విజ్ఞానకోశము -౨
ఇండోనేషియా (భూగోళము)
కొక పర్యాయముకూడ పంటతీయుటకు వీరి కవకాశము కల్పింపబడినది.
ఖనిజములు : ఖనిజములు పరిమాణమున తక్కువగా నున్నను వాటి విలువ మిక్కిలి యధికము. సుమత్రాలోని పాలెంబాంగ్ (Palembang) సమీపమున జాంబి (Djambi) లోను, మెదాన్ (Medan) లోను పెట్రోలియం లభించును. బోర్నియోలోని బాలిక్ (Balik), పోపన్(Popan) టారక౯ (Tarakan) ప్రాంతములందు చమురు లభించును. జావాలోని రేమ్బాన్ వద్ద కొంత నూనె దొరకుచున్నది. సేరందీవిలో కూడ నూనెకలదు. పశ్చిమ, మధ్యసుమత్ర, బోర్నియోలలో మామూలు రకపు బొగ్గు తీయబడును. ఇట 1940 సంవత్సరములో 20,00, 422 టన్నుల దొరకినది. బింటన్ (Bintan) ద్వీపమున లభించు బాక్సైటు, జావాలో తీయబడు గంధకము, మాంగనీసు, సెలబెస్ లో దొరుకు నికెలు ఇచ్చటి యితర ఖనిజములు.
రబ్బరు, చమురు, చక్కెర, తగరము, తేయాకు, ఇండొనేషియానుండి యితర దేశములకు ఎగుమతి చేయబడును. జపానునుండి ప్రత్తి సరకులు, అమెరికా సంయుక్త రాష్ట్రముల నుండియు, నెదర్లాండ్సు నుండియు వచ్చు యంత్రములు, ఇనుము, ఉక్కు, ఆహార పదార్థములు, ఇండో నేషియాలోని ముఖ్యమైన దిగుమతులు.
జనాభా : ఇండో నేషియాలో నివసించు జనాభాలో నధిక భాగము మలయా (Malays) జాతికి చెందిన వారేయని చెప్పవచ్చును. వీరు తెలివి, సంతోషశీలము గల ప్రజలు. అవసరమైనపుడు కష్టించి పనిచేయుదురు. కానీ తమ విరామ కాలమును ఒక ఆస్తి వలె చూచుకొందురు. ఇండోనేషియన్, మలా నేపియన్ (Malanesian) పోలినేషియన్ (Polynesian) వర్గములకు చెందిన 250 భాష లిచట వ్యవహారమున నున్నవి. 13వ శతాబ్దమున అరబ్బులచే ప్రచారము గావింపబడిన ఇస్లాం మతావలంబకుల సంఖ్యయిట హెచ్చు. 1931 సం. న ఇచట నివసించు అరబ్బుల సంఖ్య 71,000 అదే సంవత్సరమున 1,2,34,000 చీనా దేశీయు లిచట నివసించిరి. వీరిలో చాలమంది వ్యాపారము చేయువారే.
ఇండోనేషియా ప్రజల సంస్కృతి ఆయా ప్రదేశములనుబట్టి భిన్నముగానున్నది. పశ్చిమభాగములందు నివసించు ప్రజలు మలయా (Malay) వర్గమునకును, పూర్వ భాగములలోనివారు పాపువన్ (Papuan) వర్గమునకును చెందిన వారు. సుమత్రా అంతర్భాగములందు కుబు (Kubu) బోర్నియోలో డయక్ (Dayak) ఆదిమ జాతులు వెనుకబడిన మానవ జాతులుగా నున్నవి. ఇతరులు, అందులో ముఖ్యముగా బలి, లోంబక్ లోనివారు జావానాగరికతకు చెందియున్నారు. జావాద్వీప పూర్వభాగమున నివసించు బలి (Bali), లోంబాక్ (Lombak) ప్రజలు వ్యవసాయమే తమ వృత్తిగా జీవించుచున్నారు. బలి వర్గమునకు చెందిన బలిసిస్ (Balinese) నర్తకులు ముఖసౌందర్యమునకును, ఉత్తమ నృత్యమునకును ప్రఖ్యాతి వహించియున్నారు.
జావాలో జనాభా యధికము. వీరు దాదాపు వేయి సం. ల నుండి సంప్రదాయసిద్ధమైన అభివృద్ధిని సాధించు చున్నారు. మలయా మానవజాతికి చెందిన మూడు మానవ జాతివర్గము లిటనున్నవి. పశ్చిమమున సుండావారు (Sundanese), మధ్య భాగమున జావావారు (Javanese) పూర్వ భాగమున మధురవారు (Madurese) నివసించుచున్నారు. 8, 9 శతాబ్దులలో వీరు బౌద్ధమతావలంబకులుగా నుండి తరువాత హైందవులుగా మారినారు. మధ్యజావాలోని బోరోబుడూర్ (Boro Budur) మహోన్నత స్తూపము వీరి శిల్ప చాతుర్యమునకు చిహ్నము. ఇండో చైనాలోని ఆంగ్ కార్ శిల్ప శిథిలములతో ఈ స్తూపపు నాలుగు వేదికల శిల్ప సౌందర్యము పరిపోల్పదగినదని చెప్పవచ్చును. ఇస్లాం మత మిచట వ్యాపించుటతోడనే ఈ మహోన్నత నిర్మాణము అపవిత్రము చేయబడకుండ నుండుటకు మట్టితో కప్పివేయబడినది. తరువాత పరిసరములందు అడవులు పెరిగి ఆ నిర్మాణము వానిచే కప్పబడినది. ఇటీవల ఒక వంద సంవత్సరములకు పూర్వము తిరిగి యిది కనుగొనబడినది. 1891 లో ట్రినిల్ (Trinil) ప్రదేశమునందలి పిథెకన్ త్రోపస్ (Pithecanthropus) అవ శేషములును, 1940 సం.న మనుష్యుల పుర్రెలు నాలుగు లభించిన జావాలోని ప్రదేశమును ప్రసిద్ధినొందినవి. పిథెకన్ త్రోపస్ దాదాపు చైనాలోని సినాన్ త్రోపస్ (Sinanthropus) వలే ప్లీస్ట్రో సీన్ (Pleistocene) కాలమునకు చెందినది. లభ్యములైన మాననావశేషములలో (Fossils) ఇవియే మిక్కిలి ప్రాచీనములైనవి.