Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కేరళదేశము (చరిత్ర)

మందును అదే కార్యక్రమముపై పర్యటన మొనర్చుచు. క్రీ. శ. 72 వ సం॥లో నిహతుడయ్యెను.

పిమ్మట దక్షిణ భారతము నందలి క్రైస్తవులు పెక్కు కష్టములకు లోనైరి. తూర్పుతీర ప్రాంతమందలి క్రైస్తవులలోను పెక్కురు పెక్కు బాధలకు గురియై తిరిగి హిందూమత ప్రవిష్టు లయిరి. ఇతరులు కేరళమునకు ప్రయాణించిరి.

క్రీ. శ. 9 వ శతాబ్దిలో క్రైస్తవ వ్యాపారస్థుడగు 'బార్ యే' అను నాతని నాయకత్వమున ఒక క్రైస్తవ బృందము పర్షియానుండి బయలుదేరి క్విలన్ నగరము చేరెను. 50 సంవత్సరముల అనంతరము 'మార్ సాబార్ "మార్ ప్రాత్ ' అను సిరియన్ బిషప్పులు గూడ క్విలన్‌కు వచ్చిరి. సాబార్ అనునతడు కొడుంగల్లూరునందు కేంద్రమును స్థాపించుకొని, ఉదయం పెరూర్ అను రాజును, అతని ప్రజలను, క్రైస్తవులనుగా మార్చెను. ఇట్లెందరో హైందవ ప్రభువులు క్రైస్తవ మతావలంబకులుగా జేయబడిరి.

మధ్యయుగములనాటి కేరళ క్రైస్తవుల చరిత్రను గూర్చిన సత్యవిషయములు విశేషముగా దెలియుటలేదు. కేరళములో అనంతరకాలమున క్రైస్తవప్రచార మొనర్చిన వివిధ విజాతీయ క్రైస్తవ మిషనరీల నడుమ స్పర్థలు చెలరేగినట్లు చరిత్ర వలన విదితమగుచున్నది. వాస్కోడిగామా క్రీ. శ. 1498 సం.లో కోఝికోడ్‌నకు వచ్చి 1502 లో కేరళ క్రైస్తవులతో సంబంధమేర్పరచుకొనెను. పిమ్మట 1504 లో బాబిలోన్ మత గురువుచే ఆదేశింపబడిన నలుగురు బిషప్పులుగూడ క్రైస్తవమత ప్రచారమునకై కేరళమున కేగిరి. ఇట్లెందరో విదేశీయ క్రైస్తవ మత ప్రచారకులు (పోర్చుగీసు, పర్షియన్, బాబిలోన్, సిరియన్) కేరళమునందు స్థావరము లేర్పరచుకొని విభిన్నములైన స్వీయ మతప్రచార విధానములను చురుకుగా కొనసాగించుకొనుచు వచ్చిరి. పరస్పర విరుద్ధములైన ఈ క్రైస్తవమత ప్రచారవిధానముల మూలమున కేరళ క్రైస్తవుల యొక్క సాంస్కృతిక, సామాజిక జీవితములందు తీవ్రమయిన మార్పులు ఘటిల్లెను.

భారతదేశములో బ్రిటిషువారి రాజకీయ ప్రాభవము ఆరంభమగుటతో జాకోబైట్ క్రైస్తవ వర్గము ప్రొటెస్టెంటు శాఖగను, మార్ థామస్ సిరియన్ శాఖగను విభక్తమయ్యెను. ఇటలీనుండి వచ్చిన క్రైస్తవ మతాధికారి జాకోబైట్ వర్గములో ఉత్పన్నమయిన చీలికలను గూర్చి విచారణ జరిపెను. కాని తన్మూలమున ఐక్యము చేకూరుటకు మారుగా పృథక్త్వమే పూర్వముకంటె అధికతరమయ్యెను. 1663 లో కొచ్చిన్ రేవు డచ్చివారి స్వాధీనమయ్యెను. అపుడు డచ్చివారు మినహా తక్కిన విజాతీయు లందరును కేరళమును విడిచి వెళ్ళవలయునని డచ్చి గవర్నరు శాసించెను. పోర్చుగీసువారు విరోధ భావమును ప్రకటించియుండనిచో జాకోబైట్ చర్చి కాథొలిక్ వర్గములో లీనమైయుండెడిదని పెక్కురి అభిప్రాయము. పూర్వము విజాతీయ క్రైస్తవమత గురువులచే అధిష్ఠింపబడిన వేర్వేరు శాఖల విదేశీయ క్రైస్తవ సంస్థలయందు కొంత కాలమునుండి కేరళ జాతీయ క్రైస్తవ ప్రముఖులే నాయకత్వము వహించుచున్నారు.

కేరళ ముస్లిములు : ఇస్లాంమత స్థాపనకంటె పూర్వమే అరబ్బులు కేరళతో వ్యాపార సంబంధములు కలిగి యున్నట్లు చారిత్ర కాధారములు కలవు. కేరళయందలి మిరియాలు, ఏలకులు మున్నగు సరకులను అరబ్బులు వివిధ దేశములకు ఎగుమతి చేయుచుండెడివారు. 'అల్ ఫిల్ ఫిల్' (మిరియాల దేశము) అను పేరు కేరళకు అరబ్బుదేశములో ప్రసిద్ధమై యుండినదట. సాధారణముగా క్రీ. శ. తొమ్మిదవ శతాబ్దములో ఇస్లాం మతము కేరళలో ప్రసారితమైనదని చారిత్రకులు వ్రాయుదురు. కాని, అరబ్బుల చారిత్ర కాధారముల వలన ఇస్లాం మత్రప్రవక్త తన జీవితకాలములోనే మత ప్రసారమునకై పరిసర దేశములకు కొందరు ముఖ్యాను యాయులను పంపించె నని తెలియుచున్నది. ప్రాచీన మయిన ఒక ఐతిహ్యము ప్రకారము లంకలో నొక గుట్టపై ప్రథమ మానవుని (ఆదం) యొక్క పాదముద్ర కలదనియు, కొందరు యాత్రికులు అరబ్బుదేశము నుండి బయలుదేరి మార్గమున 'కొడుంగల్లూర'ను కరళ తీరమున నిలిచిరనియు, అక్కడ వారిని కేరళ చక్రవర్తి పెరుమాళ్ సగౌరముగా బహూకరించెననియు, వారి క్రొత్తమతముచే ప్రభావితుడై తిరుగు ప్రయాణమునందు వారితోపాటు మక్కాకు వెళ్ళి అక్కడనే జబ్బుచేసి దివం

35