Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్ష-కిరణములు

రించి నపుడు ఆ బిందువువద్ద నాళము కరగుచుండెను. అందుచే 1896 వ సంవత్సరములో జాక్సన్ (jackson) అను శాస్త్రజ్ఞుడు నాళములో ఒక లోహపుముక్కను ఉంచి, ఎలక్ట్రానులు ఈ లోహపుముక్కను ఢీకొనునట్లు చేసెను. ఈ లోహమునే 'ఆంటి కాతోడు' (anticathode) లేక టార్జెట్ (target) అందురు. ఈ విధముగా మొదటి X - కిరణనాళము ఉద్భవించినది.

X కిరణములను ఉత్పత్తిచేయు విషయమున వేగముగా ప్రయాణముచేయు ఎలక్ట్రానులు, అవి డీకొనుటకు తగిన లోహము ముఖ్యమైన అంగములు. ఎలక్ట్రానులు ఉత్పత్తి అగు విధమునుబట్టి X కిరణనాళములను రెండు ముఖ్యమైన తెగలుగా విభజించవచ్చును. వాయునాళములు (gas tubes) అని పిలువబడువాటిలో ఎలక్ట్రానులు అయోనీకరణము (ionisation) వలన పుట్టుచున్నవి. కూలిడ్జి ట్యూబులు (Coolidge tubes) లేక వేడికాతోడ్ నాళములు (Hot-cathode tubes) అని పిలువబడు వాటిలో ఒక తీగను వేడిచేయుటవలన ఎలక్ట్రానులు ఏర్పడుచున్నవి. ఈ రెండువిధములైన నాళములలోను ఎలక్ట్రానులు వేగముతో ప్రయాణము చేయుటకు అతి తీవ్రతగల విద్యుత్ క్షేత్రములు (electric fields) అవసరము. ఈ విద్యుత్ క్షేత్రములను సాధారణముగా పరివర్తన యంత్రముల (transformers) వలన జనింప జేయుచున్నారు. ప్రస్తుతము వాయునాళములు అంతగా ఉపయోగపడకపోయినను అవి మొదట X - కిరణశాస్త్ర అభివృద్ధికి మిక్కిలి తోడ్పడినవి. ఈ రెండురకముల నాళములు ఈ క్రింద వర్ణింపబడినవి.

చిత్రము - 33

వాయు ఎక్స్-రే నాళము

C. కాతోడు; E. ఎలక్ట్రానులు ; F. ఫోకస్, A. ఆనోడు, T. టార్జెట్ ; W. ఎక్స్-కిరణములు వచ్చు ద్వారము

పటము - I

వాయునాళములు (gas tubes) :

పటములో ఈ నాళములోని ముఖ్యభాగములు చూపబడినవి. ఈ నాళములో గాలి 0.01 మిల్లి మీటరు ఒత్తిడివరకు తీసివేయబడి యుండును. అల్యూమినియం వంటి తేలికలోహముతో కాతోడు చేయబడును. ఆంటి కాతోడు (anti-cathode) మీద X (క్ష) కిరణములు ఉద్భవించు భాగమును నాభి (focus) అందురు. ధనధ్రువము (anode) ఋణధ్రువము (cathode) ల మధ్య 30,000 నుండి 60,000 వోల్టుల వరకు విద్యుత్పీడన భేదము (Potential difference) ఉండును. ఎలక్ట్రానులు (విద్యుదణువులు) డీకొనుటవలన ఆంటి కాతోడు త్వరలో చాల వేడి ఎక్కును. అందుచే ధనధ్రువ (anode) భాగము బోలుగాఉంచబడి, అందులో నీరు ప్రవహించునట్లు చేయబడినది. ఈ రకము నాళములో ఒక ముఖ్యమైన లోటు కలదు. ఇది కొంతకాలము పనిచేయగానే నాళములో పూర్తిగా శూన్యప్రదేశము (vaccum) ఏర్పడును. అందుచే నాళము పనిచేయదు. దీనిని నివారించుటకు కొన్ని నాళములలో కావలసినపుడు గాలిని సమకూర్చు ఏర్పాటుకూడ చేయబడును.

వేడి - కాతోడు నాళము (Hot-cathode tube) :

వేడి - కాతోడునాళము యొక్క భాగములు ఈ 2 వ పటములో చూపబడినవి.

చిత్రము - 34

కూలిడ్జి ఎక్స్-రే నాళము

C కాతోడు : E. ఎలక్ట్రానులు : F ఫోకస్, A ఆనోడు ; T. టార్జెటు, W. ఎక్స్-కిరణములు వచ్చుద్వారము ; L. టంగ్ట్సనుతీగ

పటము - 2


వాయునాళములో అయోనీకరణము (ionisation) వలన కావలసిన ఎలక్ట్రానులు (విద్యుదణువులు) జనించు చున్నవి. అందుచే అవి పనిచేయుటకు లోపల కొంత వాయుపదార్థము ఉండుట అవసరము. కాని వేడి-కాతోడు నాళములో ఎలక్ట్రానులు ఒక టంగ్ట్సను తీగెను

139