పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కేంద్రకణ భౌతిక శాస్త్రము


కొన్ని గ్రహముల చలనములలో జరుగబోవు వింతలను ముందుగ నే తెలియజేసెను. అవియన్నియు సరిగా ఆతడు చెప్పినట్లు జరిగినవి. అన్ని గ్రహముల కక్ష్యలయొక్క సరళ రేఖలు సూర్యుని కేంద్రముగుండా పోవునని కెప్లర్ రుజువుచేసి, సూర్య కుటుంబ చలనమునకు సూర్యుడే మూలశక్తియని స్పష్ట పరచి, భౌతిక ఖగోళశాస్త్ర మను విజ్ఞానశాఖను స్థాపించి శాశ్వతకీ ర్తి సంపాదించెను. గ్రహచలనమును గూర్చియు,

వాటి మధ్యగల దూరములను గూర్చియు అతడు వెల్ల డించిన ఉద్దేశములు ఉత్కృష్టములైనవి. 1830 వ సంవ త్సరము నవంబరు 15వ తేదీన కెప్లర్ 'రౌటిస్చన్ అను చోట దివంగతుడయ్యెను. 1724 వ సంవత్సరమున రెండవ కాధరీన్ రాణి, కెప్లర్ వ్రాసిన శాస్త్రగ్రంథావ శేషముల నన్నిటిని ఫ్రాంక్ ఫర్డు వ్యాపారులయొద్ది నుండి కొని 'పుల్కోవా' నక్షత్రావలోకన శాలయందు కాలము భద్రపరచి యుంచెను. బి. వి. ర.


కే కేంద్రకణ భౌతికశాస్త్రము : (Nuclear Physics) 66 భౌతిక విజ్ఞానశాస్త్రములో నొక నూతన శకము 1895 నుండి ప్రారంభ మైనదని చెప్పవచ్చును. ఆ సంవత్స రములోనే జర్మను శాస్త్రజ్ఞుడు రాంజన్ అను నాతడు “ఎక్స్” కిరణములను (X-rays) కనుగొనెను. ఎక్కువ వేగముగా ప్రయాణించు ఎలక్ట్రానులు ఒక ద్రవ్యము (matter) ను ఘట్టించి (bombard) నప్పుడు ఎక్స్ కిర ణము లుద్భవించును. ఇవి నల్లకాగితమును, పలుచని లోహపు రేకులను చొచ్చుకొని (penetrate) పోగలవు. ఛాయాచిత్ర ఫలకమును ఇవి నలుపుచేయును. భాసనము (phosphorescence) నకును ఎక్స్ కిర ణములకును ఏమైనా సంబంధమున్నదేమోనని అన్వే షించుచున్నప్పుడు ఫ్రెంచి విజ్ఞాన శాస్త్రవేత్తయగు బేక్వరల్ 1898 లో ఆకస్మికముగ రేడియో ఆక్టివిటీని కనిపెట్టెను. అప్పటినుండియే బీజచరిత్ర (nuclear history) మొదలిడినది. నల్లని కాగితములో చుట్టబడిన ఛాయాచిత్ర ఫలక మొకటి యురేనియం లవణము (ur- anium salt) చే మార్పు చేయబడుట ఆతడు కను గొనెను. దీనికి కారణము కొన్ని క్రొత్తకిరణములనియు, అవి యు రేనియమునుండియే వచ్చుచున్నవనియు అతడు స్థిరపరచెను. తరువాత క్యూరీసతి తన భర్తయగు పీరె క్యూరీతో కలసి, థోరియం అను ద్రవ్యమును, పొలో నియం, రేడియం అను రెండు ద్రవ్యములును ఈ కిరణములను ప్రసరింప జేయునని కనుగొనెను. వీటిలో రేడియం చాల శక్తిమంతమైనది. ఈ కిరణములు ఎల్లప్పు డును ప్రసరించుచునేయుండును. ఇవి గాలిని అయనీక రించును (ionise); అనగా తటస్థ వాయుకణములను విద్యుదావేశిత (electrically charged) కణములుగా మార్చును. వీటిని అయనులు (ions) అనియు, ఈ విధాన మును 'అయనీ కరణము' (ionization) అనియు అందురు. రేడియో ఆక్టివ్ కిరణప్రసరణ సందర్భములో చాలశక్తి విడుదల కాబడును, రేడియం కిరణముల యొక్క సామర్థ్యము పెక్కు రీతుల నుపయోగపడుట ప్రారంభమయ్యెను. పెక్కు చర్మవ్యాధులను, కాన్సరు (cancer) ను చికిత్స చేయుటలో రేడియం యొక్క ఉపయోగము సాటిలేనిది. రేడియం కిరణములు ప్రస్ఫురణ పదార్థములలో ప్రస్ఫురణము (Fluorescence)ను జనింపజేయును గాన అతి సూక్ష్మ మైన రేడియం రాసుల (quantities) ను జింకుసల్ఫైడు (Zine Sulphide) వంటి ప్రస్ఫురణ పదార్థములలోక లపి గడియారపు ముళ్ళమీదను, అంకెలమీదను, పరికరముల మీది చూపుడు ముళ్ళమీదను, విభజనలమీదను పూయు దురు. వీటిని చీకటిలో గూడ చూడవచ్చును. ఆల్ఫా (a) బీటా (B) గామా (X) కిరణములు : శక్తి వంతమైన అయస్కాంతిక క్షేత్రముగుండా రేడియో ఆక్టివ్ కిరణములు పోవునపుడు వాటివంపునుబట్టి వాటిలో మూడు రకములు కలవని ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త