పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కొండవీడు


మంచుటకు సొరంగ నిర్మాణము జరిగినది. ప్రస్తుత మీ పొరంగము మూయబడి యున్నది. ఈ ప్రభువు నివాసము గోలకొండయే యైనను ఎడనెడ నీతడు రాజధానిని "వదలి బెజవాడ కొండలయందును, కొండపల్లి కొండల యందును గల దుర్గములను పరిశీలించుచు మొనర్చు చుండెడివాడు. మల్తాన్ అబుల్ హసన్ తానాషా, తన పాలనములో కొండపల్లి జిల్లాయందు దుర్గమునకు నుత్తరముగ నున్న ఒంటి మన్యము సమీపమున 'బాలహిస్సార్' అనునొక మహా సౌధమును కట్టించెను. అందలిది బర్మాదేశపు టేకు కలప. ఆ సౌధరాజము చిత్ర విచిత్ర శిల్పకళాసౌందర్య విలసితమయి మనోముగ్ధ కారిగా నుండెను. అది నేడు "భోగము దాని మేడ' యను నామాంతరముచే వ్యవహ దింపబడుచున్నది. జనరల్ కెయిలాడ్ (క్రీ.శ. 1788-1859) అను నాతడు ఆంగ్లేయ పై న్యాధ్యక్షుడు. క్రీ.శ.1788 సం. మార్చి నెల మదియవ తేదీ యుదయము పదిగంటల సమయమున నీతడు కొండపల్లి దుర్గమును ముట్టడించి, మహమ్మదీయు అను ఓడించి, జిల్లా యంతటిని వశపరుచుకొనెను. అంత కొండపల్లి యాంగ్లేయుల పాలనములోనికి వచ్చెను. జన థల్ కెయిలాడ్ కొండపల్లి కోటను స్వాధీనపరచుకొనిన పిమ్మట దాని పునర్నిర్మాణమునకు 'స్టెలెన్స్' అను నొక (మంజనీయరును నియమించినాడు. ఇతని కాలమునందే కొండపల్లిలో 'మిలటరీ పాఠశాల' యొకటి కట్టబడినది. దానికే యిపుడు 'ట్రావెలర్సు బంగళా'గా నుపయో గెలుచుచున్నారు. ఈ దుర్గ సంరక్షణార్థము సైనిక బలము ఆకావశ్యకమని తలచి ఆంగ్ల ప్రభుత్వము వారు క్రీ. శ. 5 సం. లో దానిని అచటినుండి తొలగించిరి. అటవీశాఖాధి కారులచే కొండపల్లి జిల్లాయందు సహ ప్రాధికముగ చందన వృక్షములు నాటబడినవి. అట్లే యన్మారు భవన సమీపమున రబ్బరుచెట్లు పెంచబడినవి. యున్నారు భవనము పై గల శిథిల ప్రాకారములమధ్య నొక విశ్రాంతి భవనమును గూడ నాంగ్లేయ ప్రభుత్వము వా రే కట్టినై. దాని కే 'ఫా రెస్టు బంగళా'యని నేటి వ్యవహారము. ప్రభుత్వము గత నూరు సంవత్సరములలో అటవీశాఖ నించుక పెంపొందించి, ఇచ్చట చేతిపరిశ్రమల కేదో

యాలంబన మిచ్చుచునే యున్నది. అయినను, నాటి గజాశ్వశాలలు, సేనానులమందిరములు, రాచకొట్టములు, రాజాంతఃపురములు, దర్బారు మందిరములు, నివి యవి యన నేల, భిల్లాయంతయు శిధిలమై రూపుమాసియున్నవి. అది గుడ్లగూబలకు, గబ్బిలములకు నాకరమై చూపరకు భయదుఃఖావహముగా నున్నది. రాచబాటయందు గల ఆంజనేయస్వామి విగ్రహ మొకటియే నేటికిని పురాంధ్ర శౌర్య ప్రతాపములను బ్రకటించుచు, ఇప్పటి దీనస్థితిని స్మరణకు దెచ్చుచు, కొండపల్లికి శ్రీరామరక్ష పెట్టు చున్నది. బొ. వేం. కు.శ. కొండవీడు : కొండవీడు, గుంటూరు జిల్లాలో చేరిన నరసరావు పేట తాలూకాయందలి యొక దుర్గారణ్యస్థలము. రెడ్డి రాజుల కాలములో అప్లైశ్వర్యముల ననుభవించిన ఈ కొండవీడు పట్టణము ఈనాడు పాడుపడిన పల్లెగా నున్నది. ఈ పర్వ తమునందు దాదాపు 40 బోడులును (శిఖరములు), ఆరు గుహలును కలవు. ఈ పర్వత శిఖరములకు పశ్చిమమున పర్వతముపైననే మూడు మైళ్ళ చదును ప్రదేశమును, అందు మూడు చెరువులును కలవు. వీటిలో ఒకటైన వెదుళ్ళ చెరువుకు పడమటి దిశగా 15 అడుగుల వెడల్పును, 60 అడుగుల పొడవును. 36 స్తంభములును గల నుండప మొకటి కలదు. దీనిని రెడ్ల భోజనశాల యందురు. మిగిలిన రెండు చెరువులు ముత్యాలమ్మ చెరువు (కూనలమ్మ చెరువు) అనియు, పుట్టలమ్మ చెరువు అనియు పిలువబడుచున్నవి. ఇచట మామిడి తోటలు, పెక్కు రాజమందిరములు కలవు. ఈ రాజ మందిరములు శిథిలములై యున్నవి. వీటిలో ఒక దానిని మాత్రము ప్రభుత్వము వారు బాగుచేయించి ఉపయోగించుచున్నారు. పుట్టలమ్మ చెరువు గట్టుమీద రెండు దిగుడుబావులు గలవు. ఈ చెరువునకు ఈశాన్యమున ఒక శివాలయము గలదు. ఇందు 15 శాసనములును, రెండు మండపములును గలవు. ఇం దొక నేతికొట్టు కలదు. పూర్వపు రాజులు దీనిలో నేతిని నిలువ చేయుచుండిరని చెప్పుదురు. కాని ఇది మందుగుండు సామానులు దాచుకొను అయి 51