పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కేంద్రకణ భౌతికశాస్త్రము

లోను, రూపాంతరములలోను న్యూట్రాను యొక్క పాత్ర అతి ముఖ్యమైనది. పోజిట్రాన్ (Positron) : పోజిట్రాను (e+) ఎలక్ట్రాను (e-) కు ప్రతి నకలు (counterpart). దీని ఆవేశము ఎలక్ట్రాను ఆవేశమునకు సమానము, కాని దీనిది ధనా వేశము. దీని ద్రవ్యరాశికూడ ఎలక్ట్రాను ద్రవ్యరాశికి సమానము. దీనిని కాస్మిక్ కిరణప్రయోగ సందర్భము లలో 1932లో ఆండర్ సన్, నెడ్డర్ మేయరులు కనుగొనిరి. కాని దీని ఉనికిని సిద్ధాంత రీత్యా 1930 లో డిరాక్ అను నాతడు ప్రతిపాదించెను. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూ ట్రాను, పోజిట్రానులవంటి కణములచే విశ్వములోని ద్రవ్యమంతయు చేయబడినది. నేడు మనకు తెలిసినంత వరకు వాటి నిర్మాణము చాల సులభమైనది. కాన వాటిని 'మూలాణువులు' (elementary particles) అందురు. ఒక వేళ వాటి నిర్మాణము క్లిష్టమైనదని చూపెట్టబడినను, అవి ఎంతమాత్రము మూలాణువులుగా నుండజాలవు. కాస్మిక్ కిరణజన్యములగు కణములలో మరికొన్ని మూలా ణువులు కనుగొనబడెను. ౨ తగినంత శక్తిగల గామా కిరణములు ద్రవ్యముగా మారునపుడు (materialized), ఎలక్ట్రానులు, ప్రోటి ట్రానులు జంటలుగా పుట్టును. ఈ పుట్టుక పరమాణు బీజమువద్ద దాని ప్రాబల్యముతో జరుగును. ఒక ఎలక్ట్రాను ద్రవ్యసంచయము శక్తి రూపములో ఐదులక్షల ఎలక్ట్రాను ఓల్టులకు సమానము. ఒక ఎలక్ట్రాను ఒక వోల్టు శక్తి (Potential) భేదములో నుంచి పడునపుడు పొందు శక్తిని 'ఎలక్ట్రాను ఓల్టు' (electron volt) అందురు. అందుచే ఒక ఎలక్ట్రాను జంట సృష్టికి, 'గామా క్వాంటం' కనీసం పదిలక్షల ఎలక్ట్రాను వోల్టుల శక్తిగలిగి యుండవలెను. ప్రోజిట్రానుకు స్వతంత్రపుటునికి లేదు. అది ఎప్పుడు ఎలక్ట్రానుల వద్దకు వచ్చునో, అప్పుడే రెండును కలిసి నాశనమైన (annihilate), రెండుగామాల సృష్టికి తోడ్పడును. ఇట్టి నాశనధర్మము కలిగియుండుటచే పోజి ట్రానును ఎలక్ట్రాను యొక్క 'వ్యతిరేకాణువు' (anti- particle) అని అందురు. కాస్మిక్ కిరణములు : భూమ్యుపరితలమంతయు అన్ని వేళలయందు బయటి


నుండి వచ్చు కాస్మిక్ కిరణములచే ఘట్టింపబడుచున్నది. ఈ వికిరణ (radiation) తీర్ణత ఒకేచోట ఎల్లప్పుడును ఇంచుమించు సమముగా నుండును. ఇది ఏ స్థలమం దైనను ఔన్నత్యము (altitude) ను బట్టి హెచ్చును. ఇది ధ్రువములవద్ద గరిష్ఠముగను, భూమధ్య రేఖవద్ద కనిష్ఠ ముగ నుండును. ఈ అణువులన్నియు ఆవేశపూరితములే. బయటినుండి భూ వాతావరణములోనికి ప్రవేశించు కాస్మిక కిరణములను' ప్రధాన కాస్మిక్ కిరణము'లందురు. ఈ ప్రధానములలో (primaries) ఎక్కువగ ప్రోటాను లును (77%), తరువాత ఆల్ఫాకణములును (21%). మిగిలి నవి బరువైన మూలద్రవ్యములగు ఆవేశ బీజములు నై యున్నవి. కాస్మిక్ కిరణములయొక్క రెండు ముఖ్యలక్షణ ములు : 1. హెచ్చుగా చొచ్చుకొను సామర్థ్యము; 2. బ్రహ్మాండమైన శక్తి . భూమ్యుపరితలముమీది వికిరణము - సజాతీయము కాదు. దానిలో రెండురకములు గలవు. ఒకటి తేలికగా లీనమగును. దీనిని 'మృదుభాగము' (soft component) అందురు. దీనిలో ముఖ్యముగా ఎలక్ట్రానులు, పోజిట్రా నులు, తేజః కణములు (photons) అనునవి; రెండవ భాగమును 'దృఢభాగము' (hard component) అందురు. దీనిలో ప్రధానముగ మెజానులే ఉండును. అయనీకరణము వలన నేగాక, ఎలక్ట్రానులు వికిరణ (radioactive) నష్టములవలన కూడ శక్తిని పోగొట్టు కొనును. అతిథి క్తిమంతమగు ఒక ఎలక్ట్రాను బరువైన బీజమువద్దనుండి పోవునపుడు దాని వేగము ఆకస్మిక ముగ తగ్గి, కొంతశ క్తి 'గామా 'కణరూపముగ పోగొట్టుకొనును. ఈ పద్ధతిని 'బ్రెమ్స్హలంగ్' (Bremsstrahlung) అందురు. ఈ గామాకణము తిరిగి ఒక ఎలక్ట్రాను జంటగా మారును. శక్తి ఉన్నంతవరకు ఈ విధానము సాగును. ఈ విధానమునే 'నిరర పద్దతి' (cascade process) అందురు. ఈ విధానములో తరువాత పుట్టు అణువులు మొదటివాటి దిక్కులనే సాధ్యమైనంత సన్ని హితముగా అనుకరించును. అతి త్వరితముగనే ఒక పెద్ద అణు సముదాయము ఉద్భవించును. దీనినే 'కాస్మిక్ కిరణ జల్లు' (cosmic ray shower) అందురు. ఒక్కొక్క 15