పుట:SamskrutaNayamulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
82

సంస్కృతన్యాయములు

మాత్స్యన్యాయము

పెద్దచేప చిన్నచేపను భక్షించును.

మార్జాలకబళన్యాయము

పిల్లి భోజనము చేయుచున్నవారియొద్దఁ గూర్చుండి వారెత్తు కబళములన్నియు తననిమిత్తమే యని తలఁచుచుండును.

మార్జాలకిశోరన్యాయము

పిల్లి తననోటితోఁ బల్లు తగులకుండ నతిజాగ్రతతోఁ బిల్లను తీసికొనిపోవును.

మార్జాలశీలన్యాయము

పిల్లినడత.

వైజ. 2. 19.

ఏమియు ముట్టుకొనని యట్లె యుండి కనుమాటయిన ప్రతి వస్తువులోను మూతి బెట్టి తినును.

మార్జాలదుగ్ధపానన్యాయము

పిల్లి కన్నులుమూసికొని పాలు త్రాగుచు తన్నెవ్వరును చూచుటలేదని తలంచినట్లు.

మాషరాశిప్రవిష్టమషీన్యాయము

మినుములరాశిలోఁ గలిసిన మసిమాదిరి.

మసికిని మినుములకును గల రంగు ఒకేమాదిరి నుండును. రాశిగాఁబోసిన మినుముల నలుపురంగు మఱింత దట్టమవును.