ఇతిహాసములు- పురాణములు
సంగ్రహ ఆంధ్ర
'గేబ్రియల్లెడి అనన్ జియో', ఇటాలియను కవులలో నెల్ల మహామహుడు. నాటకము, రొమాంటిక్ కవిత, వచనము, నవల, వ్యాసము మున్నగు వివిధ వాఙ్మయ ప్రక్రియల యందు ఇతనికి గల ప్రతిభ అనన్యసామాన్యము. ఇతడు దైవోపహతుడగు మస్సొలినీకి ఆప్తమిత్రుడుగా నుండెను. మస్సోలినీ కూడ కవితాశక్తి సంపన్నుడై యుండెను. ఇతడు రాజకీయశాస్త్రములపై కొన్ని చక్కని కరపత్రములను వ్రాసెను. వీటియందు ఇతని మహా వక్తృత్వశక్తి, సారస్వత లాలిత్యము తేటపడుచున్నవి. వక్తృత్వమున ఇతనిని మించినవారు అల్ప సంఖ్యాకులే కలరు. 'డ్ ఏమిసిస్' అను కవి "ఇల్ కనోర్" (హృదయము) అనుగ్రంథమును రచించెను. ఇది ఆధునిక రచనలలో కడపటి రచనయై యున్నది.
ఇటాలియను రచయితలు తమ దేశమునకు వెలుపల విశేష ఖ్యాతిని గడించిన వారు కారు. ప్రపంచమందంతటను వ్యాప్తిలో నున్న వాఙ్మయోద్యమములందలి సాధారణ ప్రక్రియలనే వీరు అనుసరించియున్నారు. శాస్త్రీయములును, ఆర్థికములును అగు సమస్యలకు వాఙ్మయము, కవిత, క్రమముగ స్థాన మొసగుచున్నవి. పత్ర లేఖన కళ వృద్ధి నొందుచు, ప్రపంచము యొక్క దృష్టి పథము నాకర్షించుచున్నది. వాఙ్మయ పత్రికలు, విద్యావిషయక పత్రికలు, సంకల్పమునందును, భావనయందును, శైలి యందును సంపూర్ణముగా నవ్యమైన ధోరణిలో నున్నవి. ఈనాడు ఇతర స్థలములయందు వలె ఇటలీ యందును జాతీయ - అంతర్జాతీయములగు ప్రయోజనములను సంపాదించుటకు సాధనముగా వాఙ్మయము ఉపయోగపడు చున్నదని సంగ్రహముగా నుడువవచ్చును.
తా. ఆ. భా.
ఇతిహాసములు - పురాణములు : "గురుపరంపరో పదిష్టమైన ప్రాచీన చరిత్రమును వర్ణించు గ్రంథ మితిహాసము. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితము లనెడి యైదు లక్షణములుగల పురాతన వృత్తాంతమును వర్ణించు గ్రంథము పురాణము అని పెద్దలు వీటికి లక్షణములను నిర్వచించిరి. ఇం దొకింత భేదము గోచరించినను సనాతన కథా బోధకత్వము అను ప్రధాన విషయమున నీ రెండును సమానములే. అందుచేతనే ఛాందోగ్యోపనిషత్తు, ౠగాద్యష్టాదశ విద్యలు పేర్కొనుచు, 'ఇతిహాస పురాణము'ను ఒక విద్యగా గణించినది. అయినను రామాయణ మహాభారతము లితిహాసము లనియు, మాత్స్య నౌర్మాదులు పురాణము లనియు వాడుక మాత్రము లేకపోలేదు.
ఇట్లు జరిగినదట యనుచు, వృద్ధగరందరితో నొకరికొక రుపదేశించుట. "ఇతిహ, ఐతిహ్యము" అని చెప్పబడును. ఆ యుపదేశము ననుసరించి చెప్పిన కథయే ఇతిహాసము. సంహితా బ్రాహ్మణాదులందు చిన్న చిన్న యితిహాసములు పెక్కు కలవు. ఋగ్వేదమునందు అత్రి, గోను, దీర్ఘనమొ వామదేవాది బ్రహ్మర్షుల కథ లనేకములున్నవి. అందు సంగ్రహముగా నున్న యితిహాసములే భారతాదులలో విస్తరిల్లినవి. మరియు ఖబుస్సహంతో సంగ్రహముగా నున్న “ఊర్వశీ పురూరవుల కథ" రవిక బ్రాహ్మణమున నించుక పెరిగినది. అదే పురాణములందును కావ్యము లందును వర్ధిల్లినది. పురాణములలోని ఇంద్రవృత్రాసుర కథ వేదములోనిదే. చక్కగా ఉభయ వాఙ్మయములు పరిశీలించినవారికి పురాణాదు లలోని కక్షలన్నిటిగా మంత్ర బ్రాహ్మణాదులలో నిజరూపముగా నున్న యితిహాసములే మూలమని తెలియగలదు.
ఇక పురాణములందును, వాని విషయము మిక్కిలి యవ్యవస్థగానున్నది. పదునెనిమిది పురాణములను వ్యాసుడే నిర్మించేనని ఇతర పురాణము లన్నియు చెప్పుచున్నవి. అష్టాదశపురాణముల సారము సంగ్రహించి కృష్ణద్వైపాయనుడు భారతసంహిత రచించెనని పారాశర్యోప పురాణము చెప్పుచున్నది. పొద్మవారాహ శ్వేవాదిశల్పములందు బ్రాహ్మపొద్మ వాయవ్యాది పురాణములు ఉత్పన్నము లైనవని మత్స్యపురాణాదులు చెప్పుచున్నవి. ఇం దేమాట నమ్మతగినది? చెప్పుట కష్టము. ఇది యిటుండ, మహాపురాణములు పదునెనిమిది యని సంఖ్యా నిర్ణయము మాత్రమే ప్రతీతము కాని, దానిని పేర్కొనుట మాత్రము సునిశ్చితముగా లేదు. ఒక పట్టికలో నున్న బ్రహ్మాండ పురాణము మరియొక పట్టికలో నుండదు. వాయుపురాణము నట్లే. కొన్ని నారదీయమును గ్రహించనేలేదు. ఒకచో భాగవతమునకు బదులుగా దేవీభాగవతమున్నది. ఇందుకు విష్ణు పురాణమిచ్చిన మహాపురాణ పట్టిక యొకటి పరీక్షింతము ·