Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రియములు

సంగ్రహ ఆంధ్ర

1619 సం. జకార్తా నగరము స్థాపింపబడినది. ఇదివరకు దీనిని బటావియా యని వ్యవహరించువారు. ఇది యిపుడు ఇండో నేషియా రాజధాని. రేవుపట్టణము. గొప్ప వాణిజ్య కేంద్రము. 1940 సం. జనాభా 4.70.700. ఇందు 40,100 మంది ఐరోపావారు. పర్వత పరిసరములలోని బాండుంగ్ (Bandung) ద్వితీయ ముఖ్యనగరము.

బి. ఎన్. సి.

ఇంద్రావతి  : గోదావరి యొక్క ముఖ్యమైన ఉపనదులలో ఇంద్రావతి యొకటి. మన దేశమందలి చిన్న నదులలో దీనికి విశిష్టత గలదు.

ఇది తూర్పు కనుమలలోని భాగమైన నామగిరియందు పుట్టి, నైరృతి దిశగా ఒరిస్సా, బస్తరులగుండ పారి హైదరాబాదు రాష్ట్రపు సరిహద్దున గోదావరినదియందు సంగమమగుచున్నది. దీని పరివాహ ప్రదేశము కొంత మాళువ (ఏజన్సీ)లును, మిగిలినది తూర్పుతీర భూమియునై యున్నది. చాలవర కిది దట్టమైన అడవులచే కప్పబడినది.

ప్రకృతి సౌందర్యమును తిలకించవలెనన్నచో ఈ ప్రాంతమును దర్శింపవలసినదే.

ఇందు గల "మార్దియను" గుట్టల పరిసరములందు గోండులను కొండజాతివారు వసించుచున్నారు. వారు ఆదిమ ద్రావిడులు, ప్రపంచ నాగరికత ముందునకు పరుగులిడుచున్న నేడు రాతి పనిముట్ల నుపయోగించుకొనుచు గోండ్లు ఇంద్రావతీ పరివాహ ప్రదేశమున మనుచున్నారు.

యం. వి. రా.

ఇంద్రియములు  : ప్రత్యేక విధులను నిర్వర్తించుటకు ఏర్పడిన వివిధ జీవకణముల సముదాయమును ఇంద్రియములు అందురు. చూచుటకుకన్ను, బరువులను ఎత్తి దించుటకు చేయి, రక్తము నుండి మూత్ర సంబంధమగు లవణములను వేరుచేయుటకు మూత్రపిండములు, శ్వాసించుటకు ఊపిరితిత్తులు, ఉపయోగపడుచున్నవి. సామాన్యముగా ఇంద్రియములు తమ తమ ప్రత్యేక విధుల నిర్వర్తించుటకు ఏర్పడియున్నను, మొత్తముమీద ప్రతి అవయవము ఇతర అవయవములతో సహకరించి, ఒక సమష్టి కార్యమును నెరవేర్చుటయందు పాల్గొనును. ఇంద్రియములు ఒకదానిపై నోకటి ఆధారపడుచు పరస్పర సహకారమును కలిగి తమ కృత్యములను నెరవేర్చును.

జంతువుల ఇంద్రియములను వాటి ఉత్పత్తిని బట్టియు వాటి స్థానమును బట్టియు, నిర్మాణమును బట్టియు, కృత్యము లను బట్టియు రెండు వర్గములుగా విభజించనగును. పిండోత్పత్తియందు సామ్యముకలిగిన వివిధ జంతువుల అవయవములు, అని యుండెడి స్థానములనుబట్టి, తుల్య జాతీయ ఇంద్రియములు (Homologous organs) అన బడును. అట్టి అవయవములు సాధారణముగా తమ నిర్మాణమున ఒకే విధముగా నున్నను, పక్షి రెక్కలవలె మానవుని చేతులవలె, వేరువేరు పనులను గలిగియుండును. నిర్మాణమున పోలిక కలిగిన ఇంద్రియములన్నియు, ఒకే ఉత్పత్తిని కలిగియుండవు. ఇంద్రియములు ఒక పనిని నిర్వర్తించుటకు వీలుగా పొందుపరచబడి యుండుటచే పైకి పోలికలు కలవిగా కనిపించినను, వాటి నిర్యాణమునందలి ప్రధాన ఉద్దేశము, విధానము పేరుగా నుండును. అట్టి ఇంద్రియములు (Analogous organs) సజాతీయ ఇంద్రియములు అనబడును. పక్షి రెక్కలకును, క్రిమికీటకాదుల రెక్కలకును గల ఇట్టి భేదము చూడనగును,

జంతుకోటి యొక్క అవయవములలో, వాటి నిర్మాణమునందలి వికృతిని బట్టియు, వాటి స్థానమునుబట్టియు, గొప్ప వైవిధ్యము ఏర్పడుచున్నది. ఉన్నతజాతి జంతువుల యొక్క ఇంద్రియములు సాధారణముగా క్లిష్టమైన నిర్మాణమును కలిగి ప్రత్యేక ప్రయోజనముల కొరకు ఉద్దిష్టములై ఉండును. హీనజాతి జంతువుల యొక్క ఇంద్రియములు సరళములై, అంతక్లిష్టముగాని నిర్మాణమును కలిగియుండును. ఈ దిగువ కొన్ని సాధారణ ఇంద్రియములును, వాటి రూపాంతరము లును సంగ్రహముగా వివరింపబడుచున్నవి.

వెన్నెముక కలిగిన ఉన్నత జంతువులు ఊపిరితిత్తుల మూలమున శ్వాసను పీల్చుకొనును. కాని వెన్నెముక లేని జంతువుల శ్వాసక్రియ భిన్నములయిన మార్గముల ద్వారమున జరుగును. చేపలు వెన్నెముక గల జంతువులే అయి నను అవి తమ 'మొప్పలు' (gills) అనెడి శ్వాసేంద్రియములలోని సన్నని తంతువుల ద్వారమున నీటిలోని ప్రాణ వాయువును గ్రహింపగలుగుచున్నవి. చేపలకు మెడ,