పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండవీడు సంగ్రహ ఆంధ్ర


యుండవచ్చును. కొండ నెత్తముపై నున్న శివాలయ మునకు తూర్పుగా గణపతి గుడియు, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్కయు, నాగకన్యల యొక్కయు విగ్రహములును గలవు. వాటిని ఆనుకొనియున్న కొండగుహయందు లింగము, పానవట్టము గలవు. పై పేర్కొన్న చతురపు స్థలమునకు చుట్టును గల పర్వత శిఖరములపై కోటలు కట్టబడియున్నవి. కొండపైకి పోవు సోపానమార్గములకు ప్రక్కగా ఒక శిథిలనృసింహాలయము కనిపించును. ఇందలి నృసింహ విగ్రహము శిథిలమై కొండక్రిందకు జారిపడి యున్నది. ఈ నృసింహాలయమునందు పెక్కు శాసన ములు కనిపించుచున్నవి. ప్రజల సౌక ర్యార్థము నిర్మింపబడిన బంగళాకు ఆగ్నే యమున నొక శిథిల దేవాలయమును, పశ్చిమమున నొక మండపమును గలవు. బంగళానుండి దిగువకు వచ్చు మార్గ మున మరొక మండపమును, రెండంతస్తుల ద్వారమును గలవు. బంగళాను ఆనుకొని తూర్పున రెండువరుసలలో 16 స్తంభములు గల మండప మొకటి కలదు. ఇది వేమన యోగిదని చెప్పుదురు. దీనికి తూర్పున అంబగుడి కలదు. పర్వత మార్గమునకు దక్షిణమున గంజి కాలువయు, ఆ కాలువదగ్గర గంగాధర రామేశ్వరాలయమును కలవు. ఈ గుడి యొద్దనున్న స్తంభముమీద శ్రీరంగరాయల వారి శాసన మొకటి కనిపించుచున్నది. కొండపై రాజ మందిరము (ఫారెస్టు బంగళా) నుండి చెరువులకు బోవు మార్గమునకు తూర్పున నొక విష్ణ్వాలయమును, ఒక శివా లయమును శిథిలములై కనిపించుచున్నవి. కొండలమధ్య భాగమున ఒక గుహయందు 'కొండ సింగరయ్య' అను పేరుగల నృసింహస్వామి విగ్రహము కలదు. కొండపై రెండు మసీదులు కలవు. ఇవి ఇప్పటికిని మంచిదశలో నున్నవి. పుట్టుకోటకు వెలుపల నవులూరి పోతరాజు గుడియు, నాగవరమ్మ గుడియు ఉన్నట్లు ఒక శాసనము వలన తెలియవచ్చుచున్నది. కొండ దిగువభాగమున ఇపుడు 'కోట' యని పిలువ బడు గ్రామమునకు దక్షిణమున గోపీనాథస్వామి గుడి కలదు. ఇది మిక్కిలి రమణీయమైన పని తనముగల స్తంభ ములచేతను, చిత్తరువులచేతను అలంకృతమై యున్నది. దీని ప్రక్క శిథిలమైన వేయికాళ్ల మండప మొకటి కలదు.

ఈ దేవాలయము ప్రస్తుతము మహమ్మదీయులచే ప్రార్థనా మందిరముగా ఉపయోగింప బడుచున్నది. దీని మ్రోల ఇరువది గజముల ఎత్తుగల శిలాధ్వజస్తంభ మొకటి గలదు. దీనిపై ఒక శాసనమును, గుడి యొక్క ఉత్తర ద్వార శాఖలకు ఇరుప్రక్కల శా.శ. ౧జరా౭ లకు సరియగు రక్తాక్షి సం. ఆషాఢ శుద్ధ ౧౧ నాటి సదాశివ రాయల శాసనములును గలవు. ఈ గుడి నాలుగు అంత రాళములు గలదై విశాలముగా నున్నది. దీని వెలుపలి గోడలు విచిత్రమైన తీగెలు, చిత్తరువులు తీర్చిన రాళ్ళతో అమర్చ బడిన జవకట్లతో నొప్పుచున్నవి. గోపీనాథస్వామి గుడికి దక్షిణమున (నా దెండ్లగవనికి పడమర దిశయందు) ఒక శివాలయము శిథిల మైపోయినది. అచ్చోటగల నంది ఇప్పటి కిని ప్రాచీన దేవాలయము లందలి శిల్పకౌశలమును జ్ఞప్తికి తెచ్చుచున్నది. ఆ నంది గర్భమున వరహా లుండె ఆ నని తెలిసికొని, చోరులు కొందరు దాని పృష్ఠభాగమును పగులగొట్టి, వాటిని తీసికొనిరని ప్రతీతి. ఇచట 'లంకెల బావి' యు, 'వసంతఘర్' అను రాజమందిర సముదా యమును ఉండెడివని తెలియుచున్నది. ఇప్పు డవి నామ మాత్రావశిష్టములై నవి. (పుట్టకోట) కొండకు ఉత్తర భాగమున దిగువగా శ్రీనాథ ప్రేరిత మగు 'గృహరాజ మేడ' అను రాజ మందిర ముండెనట. నేడీ ప్రదేశమున కొన్ని మంటి దిబ్బలు తప్ప అన్యవిశేషము లేవియును కానరావు. ఇచట 1898 లో పుట్టకోట కాపురస్తు డగు కుడుముల బొల్లయ్య అనునాతని పొలమునందు వీరభద్రుని యొక్కయు, కాళికాదేవి యొక్కయు విగ్రహములు దొరకె ననియు, ఆరు మాసములు మహోత్సవములు జరుపబడెననియు, అనంతరము అవి ఆలయమునందు ప్రతి స్థితములయ్యె ననియు తెలియుచున్నది. ఆవి నేటికిని మంచి స్థితియం దున్నవి. ఈ ఆలయమునకు సమీపమున పూర్వము రెడ్లు కట్టించిన రంగనాయకాలయ మున్నది. ఇందలి నాగేంద్రుని ప్రతిమ ఇప్పటికిని కనిపించుచున్నది. ఇచటనే యొక కోనేరు గలదు. దీనిని కర్ణాట ప్రభువుల కాలమున ‘దుర్గాధిపతి' (ఖిల్లేదారు) గా నుండిన మాణి క్యారావు కట్టించెనని చెప్పుదురు. దీనికి తూర్పున మాణి క్యారావు గుండములు గలవు. యుద్ధమున మాణిక్యా 52