Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్ష-కిరణములు

సంగ్రహ ఆంధ్ర

వేడిచేయుటచే జనించుటవలన, ఈ నాళములోని ఒత్తిడిని 0.001 మిల్లిమీటరు వరకు తగ్గించవచ్చును. ఒక నాళము నుండి వచ్చు X-కిరణముల స్వభావము ఆనోడ్, కాతోడ్ ల మధ్య నున్న విద్యుత్పీడన భేదము (Potential difference) మీదను, ఆనోడ్‌ను ఢీకొను ఎలక్ట్రానుల సంఖ్య మీదను ఆధారపడియుండును. కూలిడ్జినాళములో ఈ రెంటిని వేర్వేరుగా మార్చగలము కాని వాయునాళములో అట్లు చేయలేము. కూలిడ్జినాళమునకు గల ఈ సదుపాయమువలన ప్రస్తుతము కూలిడ్జినాళము ఎక్కువ వాడుకలో నున్నది.

X-కిరణముల ధర్మములు:

భ్రాశమానపుతెర (Fluorescent Screen) మీది చర్య : తుత్తునాగ-గంధకిదము (Zinc Sulphide), బేరియం ప్లాటినో సయనైడు (Barium platinocyanide) మొదలగు పదార్థములతో పూతపూయబడిన అట్టలపై X - క్ష కిరణములు పడినపుడు అవి కాంతితో మెరయును. X- క్ష కిరణములు అటువంటి అట్టపై బడునట్లు చేసి, X - కిరణముల మార్గమునకు అడ్డముగా మన చేయినుంచిన, మన చేతిలోని ఎముకలు అట్టమీద నల్లగా కనిపించును. దీనికి కారణము, X కిరణములు చేతియందలి మెత్తని భాగములను చొచ్చుకొనగలిగి, గట్టి ఎముకలను చొచ్చుకొన లేకపోవుటయే.

ఫొటోగ్రాఫిక్ పిల్ముమీద చర్య: సాధారణ కాంతికి వలెనే X - కిరణములకుగూడ ఫొటోగ్రాఫిక్ ఫిల్ముమీద చర్య గలదు. X - కిరణములు ఫిల్ముమీద పడిన తర్వాత, దానిని వికసింప (develop) చేసినచో, ఆఫిల్ముయొక్క వివిధ ప్రాంతములమీద పడిన X - కిరణముల తీవ్రతను కనుగొనవచ్చును. ఈ చర్యయొక్క సహాయముననే మనము మన శరీరములోని ఎముకలను 'ఫోటోగ్రాఫ్' చేయగలుగుచున్నాము. ఈ 'ఫొటోగ్రాఫ్' లను రాంట్ జెనోగ్రాములు (Rontgenograms) అందురు.

అయోనీకరణ గుణము (Ionising effect): X -కిరణములు ఒక వాయుపదార్థము ద్వారా పోవునపుడు ఆ వాయువునకు విద్యుద్వాహకశ క్తి సంక్రమించును. X - కిరణములయొక్క ఈ స్వభావమును ఉపయోగించి X-కిరణముల తీవ్రతను (intensity) కొలుచుచున్నారు.

జీవకణములమీది చర్య : X-కిరణములు జీవకణముల మీద పడినపుడు వాటిలో కొన్ని మార్పులు కలుగును. పరిస్థితులను బట్టి ఈ మార్పులు ఉపయోగకరముగా నుండవచ్చును. లేదా అపాయకరములు కావచ్చును. కాన్సర్ (పుట్టకురుపు) మొదలగు వ్యాధులచే గ్రస్తమైన జీవకణములను X-కిరణములవలన నిర్మూలింపవచ్చును. కాని X-కిరణములు వ్యాధిలేని జీవకణములపై బడిన, అవి చెడిపోయి కాన్సరు, లూకోమియా మొదలగు వ్యాధులకు దారి తీయవచ్చును. X-కిరణములను ఉపయోగించు వైద్యులును, శాస్త్రపరిశోధకులును ఈ కిరణములు కలుగజేయు దుశ్చర్యకు గురికాకుండ తగు జాగ్రతలు తీసికొందురు.

X-కిరణముల సహాయముచే వ్యాధులను గుర్తించుట (Diagnose) :

X-కిరణములు వ్యాధులను నిర్మూలించుట కన్న, వ్యాధులను గుర్తించుటకు ఎన్నో రెట్లు అధికముగా ఉపయోగపడు చున్నవి. మొట్ట మొదట శరీరములోనికి చొచ్చుకొని పోయిన తుపాకిగుండ్లు, సూదులు మొదలైనవాటిని కనుగొనుటకు, X-కిరణములను ఉపయోగించెడివారు. ప్రస్తుతము శరీరములో ఎక్కడ దెబ్బ తగిలినను లోని ఎముకలకు ప్రమాదము సంభవించినదియు లేనిదియు తెలిసికొనుటకు వెంటనే రాంట్ జెనోగ్రాం తీయించెదరు. 3 వ పటములో చేతికి దెబ్బతగిలినపుడు తీయించిన రాంట్ జెనోగ్రాం చూపబడినది.

శరీరములోని కొన్ని వ్యాధులను X-కిరణపరీక్షవలన గుర్తింపవచ్చును. మూత్ర పిండముల (Kidneys) లో ఏర్పడిన రాళ్ళను రాంట్ జెనోగ్రాంవలన సులభముగా కనుగొనవచ్చును. క్షయవ్యాధిని కనుగొనుటలో X-కిరణములను మించిన ఆయుధము మరియొకటి లేదు. అన్నకోశము, ప్రేగులు X-కిరణములమూలమున కనబడనప్పటికిని వాటిని X-కిరణములకు అపారదర్శకములు (opaque) గా నుండు పదార్థముతో నింపి X-కిరణపరీక్ష చేయవచ్చును. ఈ పద్ధతిని ఉపయోగించి పొట్టలోని కాన్సరువ్యాధి, పుండ్లు మొదలైనవాటిని గుర్తించుచున్నారు.

పరిశ్రమలలో X-కిరణముల ఉపయోగము : X-కిరణములు అన్ని పరిశ్రమలలోను పరిశోధనలకు విరివిగా

140