Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఇండోచైనా (చరిత్ర)

మికాంగ్, రెడ్ నదుల డెల్టాలు, ఈ నదులు తెచ్చు ఒండ్రుమట్టితో నేర్పడినవి. ఈమట్టికి మూలకారణమయిన పర్వతములు నల్ల రాతితో కూడినవి. ఈ నల్లరాతి కొండ లకు 'పిస్టు' అను పలక రాయి ఆధారము. టాంగ్ కింగ్ లో ఉత్తర దక్షిణ ప్రాంతముల నీరాళ్ళపై నీ చలువరాళ్ళును, స్ఫటికత్వము నొందిన తక్కిన సున్నపురాళ్ళును, పొరలుగా వ్యాపించియున్నవి. వీటిపైన కార్బానిఫరసు యుగము నకు చెందిన రాళ్ళదొంతరలు కలవు. రెడ్ నది యొక్క ఎగువలోయలో యెన్, హైడువాంగ్ ల మధ్య శ్రేష్ఠ మైన బొగ్గుగనులున్నవి. మీకాంగ్ నదీలోయలలో సున్నపు రాయి దొరకును. ఈ సున్నపురాళ్ళు కార్బానిఫరను యుగమునకు చెందియుండవచ్చును. లాకోనునకు దక్షిణ మున వ్యాపించిన రాళ్ళు ట్రయాసిక్ యుగమునకు చెందినవి. ఈ ప్రాంతమున కొన్ని జిల్లాలలో బంగారము లభించును.

వేడిని, తేమను కలిగిన ఈ దేశపు శీతోష్ణస్థితి ఉష్ణ మండలమునకు చెందినట్టిది. ఉత్తర దక్షిణ భాగముల మధ్య ఉష్ణోగ్రతలలోను, నాయుమండల స్థితులలోను మిక్కిలి తేడాలు కనిపించును. కొచ్చిను చైనా, కాంబో డియా రాష్ట్రములలో ఋతువులు, ఋతు పవనముల కను గుణముగా నుండును. ఈశాన్య ఋతుపవనములు అక్టోబరు 15 వ తారీఖునుండి ఏప్రిలు 15 వ తారీఖువరకు వీచును. ఉష్ణోగ్రత 80.6° నుండి 84.2° వరకు పెరుగును. ఏప్రిలు మే నెలలు మిక్కిలి వేడిగానుండు మాసములు. ఈ నెలలో ఉష్ణము 86° లకు, 93.2° లకు మధ్యనుండును.

అన్నాం రాష్ట్రపు శీతోష్ణస్థితి అంతగా క్రమబద్ధముగా నుండదు. సెప్టెంబరు నెలలో సముద్రముపైనుండి వీచు ఈశాన్య ఋతుపవనములు వర్షమునిచ్చును. ఇదియే తుఫానులు వీచు నెల. ఇప్పటిగాలులు ఉష్ణోగ్రతను 59° వరకు తగ్గించును. పశ్చిమమున ఎత్తుననున్న లావోస్ రాష్ట్రము చల్లగాను, పొడిగాను ఉండును. లోతైన లోయలు, ఎత్తైన పర్వతములు ఈ రాష్ట్రము యొక్క శీతోష్ణస్థితిలోని మార్పులకు కారణములగుచున్నవి.

సాగుచేయబడుచున్న ప్రాంతములలో పూర్వము సమృద్ధిగానున్న అడవిజంతువులు ఈనాడు పర్వత ప్రాంతములకు తరలిపోయినవి. ఈ అడవి జంతువులలో ముఖ్యమయినవి గుంపులుగా తిరుగు ఏనుగులు, పెద్ద పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, కోతులు, ఎలుకలు, మస్టు, పామ్ అను ఎలుకలు మెట్టభూములలో కాననగును. పర్వతప్రాంతములలో చిరుతపులులు, ఆడవిపందులు. దుప్పులు నివసించును. అడవి ఎనుములు, లావోస్ రాష్ట్రములో సామాన్యముగా తిరుగుచుండును. పెంపుడు ఎనుములుకూడ ముఖ్యస్థానము వహించియున్నవి. వీటి సంఖ్య సుమారు 14 లక్షలు ఉండును. 'లేబూ' అను ఎద్దులు సరకులు మోయుట కుపయోగించును. అడవికోళ్ళు, నెమిళ్ళు, రకరకముల బాతులు మొదలగు పక్షి సంత తులు చిట్టడవులలోను, బురద నేలలలోను నివసించును. వివిధ సరీసృ సములు కూడ కలవు. ఇవి ఆహారముగా కూడ నుపయోగపడును. జెర్రీ చేపలు టాంగ్ల్కింగ్ రాష్ట్రము నందలి నదులలో పెరుగును. అన్ని రకముల దోమలు, చీమలు, జలగలు సామాన్యముగా కనబడును. టాంగ్ కింగ్ రాష్ట్రమునందు పట్టుపురుగులు సహజముగానే పెంపొం దును. వీటికి కావలసిన మల్బరివృక్షములు వేలకొలది ఎకరములలో పెంచబడుచున్నవి.

ఈ దేశమున ఉష్ణమండలమునకు సహజమగు వృక్ష జాలముకలదు. ఈ మండలమునకు చెందిన అన్ని చెట్లును ఇచ్చట పెరుగును. ఇండ్లు కట్టుటకును, ఇంకను పెక్కు పనులకును, వెదురు చాల ఉపయోగింపబడును, రబ్బరు కూడ దొరకును.

ప్రాచ్యవ్యవసాయమునకు సంప్రదాయ సిద్ధమైన సహాయసస్యములన్నియు ఈ దేశమునం దేదో యొక స్థానిక పరిసరమున కనబడుచునేయుండును. ఇండ్ల ఎదుట దొడ్లలోను, పల్ల పుప్రాంతములం దక్కడక్కడ పొలముల లోను ప్రాచ్యదేశముల కనునగు ఫలవృక్షములను పెంచు దురు. స్థానిక శీతోష్ణప్రమాణముల కనుగుణముగా కొన్ని వృక్షములు అక్కడక్కడ కేంద్రీకృతమైయున్నవి. లిచి వృక్షములు దక్షిణమునకంటే ఉత్తరముననే ఎక్కువగా పెంచబడును. కాని కొబ్బరిచెట్లు మాత్రము అన్నాంలో తురానునకు దక్షిణముగానున్న సముద్రతీరమునకు మధ్య భాగమున పెరుగును. ఇండోచైనా అంతట వరి ముఖ్య మగు పంట.

1952 సం. లో 1 కోటి 26 లక్షల ఎకరములలో పరి పంటయు, 13 లక్షల ఎకరములలో మొక్కజొన్న