పుట:SamskrutaNayamulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
78

సంస్కృతన్యాయములు

"ఏవం హి సంశయాదినివృత్తి ర్మన్దవిషన్యాయేన సుకరా! బోధాదార్ఢ్యే ప్రతివాద్యాపాదితం తు సంశయాది తీవ్రవిషన్యాయేన దుష్పరిహరం స్యాత్‌! సద్యోభుక్తం విషం మన్ద మన్యథా తీవ్రమ్‌" (అప్పుడే భుజింపఁబడినది మందవిషము; చాలా తడవై జీర్ణించినది

తీవ్రవిషము.) (లౌకికన్యాయరత్నాకరము -పూర్వభాగము)

ఈన్యాయము 'తీవ్రవిషన్యాయము' నకు విరుద్ధము.

మరుమరీచికాన్యాయము :

ఎడారిలో నెండమావులు జలమువలెఁ గానుపించి యెంతదూరము పోయినను అట్లేయుండును.


మర్కటకిశోరన్యాయము :

కోతిపిల్ల తల్లి యొక చెట్టునుండి వేఱొక చెట్టునకు గంతులు వైచినను తల్లికడుపును బట్టుకొని విడువక యంటిపెట్టుక యుండును.

బలహీనుఁడు బలవంతుని అండ విడువఁడు.


మర్కటమదిరాపానాదిన్యాయము :

అసలే కోతి; కల్లు త్రాగినది; దయ్యము పట్టినది; తేలు కుట్టినది. (ఇఁకఁ నెట్లుండునో చూడుఁడు.)


మలినదర్పణన్యాయము :

మలినముగానున్న అద్దములో ప్రతిబింబముకూడ మలినముగానే యుండును.