పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండపల్లీ సంగ్రహ ఆంధ్ర


సైన్యాధీశులు ఏడుగురిని చెఱపట్టి విజయనగరమునకు పంపెను. కొండపల్లి ముట్టడి మూడు మాసములు పట్టినపుడు, నీటి సౌకర్యములేక రాయల సేన కటకట పడినది. అప్పుడు మంత్రి తిమ్మరుసు ఒక దిగుడు బావిని త్రవ్విం చెను. దానిని నేటికిని నా దెళ్ళ తిమ్మరుసు బావి యను చున్నారు. ఇది ఇబ్రహీం పట్టణపు రాచబాట ప్రక్క నున్నది. శ్రీ రాయలు క్రీ. శ. 1530 లో స్వర్గస్థుడ య్యె నని చెప్పు నొక శిలాశాసన మీ రాచబాటయందే పడి యుండి పరిశోధకులకు లభించినది. రాయల యనంతరము కొండపల్లి దుర్గమును ఒరిస్సా రాజులు పాలించిరి. ఒరిస్సా రాజులనుండి గెల్చి 'కులీ కుతుబ్ షాహ' (క్రీ. శ. 1512-1548) యను గోలకొండ సుల్తాను ఈ దుర్గము నేలినట్లు కొన్ని నిదర్శనముల వలన తెలియుచున్నది. ఈ కులీ కుతుబ్షా కొండపల్లి కోటకు 'జిల్లా' యను ఉరుదు పేరు పెట్టెను. రాయలచే నాశన మొనర్చబడిన కొన్ని మందిరములను ఇతడు బాగు చేయించి కోటకు నవ్యశోభను గూర్చినాడు. సదాశివరాయలు, వేంకటపతి రాయలు విజయనగర రాజులు తిరిగి ప్రబలిరి. అచ్యుత రాయలు, కొండపల్లి నేలిరి. ఈ విజయనగర రాజుల మువ్వురి కాలములో నెప్పుడో కొండపల్లి చెరువునకు పడమరగా శివాలయ మొకటి ప్రతిష్ఠింపబడినది. అది నేడు కనరాదు. అదియే యచటి మసీదుగా మారిపోయెనని అనుమానించుటకు అవకాశము గలదు. విజయనగర ప్రభువుల తరువాత గోలకొండ సుల్తానగు ఇబ్రహిం పాదుషా కొండవీటి సర్కారుకు ఏలిక యయ్యెను. అప్పుడు కొండవీటి నగరమునకు ముర్తజా ఖానుడు, కొండపల్లి నగరమునకు ముస్తఫా ఖానుడు దుర్గపాలకు అయిరి. అందుచే కొండవీటికి ముర్తజా నగరమనియు, కొండపల్లికి 'ముస్తఫా నగర' మనియు నూతన నామకరణములు చేయబడెను. కొండపల్లి జిల్లా పాలకుడగు ముస్తఫాఖానుడు హిందువులను ఉద్యోగ ములనుండి తొలగించినాడు. వారి దేవాలయములను ధ్వంస మొనర్చినాడు. అంతే కాదు, ఆయా ప్రదేశము లలో మసీదులను కూడ నిర్మించెను. తన ప్రభువైన

ఇబ్రహీం పాదుషా పేరు చిరస్థాయి యొనర్ప నీతడు కొండపల్లికి మూడు మైళ్ళలో ఇబ్రహీం పట్టణమును గట్టించి, దానిని కలపవర్తకమునకు ముఖ్యస్థానముగా నెలకొల్పేను. ఇబ్రహీం పట్టణమను గ్రామము ఇప్పటికి నున్నది. ఈ ముస్తఫా కొండపల్లి దుర్గముపై గల యొక దేవాలయమును నాశనము చేసి "హజరాత్ గాలబుషాహ దర్గా" యను పేరుతో ఒక మసీదును కట్టించెను. అదియు నేడున్నది. గ్రామమునం దితడు 'ముసాఫిర్ ఖానా' నొక దాని నేర్పరచినాడు. అది నేటికిని ఫకీరులను మహమ్మదీయ సాధువులకు నెలవు. దీని ప్రాకారము లెత్తైనవి అది యిప్పటికిని చెక్కు చెదరకుండ నున్నది. నే డది 'సరాయిఖానా' యని వ్యవహరింపబడుచున్నది. అమీనుల్ ముల్కు, పరాస్ ఖాన్, అసరస్ ఖాన్, యక లస్ ఖాన్ (క్రీ. శ. 1590-1611) అనువారలు కొండ పల్లికి క్రమముగ జిల్లా దారులై ప్రభుత్వము నెరపిరి. వీరి కాలమున అంతగ విశేషము లున్నట్లు తెలియుట లేదు . కొండపల్లి చరిత్రలో గుంటుపల్లి ముత్తనామాత్యునకు (క్రీ. శ. 1611-1656) ప్రముఖస్థాన మున్నది. ఇతడు ఆనాడు చేయని ప్రజోపయోగ కార్యము లేదు. ము తన మంత్రి జన్మస్థలము కొండపల్లి గ్రామము. దేశపాండ్యా గిరి సంపాదించి క్రమక్రమముగ అభ్యుదయ మొంది ఈతడు గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబుషా (క్రీ. శ. 1626 1672) యొక్క అనుగ్రహమునకు పాత్రుడయి 'దూసరా (రెండవ) పాదుషా' అను ప్రసిద్ధ నామము బడసెను. ఈ దూసరా పాదుషా కొండవీడు, వినుకొండ, బెల్లం (బిలం) కొండ, కొండపల్లి దుర్గములను, వీటి క్రింద గల సీమల నన్నిటిని దక్షతతో పరిపాలించినవాడు. ఇతడు మహా మేధాశాలియు, దానవీరుడును, మహాగ్రహార దాశయు, బహు శాసన నిర్మాతయునై యుండెను. సుల్తాన్ అబుల్ హసన్ తానాషా (క్రీ.శ. 1672-1687) కొండపల్లి దుర్గమునకు పడమటి దెసగా 'గోలకొండ దర్వాజా' యను నొక మహాద్వారమును నిర్మించినాడు. ఈ ద్వారమున కొండపల్లినుండి గోలకొండకు సైనిక పటాలములు వెళ్ళుచుండెడివట! మరియు దుర్గమందలి దర్బారు భవనపు టడుగు భాగమున కొండను తొలిచి, కొండపల్లినుండి గోలకొండ దుర్గమునకు రహస్యమార్గము

50