పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేప్లర్ సంగ్రహ ఆంధ్ర


ప్రవీణుడై, 'గ్రహప్రభావము' లను సిద్ధాంతమును తన జీవితవి శేషములతో సరిచూచుకొనుట మొదలు పెట్టెను. అతడు సూర్యకుటుంబ క్రమమునుగూర్చి తీవ్రముగ నాలోచించి తన అభిప్రాయములను టుబిన్జన్ విశ్వ విద్యాలయమున 1596 వ, సంవత్సరమున ప్రకటించి గొప్ప ఖ్యాతిగాంచెను. అతని సమకాలికులును, ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞులు నగు టైకోబ్రాహి, గెలిలియోలతో ఆతనికి స్నేహము లభించెను.

గ్రాట్జ్ బార్బరా వాన్ మా లెక్ అను నామెను 1597 వ సంవత్సరములో కెప్లర్ వివాహమాడెను. ప్రేగ్ లోనున్న తన నక్షత్ర గణితశాలలో పనిచేయవలసినదని టైకోబ్రాహి కెప్ల రును కోరగా, కెప్లర్ గ్రాట్జ్ నుండి ప్రేగ్ వచ్చెను. 1601 వ సంవత్సర ములో టై కోబ్రాహి మరణించుటచే, కెప్లర్కు ఉజ్జ్వలమైన భావిజీవితము గోచరించెను. రెండవ రుడాల్ఫ్ చక్ర వర్తి అతనిని వెంటనే రాజగణితశాస్త్ర వేత్తగా నియమించెను. 'బై కోబ్రాహి చేసిన ఖగోళ శాస్త్ర పరిశీలన లన్నియు ఆతనిముం దుంచబడెను. కెప్లర్ మొదట చక్రవర్తి జాతకమును, తదితర రాజ కుటుంబములోనివారి జాతకములను చిత్రము. 2

సూత్రమునకు సంబంధించిన కొన్ని విషయములును గలవు. కుజగ్రహము తిరుగు కక్ష్యను గూర్చి కెప్లర్ తన పరిశోధనలను 1609వ సంవత్సరమున ప్రచురించెను. అతడు ప్రచురించిన వివిధ ఖగోళ శాస్త్ర విషయములలో ఆధునిక ఖగోళశాస్త్రమునందు ముఖ్యసూత్రములగు 'దీర్ఘవృత్త సూత్రములు', 'సమవైశాల్యములు' గురు త్వాకర్షణ శక్తి నిగూర్చి కొన్ని ముఖ్యములగు సత్యములు సముద్రపు పాటుపోటులపై చంద్రునికి గల ప్రభావము గ్రహ పరిభ్రమణములను గూర్చి తెలిసికొనుటకై అతడు చేసిన 'సుడులసిద్ధాంతము' అనునవి ముఖ్యములైనవి. కటక ములవలన గలుగు వక్రీభవనసిద్ధాం తమును కెప్లర్ వ్యాఖ్యానించుచు, ఖగోళమును పరీక్షించు దూరదర్శన యంత్రము యొక్క సూత్రములను సూచించెను. ఆ సూచన ఖగోళశాస్త్ర మునం దొక ప్రత్యేక శాఖ ఏర్పడుటకు పునాదియైనది. 1611వ సంవత్సరమున అతని భార్య మరణించెను. 1613లో అతడు సుసన్నా రూట్ లింగర్ అనునొక అనాధ బాలికను మరల వివాహమాడెను. 1617 లో కెప్లర్ వరుసగా కొన్ని పంచాంగము లను వ్రాయుట మొదలు పెట్టి, ఘా తాంక గణితములను (logarithms) అతడు ప్రప్రథమమున నుపయోగించెను, కెప్లర్ 1618- 21 లో 'కోపర్నికస్ శాస్త్రము' అను చక్కని పాఠ్యగ్రంథ మునురచించెను. ఘాతాంకగణితములఉపయోగము తరు కెప్లర్ వ్రా సెను. 'మహాసం యోగము' (great conjunction) అను నొక గ్రంథమును వ్రాసి, 1603 వ సంవత్సరమున ఆ చక్రవర్తికి అంకిత మిచ్చెను. తరువాత ఆకస్మికముగ ఆకాశమున బయలుదేరి సుమారు 17 నెలల వరకు కనబడుచుండిన నొక తేజోవంతమగు నక్షత్రమును గూర్చి 1606 లో కెప్లర్ తన పరిశీలనములను ప్రచు రించెను. కెప్లర్ చేసిన జీవితకృషిలో ముఖ్యమైన విషయము ఒక నూతన ఖగోళ శాస్త్రమును స్థాపించుట. అంతవరకును స్వేచ్ఛగా చేసిన ఊహలతో నున్న శాస్త్రమునకు బదులు భౌతిక కారణములతో సమర్థించుచు అతడాశాస్త్రమును 1604 లో ప్రచురించెను. దానియందు దృక్సిద్ధాంతమునకు సంబంధించిన ముఖ్యమగు ఆవిష్కరణములును, వక్రీభవన 10 వాత చాల వ్యాప్తి చెందినది. టై కోబ్రాహి ప్రారంభించి వదలిన 'రుడా ల్ఫైన్ లెక్కలపట్టీలు' అను గ్రంథమును కెప్లర్ 1627 లో పూర్తి చేసి ప్రచురించెను. ఆ పట్టీలు సుమారొక శతాబ్దమువరకును ఖగోళ శాస్త్ర పరిశోధన లకు ఆధారములైనవి. టైకోబ్రాహి గుర్తించిన నక్షత్ర ముల సంఖ్య 777. కెప్లర్ ఆ సంఖ్యను 1005 వరకు వృద్ధి చేసెను. 1628 వ సంవత్సరమున కెప్లర్ కుటుంబసహిత ముగా సై లీషియాకు చేరెను. 1636వ సంవత్సరము వరకు పంచాంగమునువ్రాసి, 1629 వ సంవత్సరముననే 10