విజ్ఞానకోశము - 3
కొండపల్లి
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు క్రీ. శ. (1509-1530) ఉదయగిరిని, కొండవీటిని జయించి(1515) కృష్ణకు నుత్తరమున నున్న కొండపల్లిపై దృష్టిని సారించెను. మూడు మాసములు రాయలు ఇబ్రహీం పట్టణము నొద్ద సేనతో విడిసి కొండపల్లి దుర్గమును ముట్టడించి, దానికి సేనాధ్యక్షుడైన రామదేవుని బంధించి యెట్ట కేలకు విజయమును సాధించెను.
చిత్రం - 6
చిత్రం 7
రాయల సేనానులు కొండపల్లి దుర్గము నీ క్రింది విధముగ ముట్టడించిరి. ఎఱ్ఱఋరుజును ఆదెప్పనాయకుడును, ఎడ్లకొండను తిమ్మప్ప నాయకుడును, హనుమంతు ఋరుజును కొండమరెడ్డియు, ఒంటి మన్యపు బురుజును కామానాయకుడును తమతమ సేనలతో చుట్టుముట్టిరి. ఇట్లు నాలుగు విభాగములైన రాయలసేనలు నలుమూలలనుండి దుర్గమును విధ్వంసము చేసినవి. గజపతివీరుల మొండెములతో, సైనిక కళేబరములతో నెమ్మల రాసులతో, పాడరిన మహలులతో, సహస్రాధిక గజాశ్వ ఖండములతో నిండి, ప్రేతభూమివలె నగపడు కొండపల్లికోటను శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ. 1516 వ సంవత్సరము జనవరి నెలలో స్వాధీన మొనర్చుకొనెను. కొండపల్లిలో బంధింపబడిన కటకేశ్వరపాత్రుని భార్యను, పుత్త్రుని, గజపతి ముఖ్య
49