పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేరళదేశము (చరిత్ర) సంగ్రహ ఆంధ్ర


యొక పక్షము వహించుటయు, ఇంతలో ఇతర పాశ్చా త్యులు మలబార్ రంగములో ప్రవేశించుటయు, మైసూరు సుల్తానులు కొన్ని మలబారు రాజ్యములను గెల్చుటయు వెను వెంట నే ర క్తపాతముతో యుద్ధములు చెలరేగుటయు వాటి ఫలితముగ చిన్నచిన్న రాజ్యములలో ఒకటి వెంట నొకటి అంతరించుటయు, సంభవించెను. 1792 వ సంవత్స రములో బ్రిటిషువారి సాయమును పొందిన తిరువానూరు సంస్థాన సైన్యములను టిప్పుసుల్తాను ఎదుర్కొనవలసిన వాడయ్యెను. అనంతరము జరిగిన ఒడంబడిక ప్రకారము టిప్పుసుల్తాను మలబారు ప్రాంతమును బ్రిటిషు వారి కప్ప గించెను. జామోరిన్ కుటుంబమువారు కౌలువత్రముల క్రింద భూములపై తమ పెత్తనమును, అనుభవించుచు వచ్చిరి. అనంతరము ఇతర రాజులతోపాటు జామోరిన్ అను నాతనికిగూడ శాశ్వతమయిన పెన్షను మంజూరు. చేయబడినది. క్రీ. 1792వ సంవత్సరము నుండి కేరళములో బ్రిటిషు అధికారము ప్రారంభమయ్యెను. కేరళ చరిత్రము విదే శీయ పాలకులను ప్రతిఘటించిన వీరోచితమయిన గాథగా ప్రస్తుతి గడించినది. ఈ విధముగా కేరళ దేశము చేరరాజుల ఆధిపత్యమున ఏక పరిపాలనాబద్ధమై పెక్కు శతాబ్దముల కాలము విల సిల్లెను. తరువాత కాలప్రభావమున చారిత్రకముగ పెక్కు మార్పులకు అది గురి యయ్యెను. కేరళరాజ్య విస్తీ ర్ణము హెచ్చుచు, తగ్గుచు వచ్చెను. ప్రతిభాశాలియైన చేర మాన్ పెరుమాళ్ అను కడపటి రాజు తరువాత అది మరి కొంత విభజనకు పాలయ్యెను. ఇటీవలి చరిత్రకాలములో పైన నుడివిన ప్రకారము కేరళము మూడు ప్రత్యేక రాష్ట్రములుగు రూపొందెను. భారతీయ రాష్ట్రముల పునర్నిర్మాణ సందర్భమున 1956 సంవత్సరము 1 వ తేదీ నవంబరునాడు భాషా మూలక ముగను, సాంస్కృతిక ము గను ఏకసూత్ర బద్ధముగా వెలయుటకు కేరళ రాష్ట్రము నిర్మాణమాయెను. ఇట్లు చిరకాలాగతముగా నుండిన మలయాళీల వాంఛ ఫలించినది.

ఆచార వ్యవహారములు : కేరళీయులు తమిళులకంటే తెలు పైన చామనచాయ గలిగి అవయవ సౌష్ఠవముతో నొప్పారుచు శుభ్రమైన దుస్తులను ధరించి నిరాడంబరము

పరిశుభ్రము అగుజీవనమునకు అలవడినవారు. స్త్రీపురుషు లందరు ప్రాయశః తెల్లని వస్త్రములను ధరింతురు. ప్రతి దినము కాకపోయినను వారములో తరచుగా శిర స్స్నానము చేయనివారుండరు, తైలాభ్యంగనము స్త్రీ పురుషులకుకూడా నిత్యమగు దేశాచారము. కేరళీయ స్త్రీల వ్రేలాడు శిరోజములు సుప్రసిద్ధములని రఘువంశ శ్లోక మొకటి చాటుచున్నది. మళయాళ స్త్రీలు బట్టకట్టు విధము ఆయా జాతులనుబట్టి మారుచుండును. నాయరు స్త్రీలు తెల్లని 'పుడువ' నౌక (రవిక), ఉత్తరీయము ధరించువారు. క్రైస్తవ స్త్రీలు 'వుడువ' ను నడుము పై చిన్న కుచ్చులు వ్రేలాడునట్లు ధరించెదరు. తిలకము లేక ' పోవుటయు, ఈ కుచ్చులను ధరించుటయు, వారు హిందు వులు కారనుటకు చిహ్నములు. ముస్లిం స్త్రీలు (మల బారు మోప్లాలు) రంగుల దుస్తులు ధరింతురు. కాని తలపై ముసుగు గుడ్డలను వేసికొనెదరు. పురుషులు ముండు అను పంచెను ధరింతురు. షర్టును వేసికొందురు. తలగుడ్డ ప్రసక్తిలేదు. ఈ పద్ధతులు గత నాలుగైదు దశాబ్దములనుండి మారిపోయినవి. నేడు ఇతర భారత స్త్రీలవలె రంగుల చీరలు, రవికలు సాధారణముగా నాగరికులలో దినదిన ప్రచార మొందుచున్నవి. పురుషు లలో ఆంగ్లేయ పద్దతి కోటు పంట్లాము ధరించుట కాళీయులందరును, వ్యాప్తి నొందుచున్నది. కనీసము పురుషులందరు ఒకేమాదిరి దుస్తులు ధరించుట ఒకే భాషను మాట్లాడుచుండుట వలనను, కొన్ని ఇతర ప్రాంతములందువలె వారి జాతిమత భేదము అంతగా బాహ్యదృష్టికి గోచరముకాదు. తిలక ముధరించుట హైందవులగు పురుషులలో అరుదైపోయినందున ఈ భేదము మరింత కానరాని దని చెప్పవచ్చును. స్త్రీలు పూర్వకాలమందు చెవులు, ముక్కులు, కంఠము, తల, కాళ్లు, చేతులు, నడుము మున్నగు సర్వావయవములకు బరువగు రకరకాల ఆభరణములను ధరించువారే కాని ఇపుడా యభ్యాసము సన్నగిల్లి ఇతరప్రాంతములందు వలెనే వారును ఆధునిక నాగరిక స్త్రీలవలెనే మెలగు వలనను, చుందురు.

కేరళముయొక్క ప్రత్యేక దేశాచారములలో "మరు మక్క తాయమ్" మరియు సంయుక్త కుటుంబపద్ధతులు 32