పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేంద్రకణ భౌతికశాస్త్రము సంగ్రహ ఆంధ్ర


శ క్తి భేదమునుబట్టి ఈ వికిరణము (radiation) పరా రుణము (infrared) గా గాని, దృగ్గోచరము (Visible- light) గా గాని, అత్యంత ఊదాగా (ultra-violet)గాని, ఎక్స్-కిరణములుగా గాని బయలు వెడలును (emit). రేడియో వీటిస్వభావము విద్యుదయస్కాంతికము. తరంగములును, గామా కిరణములును ఈ జాతిలోనివే. పరమాణుబీజముల ద్రవ్యరాశి : పరమాణుబీజముల రెండు ముఖ్యధర్మములలో నొకటి యగు బీజావేళ పరిమాణము ఆ పరమాణువు అంకమునకు సమానము. రెండవది బీజ 'ద్రవ్యరాశి' (mass); ఇది ఇంచుమించు మొత్తము పరమాణువు ద్రవ్యరాశికి సమానము. విడి ఎలక్ట్రాను ద్రవ్యరాశియు, ఒక పరమా ణువులోని ఎలక్ట్రానుల సంఖ్యయు తెలియును గాన, పర మాణువుద్రవ్యరాశియు తెలిసినచో, బీజద్రవ్య రాశినిగూడ తెలియును. పరమాణు ద్రవ్యరాశిని తెలిసికొనుటకు థామ్సన్ ‘ద్రవ్యరాశి వర్ణమాలా లేఖిని' (mass spectrograph) అను పరికరమును ఉపయోగించెను. దీనితో విద్యుదయ స్కాంతిక పద్ధతిని, 'ఆదేశద్రవ్య, సంచయ నిష్పత్తి' ని (ratio of e/m) కనుగొనవచ్చును. థామ్సన్, ఆస్టన్ల పరిశోధనల ఫలితముగా రేడియో ఆక్టివ్ మూల ద్రవ్య ములేకాక, స్థిరమూల ద్రవ్యములుగూడ సమస్థానీయము (isotope) లను కలిగియుండునని తెలిసెను. (ఒకే పర మాణు అంక ముకలిగి, వివిధ ద్రవ్యరాశి పరిమాణములు కలిగిన మూలద్రవ్యములను సమస్థానీయములందురు. వీటి రాసాయనిక ధర్మము లన్నియు నొక్కటే.) అన్నిటికంటే చిన్నదైన ఉదజని బీజమును ప్రోటాను అందురు. మిగిలిన పరమాణు బీజములు ప్రోటానుల సము దాయమని భావింపబడెను. పైగా, పరమాణు బీజము లన్నిటియందును ప్రోటానులతోపాటు, ఎలక్ట్రానులు గూడ నుండునని సూచింపబడెను. బీజబంధన శక్తి (Binding Energy of Nuclei) : పై సూచన ప్రకారము హిలియం పరమాణువులో నాలుగు ప్రోటానులు, నాలుగు ఎలక్ట్రానులు (రెండు బీజములోను, రెండు బీజము బయట) ఉండుటవలన, హిలియం ద్రవ్యభారము ఉదజని ద్రవ్యభారముకంటె

నాలుగు రెట్లు హెచ్చుగానుండవలెను. కాని హిలియం ద్రవ్యభారము (4.00888) నాల్గు రెట్లు ఉదజని ద్రవ్య భారము (4.03252) కంటే తక్కువ. హిలియం బీజ మేర్పడునపుడు, కొంతశక్తి విడుదల యగుననియు, ఈ శక్తి పై ద్రవ్యరాసుల భేదమునకు సమానమగుననియు విశదీకరింపబడెను. ఈ ప్రక్రియలో ఎంత ఎక్కువ శక్తి విడుదలయగునో, ఆ ప్రక్రియ తరువాత నేర్పడిన పరమా ణువు అంత స్థిరముగానుండును. ఆకాలమున తన విశేష సాపేక్షక సిద్ధాంతము (Special Theory of Relativity) నుండి ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్ర విజ్ఞాన శాస్త్రవేత్త యయిన ఐన్ స్టయిన్ ద్రవ్యసంచ యము (m) నకును, శక్తి (E) కిని గల సంబంధము E=m' అని చూపెను. ఈ సమీకరణములో c = కాంతి వేగము ( సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు), ఈ సిద్ధాంతము ప్రకారము ఆ ద్రవ్యరాశిలోని తగ్గుదల ఆ బీజబంధన శక్తికి సమానము. పరమాణుబీజముల విఘటనము (Disintegration of Atomic Nuclei): 1919 లో రూధర్ ఫర్డు మొట్ట మొదటగా పరమాణు బీజముల కృత్రిమ విఘటనము (artificial disintegration) ను సాధించెను. నత్రజని బీజములు ఆల్ఫాకణములచే ఘట్టింపబడగా, ప్రాణవా యువు ఉదజని బీజములలోనికి రూపాంతరము చెందెను. కొన్ని ప్రతిక్రియలలో (reactions) ఎక్కువశక్తి విడుదల కాబడెను. రూథర్ ఫర్డు పరిశోధనములు 'బీజగిడ్డంగి’ (Nuclear store house) నుండి కృత్రిమ సాధనములతో ఎక్కువ శక్తిని విడుదల చేయవచ్చునని చూ పెను.

న్యూట్రాన్ (Neutron) : 1932 లో ఆంగ్ల విజ్ఞాన శాస్త్రవేత్తయగు చాడ్విక్ న్యూట్రానును కనుగొ నెను. ఇది ఆవేశరహితమై తటస్థముగా నుండును. దీని ద్రవ్య రాశి ప్రోటానుకంటే కొంచె మెక్కువ. న్యూట్రాను, ప్రోటానులను 'న్యూక్లియానులు' (nucleons) అని యందురు. న్యూట్రాను విడిగా చాల కొద్దికాలమే (కొలది నిమిషములు) ఉండి ఒక ప్రోటాను ఒక ఎలక్ట్రానులోనికి మారును. తటస్థములగుటచే న్యూట్రానులు ద్రవ్యము లోనికి తేలికగా చొచ్చుకొనిపోయి బీజరూపాంతరములను బహు సమర్థతతో పెంపొంద జేయును. బీజవిధానముల 14