కేరళదేశము - (చరిత్ర)
సంగ్రహ ఆంధ్ర
భర్తను విడనాడవలసినపు డా వస్త్రమును తిరిగి యందించి విడిపోవుట ఆచారముగా నుండినదట! ఇపు డది యరుదు. కాని వివాహమున జరుగు తంతుమాత్ర మంతియే. ఈ మధ్యకాలమున పూలహారములు వేయుట, మాంగల్యధారణము చేయుట నూతనముగా కలవారి కలవాటయినది. దీనివలన వివాహపద్ధతి వైదిక సంస్కారము కాదనియు, కేవల గాంధర్వ వివాహపద్దతి యనియు, రిజిష్టర్డు వివాహముకంటె సులభమైన దనియు స్పష్ట మగు చున్నది.
వర్ణాశ్రమధర్మముల కనుబంధముగా నేర్పడిన కులవిభేదముల కరకుదనము కేరళ కొక ప్రత్యేకత నాపాదించు చున్నది. భారతదేశమం దంతటను కులతత్త్వ పద్ధతులు వ్యాప్తమై యుండినను, అవర్ణు అంటరానివా రగుటయే గాక, వారికి సవర్ణు లుపయోగించు రహదారులపై నిరాటంకముగా నడచుట కవకాశము లేదు. అట్లు నడచుట అవసరమైనచో వారు సవర్ణులకు దూరముగా నడచు చుండి “ మే మవర్ణులము సమీపించుచున్నాము. తొలగి పొండు" అని సూచించు నినాదములనో, లేక సైగలనో చేయవలసి వచ్చుచుండెనట! అస్పృశ్యత (untouchbility) యే గాక అసామీప్యత (un-approachability) యును అమలులో నుండెడిదట ! ఆ కారణము చేతనే కేరళము భారతదేశము నందలి ఒక "ఉన్మత్తాలయము" (mad-house) అని స్వామి వివేకానందునిచే విమర్శింపబడినది. తిరువాన్కూరు రాష్ట్రములో ఈ కట్టుదిట్టములన్నియు శాసనము ద్వారమున 25 సంవత్సరములక్రింద రద్దుచేయ బడినవి. దేవాలయ ప్రవేశాధికారముతో పాటు అన్ని మానవహక్కులు సమానముగా నొసగబడినవి.పిదప విప్లవాత్మకమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు జరిగినవి.
తిరువాన్కూరు మహారాజావారి అనుశాసనమున కనువగు వాతావరణము కలిగించి అస్పృశ్యతా నివారణమును ఆచరణలోనికి తెచ్చినది శ్రీ నారాయణ గురువుగారి సంఘ సంస్కారపరమైన ఆందోళన. శ్రీ గురువుగారు అస్పృశ్యజాతి యనబడు “ఇఝవా” కులమునకు చెందినవారు: ఒకే దైవము, ఒకే జాతి, ఒకే మతము అను నొక ముద్రావాక్యముతో గొప్ప మతసంచలనము గావించి ఈ అవర్ణులగు వెనుకబడిన జాతుల వారియందే గాక, సవర్ణులందును మహత్తరమైన సంచలనమును గలిగించిరి. తత్పరిణామముగా ఈ కుల, మత వివక్షతలన్నియు రానురాను అంతరించినవి.
క్రైస్తవులు : కేరళ రాష్ట్రములో క్రీ. శ. ఒకటవ శతాబ్దియందు సెయింట్ థామస్ అను మతగురువుచే క్రైస్తవమతము ప్రవేశ పెట్టబడినది. ఇతడు క్రీ. శ. 52 వ సంవత్సరమున కేరళమునకు వచ్చి పెక్కు నంబూద్రి కుటుంబములను, ఇతర హైందవ కులములను క్రైస్తవ మతములో కలిపివేసెను. కేరళ క్రైస్తవులు ఇప్పటికిని సెయింట్ థామసును అత్యంత గౌరవమర్యాదలతో చూచెదరు. ఇతడు కేరళములో ఏడు క్రైస్తవ దేవాలయములను స్థాపించెను. అనంతరం మితడు కోరమాండల్ రేవు ప్రాంతమునకు పయనమయి అచ్చటగూడ తన మతవ్యాప్తి కార్యక్రమమును కొనసాగించెను. ఈ ఉదంత మిట్లుండ కేరళమునందు 4 వ, 5 వ శతాబ్దములలో మాత్రమే క్రైస్తవ మతము ప్రవేశ పెట్టబడె నను జనశ్రుతి గూడ గలదు.
ఈనాటికిని సిరియన్ క్రైస్తవ వర్గములో పెక్కు బ్రాహ్మణ సంప్రదాయములు, ఆచార వ్యవహారములు ఆచరణ మందున్నవి. పాలయూరు అను గ్రామములో అనేక సిరియన్ క్రైస్తవ కుటుంబముల ఆవరణములలోను, బావులయందును, పూర్వము బ్రాహ్మణులచే ఉపయోగింపబడిన కంచుభూషణములును, ఇత్తడి పాత్రలును ఈనాటికిని లభింపగలవు.
సెయింట్ థామస్‌చే కేరళములో క్రైస్తవులుగా మార్చబడిన వారందరును థామస్ క్రైస్తవులమని చెప్పుకొనుచుందురు. వీరందరును కోడుంగల్లూరు, పాలయూరు, పారూరు, కోకమంగలమ్, క్విలన్, నిరానం, చాయల్, (నిలక్కల్) అను కేంద్రములకు చెందినవారే. కొడంగల్లూరునందు సెయింట్ థామస్ ప్రప్రథమముగా, 'చేరమన్ పెరుమాల్'ను, అతని కుటుంబమును, నలుబది యూదుకుటుంబములను, నాలుగువందల హైందవకుటుంబములను, క్రైస్తవ మతమున ప్రవేశపెట్టినట్లు తెలియుచున్నది. కేరళమున క్రైస్తవ మతమును వ్యాప్తిగావించిన పిదప సెయింట్ థామస్, తూర్పు సముద్ర ప్రాంత
34