢ కవితాంశముల రసగ్రహణ పరాయణుడయియుం డెను. అతని సభాస్థానము (దర్బారు)న ఉర్దు, పారసీ కవుల కెట్టి ఆశ్రయముండెనో అట్లే తెలుగు కవులకును ఆశ్రయ స్థానమై వెలసెను. ఈతెలుగు కవులకును రాజుగారి వితరణములో భాగము దొరకుచుండెను. ఆంధ్ర భాషలో మనొహర కవితాగానమును రాజుగారికి వినిపించిన వారిలో అద్దంకి గంగాధరకవి యొకడై యుండెను. ఇతడు ప్రతిభాశాలి యగు తెలుగుకవి. ఆంధ్రవాఙ్మయ భూషణుడు. ఇతడు తపతీసంవరణోపా ఖ్యానమను మహాప్రబంధనిర్మాతగా ప్రసిద్ధి చెందిన వాడు. ఈ కావ్యము ఇబ్రహీంకుతుబుషాకు అంకితమీయబడినది. దర్బారులోని రాజసామంతులును, సర్దారులును రాజు మార్గమునే అనుసరించిరి. వీరిలో అమీన్ ఖాను అనువాడు ఒకడు. పొన్నికంటి తెలగనార్యుడను కవికి అమీన్ ఖాన్ ఆశ్రయదాతగా ఇప్పటికిని స్మరింపబడుచున్నాడు. పటంచెరువు నివాసి అయిన ఈకవి "యయాతి చరిత్రము" అను కష్టసాధ్యమగు అచ్చతెనుగు కావ్యమును వ్రాసెను. ఈ కావ్యము ఆకాలమునాటి ఆచార సంప్రదాయములను గూర్చియు, సంస్కృతి, సాంఘిక పరిస్థితులను గూర్చియు ఎక్కువగ తెలుపుచున్నది.

ఇబ్రహీం కుతుబుషా 1580 జూన్ 5వ తారీఖున కీర్తి శేషుడ య్యెను.

ఏ. ఎం. ఎస్.

ఇస్రాయిల్ : ఇస్రాయిల్ మధ్య ప్రాచ్యములో నున్న యూదుల సర్వస్వతంత్రమైన రిపబ్లిక్కు. పాలస్తీనా మీదినుండి బ్రిటిషువారి ఆధ్వర్యము (మాండేట్) తొలగి పోయిన తర్వాత 14 మే, 1948 లో ఇది స్వాతంత్య్రమును ప్రకటించినది. జెరూసలెం దీనికి రాజధాని, ప్రభుత్వభాష హీబ్రూ, వారి జాతీయ పతాకమున రెండు నీలి అడ్డుగీతల నడుమ 'డేవిడ్' అను ఆరుమొనల నక్షత్రమొకటి తెల్లని భూమిక మీద చిత్రింపబడియుండును.

1947 లో ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళిక ప్రకారమును అరబ్బులతో 1949 జరిగిన యుద్ధ విరమణ సంధి సూత్రముల ననుసరించియు ఇస్మాయిల్ సరిహద్దులు