పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3


చిత్రము - 4.

కేశవ జగన్మోహినీ ఆలయము

చిత్రము - 5.

వారిటకు వేంచేసి స్థిరనివాసి యగుటయు, చోళ దేశమునుండి ద్రావిడ బ్రాహ్మణ కుటుంబ ములు స్వామి వారి విగ్రహ ముతోపాటు ఇచ్చటికి వచ్చు టయు మొదలగు చారిత్ర కాంశ ములీ స్థలమునకు అఖండఖ్యాతి గూర్చినవి. విగ్రహము ఎదుటి భాగమున కేశవస్వామి రూప మును, వెనుక ప్రక్కను జగన్మో హినీ రూపమును జూపు ఈపాల రాతి విగ్రహమునందలి శిల్పము యావద్భారత దేశమునను అపు రూపమై, మహా శిల్పులకును, రాజ్యాధిపతులకును గూడ దిగ్భ్రామ గొల్పునంతటి కళా చాతుర్యముతో వెలసియున్నది. ద్రావిడ బ్రాహ్మణులు మొదట ఈ గ్రామమున నిలిచి పిమ్మట పేరూరు (పెద్ద ఊరు) నకు పోయిరి. ఈగ్రామ మధ్యమున తూర్పు పడమరలుగా వ్యాపించియున్న 43