పుట:SamskrutaNayamulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
74

సంస్కృతన్యాయములు

మణికంకణన్యాయము :

కంకణ మనుటతోడనే అందుఁ మణులుకూడ గలవని స్ఫురించును. అయినను మఱల మణిశబ్దప్రయోగ మొనర్తురు.

పర్వతాధిత్యకా, పర్వతోపత్యకాన్యాయములవలె.


మణిప్రభామణిమతిన్యాయము :

మణిప్రభను మణి యనియు మణిని మణిప్రభ యనియు భ్రమించి తుదకు వాస్తవము నెఱింగికొనుట. ఇయ్యదియే పరమాచార్యులచే నిట్లు వచింప బడియున్నది:-

"మణిప్రదీపప్రభయో ర్మణిబుద్ధ్యాభిధావతోః, మిథ్యాజ్ఞానావిశేషేపి విశేషోఽర్థక్రియాం ప్రతి||

దీపోఽపవరకస్యాన్తర్వర్తతే తత్ప్రభా బహిః, దృశ్యతే ద్వార్యథాఽన్యత్ర తద్దద్దృష్టా మణేః ప్రభా||

దూరే ప్రభాద్వయం దృష్ట్వామణిబుద్ధ్యాభిధావతోః, ప్రభాయాం మణిబుద్ధిస్తు మిథ్యాజ్ఞానం ద్వయోరపి||

నలభ్యతే మణి ర్దీపప్రభాం ప్రత్యభిధావతా, ప్రభాయాం ధావతావశ్యం లభ్యేతైవన మణి ర్మణేః||

దీపప్రభామణిభ్రాన్తి ర్విసంవాదిభ్రమః స్మృతః, మణిప్రభామణిభ్రాన్తిః సంవాదిభ్రమ ఉచ్యతే||"