పుట:SamskrutaNayamulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యవిద్యాప్రవీణులు, వైయాకరణులు, శంకరవిద్యాలయ ప్రధానాధ్యాపకులు బ్రహ్మశ్రీ ముళ్ళపూడి నారాయణశాస్త్రిగారు

రేపల్లె, 17 - 11 - 39.

తమరు పంపిన "సంస్కృతన్యాయములు" అను గ్రన్థము నామూలాగ్రముగ జదివితిని. అమందానందము నొందితిని. ఈ న్యాయవిజ్ఞానము విజ్ఞలోకములో మాటలాడు ప్రతి ప్రాజ్ఞఉనకు లోకజ్ఞాన సూచకమై నుడికారపుటందము సంపాదించును. ప్రతిచ్ఛాత్రునకు తాను చదివెడు ప్రతి శాస్త్రము నందలి సిద్ధాంతముల న్యాయపూర్వకముగా నెఱుగుట కవకాశ మిడును. ఈ న్యాయములందు తెలుగు సామెతల ననువదించునవి కొన్ని యున్నను చాలవరకు సంస్కృభాషాదుగ్ధోదధి మధించి వెలికి తీసిన నవనీతఘటికలె. వైదిక, లౌకిక శాస్త్రీయ వాజ్మయమూన్ందు ఆయా ప్రకరణములకు తత్తుల్య లౌకిక వ్యవహారములకు నుపయుక్తములగు న్యాయముల నన్నిటిని ఆయా శాస్త్రమర్యాదల నతిక్రమించని చక్కని శైలితో వ్యాఖ్యానముజేసి ఆంధ్రలోకమునకు ఆంధ్రభాషాయోషకు అమూల్యోపకార మొనర్చిన యీ సోదర కవుల కృతి నెంతయు నభినందించుచున్నాను.

(Sd.) ముళ్లపూడి నారాయణశాస్త్రి