విజ్ఞానకోశము - 3
కేంద్రకిరణ శాస్త్రము
(Radiation) మూడు ముఖ్యలక్షణములు కలిగియుండునని కనుగొనబడెను. (1) పదార్థముగుండ చొచ్చుకొని పోవుట (2) ఫొటోగ్రాఫిక్ ప్లేటునందు మార్పు కలిగి యుండుట, (3) వాయుపదార్థమును అయనీకరించుట (ionize). విస్పష్టమైన మూడు కిరణప్రసారణ భేదములు త్వరలోనే కనుగొనబడినవి. వీటిలో ఒకటి అతి మృదువైనది; పదార్థములో సులభముగా ఇమడగల్గినది; అయనీకరణమును మిక్కుటముగా ఉత్పత్తి చేయగలిగినది. దీనినే a కిరణమందురు. రెండవవర్గము మరింత చొచ్చుకొనిపోవు లక్షణములు కలదిగాను, తక్కువ అయనీకరణము కలదిగాను ఉండును. దీనిని B (బీటా) కిరణమందురు. మూడవతరగతి మరింతగా దూసుకొని పోవు శక్తికలదై ౪ (గామా) కిరణమని పిలువబడుచున్నది. క్యూరీ ఈ మూడు విధములగు వికిరణములను ఒక అయస్కాంత క్షేత్రముగుండా ప్రసరించునట్లు ఒక ప్రయోగమును సలిపెను. క్యూరీ జరిపిన సామాన్యమైన ఆ ప్రయోగమువలన a, B కిరణమార్గములు ఒక దానికి మరొకటి వ్యతిరేకదిశలో అతిక్రమణము (deflection) పొందునని స్పష్టముగా రుజువయ్యెను. ౪ (గామా) కిరణములువక్రమార్గమున గాక సరియైనమార్గముననే ప్రయాణముచేయుననిగూడ స్పష్టమయ్యెను. a కిరణములు ప్రసరించు మార్గము కన్న B కిరణములు ప్రయాణము చేయు మార్గము మిక్కిలి పంపుగలదై ఉండును. దీనివలన a కిరణములు B కిరణములకన్న చాల బరువై నవనియు, ధన విద్యుత్పూరము గల అణువులు గలినవై యున్నవనియు తేలుచున్నది. కాగా B కిరణములు తేలిక యై ఋణవిద్యుత్పూరణము గలవియై యుండును. ౪ (గామా) కిరణములలో ఎట్టివిద్యుత్పూరణముఉండదు. ఈ ఫలితముల ననుసరించి a కిరణముఉదజనికంటె నాలుగురెట్లుద్రవ్యరాశిగల హిలియమ్ అను మూలకముయొక్క పరమాణువులోని కేంద్రకము (nucleus) అని ప్రతిపాదింపబడెను. హిలియమ్ మూలకముయొక్క పరమాణు సంఖ్య 2 (అనగాదీని కేంద్రములోని ధనవిద్యుత్పూరణము 2 పరిమాణములు (units) కలదని అర్థము). B కణము 1 పరిమాణముగల ఋణ విద్యుత్పూరణమున, ఉదజని పరమాణు ద్రవ్యరాశిలో 1/1840 వ వంతు ద్రవ్యరాశియుగల ఒక వేగవంతమగు విద్యుత్కణమనికూడ ప్రతిపాదింపబడెను. ౪ (గామా) కిరణములు మిక్కిలి కఠినమగు 'ఎకు కిరణములు'.
రేడియో ధార్మిక ప్రసరణ సూత్రములు : ఎట్టి రేడియో ధార్మిక ప్రసరణ పరివర్తనమందైనను కేంద్రకమునుండి ఒక a కణముగాని, ఒక B కణముగాని ఉద్భిన్నమై వెడలును. కాని రెండు కణములును ఏక కాలమందు బయలు వెడలవు. a కణము ఉద్గమించినపుడు వేరొక నూతన పరమాణువు రూపొందును. మూల పరమాణువు కంటె ఆ నూతన పరమాణువు యొక్క ద్రవ్యభారసంఖ్య (mass number) నాలుగు పరిమాణములు (యూనిట్లు), పరమాణుసంఖ్య (atomic numbers) రెండు పరిమాణములు తగ్గుట జరుగును. ఒక B కణము స్పష్టమైనపుడు ఏర్పడు నూతన పరమాణువుయొక్క ద్రవ్యరాశి మూల పరిమాణ ద్రవ్యరాశితో సమానముగనే ఉండును. కాని దాని పరమాణుసంఖ్య 1 పరిమాణము హెచ్చును. పరమాణుసంఖ్య (Atomic number) అనగా, పరమాణు కేంద్రకము (nucleus)లో నుండు మొత్తము ధనవిద్యుత్పూరణమునకు సమానము; లేక ఒక తటస్థ పరమాణువు యొక్క పరిభ్రమణ విద్యుత్కణముల (Planetary electrons) సంఖ్యకు సమానము; లేక ఆవర్తన పట్టిక (Periodic table)లో నుండు ఆ మూలకము యొక్క క్రమసంఖ్య.
82, అంతకంటె ఎక్కువ పరమాణువుల సంఖ్యగల అన్ని మూలకములు అస్థిరమగు స్థితిని గలిగి a లేక B కణములను వెడల గ్రక్కుచు తమకంటె తక్కువ మూలకములకు చెందిన పరమాణువులుగా విచ్ఛిత్తి నొందు చుండును.
ఈ పరివర్తనములు (transformations) క్రమముగా జరుగుచు, రేడియో ధార్మిక శ్రేణి (Radio active series) గా రూపొందును. మూడు ముఖ్యమగు అట్టి శ్రేణులు కలవు. అవి 1. యూ రేనియమ్- రేడియమ్ శ్రేణి; 2. ఆక్షినంశ్రేణి; 3. థోరియంశ్రేణి అనునవి. ఈ శ్రేణులు ఆయా మూల మూలకము (Parent elements)లను బట్టి పిలువబడుచు ప్రతిశ్రేణియు సీసముగానో లేక దాని సస్థానికము (isotope) గానో అంతమగును,
21