పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కేశవ జగన్మోహినీ అలయము


వీథికి రెండు కొనలందును కేశవస్వామియు, కమండ లేశ్వరుడును ఎదు రెదురుగ నుండుటకు స్థలపురాణపు గాథ ఇట్లున్నది; దేవాసురులు క్షీరసముద్రమున బుట్టిన అమృ శముకొరకు కలహింపగా, విష్ణువు మోహినీ రూపము వాల్చి, రాక్షసులను కనుగప్పి, దేవతలకు అమృతము వంచెను. ఈ వార్త ఈశ్వరుడు విని, మోహినీ రూప మును తనకు జూపుమని విష్ణువును వేడ ఆతడు మోహినీ రూపమున ప్రత్యక్ష మాయెను. ఆ యతిలోక సౌందర్య మునకు మోహితుడై శివుడు మైమరచి ఆ స్త్రీని బట్ట వెంటబడెను. జగన్మోహినియు తన టక్కులచే శివుని చాల దూర మాకర్షించుకొని వచ్చెను. తుదకు శివు డలసిన రిగి, విష్ణువు తన సంపూర్ణ పురుషరూపముతో నెదు యగ నిలిచి, జగన్మోహిని రూపమును వెనుకనుంచుకొ నె నవల. శివుడు తన భ్రాంతి నెరిగి, సిగ్గిలి, ముందుకు సాగ లేక స్థాణువాయె నట. అతడు కమండలేశ్వరు డాయెనని కొందరందురు. బ్రహ్మ ఇట యజ్ఞకుండము నిల్పెననియు, అతడు తన కమండలువు నుంచినచోట ఆవిర్భవించిన శివుడు కమండలేశ్వరు డాయెననియు ఒక గాథ కలదు. ఈ గ్రామ సమీపమున వసిష్ఠానదిలో బ్రహ్మకుండ మను కాగము కలదు. అందు భక్తులు స్నానము చేయుదురు. పోయెను. ఆ నుదుటి జగన్మోహినియు నలసి 10 మండి స్వేద బిందువు రాలగా అట నొక పుష్కరిణి ఏర్పడెను. స్వేద బిందువు రాలుటచే ఏర్పడిన కొలనుగల గ్రామము గాన, రాలి యని పేరొందెనందురు. దేవా జయము వెనుక నున్న చెరువునకు చోళ సముద్రమను పేరని పెద్దలు నేటికిని చెప్పుదురు. జగన్మోహినీ విగ్రహ శిల్పసౌందర్యము వర్ణనాతీతము. వెనుక వైపునగల చక్రాకారపు జటాబంధమును, గోచి పోసి కట్టిన చీర కట్టుబడి లక్షణమును ద్రావిడ శిల్పపు తీరును దెల్పును. ఆ కాలపు ద్రావిడ శిల్ప ప్రభావము ఆంధ్ర శిల్పముపై గాఢముద్ర వేసినట్లు తోపక మానదు. పేరుగాని, శిలాశాసనముగాని దేవాలయమున కాన కావు. కాని ఈ విగ్రహమును ద్రావిడభక్తు లిట స్థాపింప పదునొకండవ శతాబ్దాంతముననో, పండ్రెండవ శతా కాదెనో గల చోళ రాజు లిట ఆలయమును కట్టించిరనుట ప్రమాణ సిద్ధము.

విగ్రహమునకు కిరీటము, మకరకుండలములు, కంఠ మాలయు, శిల్పసంపద లోప్పు కంఠపు ముడుతలును, మెడలో కౌస్తుభహారమును, యజ్ఞోపవీతమును గలవు. వక్షమును, నాభియు, నడుమునకు గల ఆభరణములును, వస్త్రమును కడు రమ్యముగా చెక్కబడినవి. చేతులలో శంఖము, చక్రము, గదయు అమరినవి. ఒక హస్తము అభయముద్రను తెల్పును. గద పట్టిన చేతి వ్రేళ్ళును, గోళ్ళును అప్రతిమాన శిల్పవై భవమును చాటును. కంకణ కేయూరములును, రత్నాంగుళీయకములును ఒప్పినవి. చక్రముపట్టిన చేయి మాత్రము ఖండితమై యున్నది. గంగ విష్ణుపాదోద్భవయని తెల్పుట కీ విగ్రహపు పాదము తడిగా నున్నట్లుతోచి నిరంతరము నీరూరుచున్నట్లు శిల్ప ముతో నొప్పును. ఇది ఈ విగ్రహ మహిమ యందురు. పాదపీఠముకడ గరుడాళ్వారును, ప్రహ్లాద, నారద, పరా శరాది పరమ భాగవతో త్తముల రూపములును చెక్క బడినవి. కాళ్ళ కిరుప్రక్కలను శ్రీ దేవియు, భూదేవియు, రుక్మిణీ సత్యభామలును చిత్రరూపమున నున్నారు.స్వామికి ఉభయ పార్శ్వములను కేశవస్వామి విగ్రహములతో ఆలయ రూపము చెక్కబడినది. ప్రక్కలనుండి మీదికి పొన్న చెట్టును, దానిమీద గోవర్ధన పర్వతమెత్తిన విష్ణు వును, ఆ మీద ఏనుగు, రేచుక సింహములు జ జాతి వై రము విడచియున్న రూపములును గలవు. మీది వై పున ఎడమ ' నుండి కుడికి దశావతారములును, తుంబురు నారద భ క్తులును, కిన్నెర కింపురుషులును, రాక్షససంహారమును సూచించు కీర్తిముఖములును, రంభోర్వసులును, పడగ లతోడి శేషుడును కనిపించును. వెనుక మోహినీ ప్రక్క రూపమున కేశములను తెల్పు గీతలు కలిగి, నడుమ చేమంతి రూపముకల గుండ్రని జటాబంధము సొంపు లోలుకును. చేతుల దండతాయెత్తులును, పట్టీలును, గోచి పోసిన చీర కట్టుబడియు, పాదముల అందెలు, గజ్జెలును శ్రీవ పొందుపరుపబడినవి. పద్మినీజాతి స్త్రీ లక్షణమగు త్సము'అను మచ్చ కుడిపిక్కమీద కడు సహజముగగన్పట్టు నట్లు చెక్కబడినది. ఇంతటి శిల్ప మీ యైదడుగుల యెత్తు విగ్రహమున ముందు వెనుకల చెక్కబడి యుండుట చూచి ముద్దులు కానివారును, శిల్పిని మనమున స్తుతింపని వారును ఉండరు.

45