ఇండోనేషియా (చరిత్ర)సంగ్రహ ఆంధ్ర
పంటయు పండినవి. ముఖ్యముగా అరటి, పనస, దబ్బపండ్లు లక్షలకొలది ఎకరములలో పండించేదరు. ఇవికాక పల్లపు భూములయందును, కొలదిగా మెట్టభూములందును చెరకు, పెండలము, మిరియము, తమలపాకు, సుగంధ ద్రవ్యములు, నువ్వులు, ప్రత్తి, మల్బరి వృక్షములు, రకరకముల కూరగాయలు పండింపబడును. మల్బరి వృక్షములు తరచుగా పల్లపుభూములకును, మెట్టభూములకును సరిహద్దులయందు చిన్న చిన్న గుట్టలమీద పెంచబడును.
ఇండోచైనాలో పశుపోషణము అభివృద్ధి చెందలేదు. 40 లక్షల పందులు పెంచబడుచున్నవి. గంగి రెద్దు జాతికి చెందిన ఒక జాతి జంతువును బండ్లు లాగుట కుపయోగింతురు. టాంగ్ కింగ్ డెల్టాయందును, అన్నాంనందును, జంతువులను పెంచుటకు తగినంత స్థలము గాని, పరిస్థితులు గాని లేవు. కానీ కాంబోడియాలో పశుసంపద ఎక్కువగా కనిపించును. ఈ రాష్ట్రమునందు పట్టణములలో బండ్లు లాగుటకును, ఉత్తరమునమన్న పర్వత ప్రాంతములలో బరువులు మోయుటకును, జంతువుల నుపయోగింతురు. పల్లపు వ్యవసాయము జరుగు ప్రాంతములుతప్ప మిగిలిన దేశమందు అటవీసంపద విరివిగానున్నది. వెదురు. కంప, బొగ్గు, అక్క, అడవిపండ్లు మొదలగు అటవీ సంపద లభ్యమగును.
ఈ దేశమున 19 వ శతాబ్దపు అంత్యదశలో పరిశ్రమలు ప్రారంభింపబడినవి. టాంగ్ కింగ్ డెల్టా కుత్తరముగా సముద్రతీరమున దొరకు ఆంధ్రసైటు బొగ్గును త్రవ్వుట ముఖ్యమయిన పరిశ్రమ. 1950 సం. న త్రవ్వబడిన బొగ్గు 8 లక్షల టన్నులు. తగరము, సీసము, తుత్తునాగము, టంగ్ స్టను, మాంగనీసు, క్రోమియము, ఆంటిమొనీ, ఇనుము, బంగారము, బాక్సయిటు, గ్రాఫయిటు, ఫాస్ఫే టులుకూడ లభించును. ఈ ఖనిజసంపద దేశమందంతట చెదరియున్నను, టాంగ్ కింగ్ పీఠభూములలో ఖనిజములు కేంద్రీకృతములయినవని చెప్పనగును. ఈ ఖనిజముల ఉత్పత్తి అస్థిరమై ప్రతి సంవత్సరము మారుచుండును.
ప్రజల అనాగరికతవలన తక్కిన పరిశ్రమలు నెమ్మదిగా అభివృద్ధి చెందుచున్నవి. 2లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి చేయబడు సిమెంటుపరిశ్రమ ముఖ్యమయినది. చిన్న పడవలు, రసాయన పదార్థములు, గాజు, రంగులు, సబ్బు, అగ్గి పెట్టెలు, కాగితములు, వస్త్రములు, రబ్బరు వస్తువులు తయారుచేయు ఫాక్టరీలు, హనాయ్, హైఫాంగ్, హ్యూ, తురాన్, సై గాను మొదలగు పట్టణములందు కలవు. మొత్తముమీద టాంగ్ కింగ్ నందు వస్తువులలో నెక్కువ భాగము తయారగుచున్నది. బొగ్గు చే నడుపబడు విద్యుత్తు నుత్పత్తిచేయు యంత్రములు పెద్దపెట్టణములలో నెలకొల్పబడినవి. కర్మాగారములు చాలవరకు ఫ్రెంచి యాజమాన్యముక్రింద నున్నవి. స్వదేశస్థులు స్వయముగా కార్ఖానాలు స్థాపించుటకు ఈ మధ్యనే మొదలు పెట్టిరి.
పంచదార, పొగాకు, వనస్పతి నూనెలు, రబ్బరు, లక్క, చర్మములు మొదలగు వాటిని పదునుచేయు ఫాక్టరీలు కలవు. కలప కార్ఖానాలు దేశమందు చెదరి యున్నవి. ఇవి అంత ముఖ్యమయినవి కావు.
ఇండోచైనాలో పరిశ్రమలు ఎక్కువగా ఫ్రెంచి పెట్టుబడిపై నాధారపడియున్నవి. ధనాదాయము కలిగించు వస్తువుల నుత్పత్తి చేయుట దేశీయులయందు నెమ్మదిగా వృద్ధిచెందుచున్నది.
ఇండోచైనాకు అధికమగు నిదేశ వ్యాపారము కలదు. 1953 సం. లో 1,34,267 మిలియను ఫ్రాంకుల విలువ కలిగిన 10,08, 400 టన్నుల సరకులు దిగుమతి చేయబడినవి. దిగుమతులలో ముఖ్యమైనవి పాలడబ్బాలు, గోదుమపిండి, పంచదార, పెట్రోలియంనుండి తయారగు వస్తువులు, కాగితములు, రాసాయనిక పదార్థములు, వ్యవసాయ యంత్రములు, విద్యుత్ పరికరములు, మోటారు కార్లు, వాటి విడిభాగములు. ఆ సంవత్సరములోనే 34,575 మిలియను ఫ్రాంకుల విలువ కలిగిన 7,09,000 టన్నుల సరకుల ఎగుమతి చేయబడినవి.
ఎగుమతులలో ముఖ్యమయినవి ధాన్యము, మొక్కజొన్న, ముడిరబ్బరు, ఎండబెట్టిన కూరగాయలు, చర్మములు, చేపలు, మిరియాలు, సిమెంటు, 'టీ' మొదలైనవి.
కె.వి. రె
ఇండోనేషియా (చరిత్ర) ఇండోనేషియా ద్వీపసమూహము గల ఒక స్వతంత్ర రాజ్యము. చరిత్రకు పూర్వయుగములోనే ఈ ద్వీపములలో జనులు నివసించుచుండెడివారు. వారు పొట్టివారు,నల్లనివారు. కాలక్రమమున ఆసియాఖండమునుండి